Saturday, October 13, 2012

ఫైరవీలతోనే నంది అవార్డులు..?

    నంది అవార్డుల లొసుగు మరోసారి బయటపడింది. నంది అవార్డుల విషయంలో ఏటేటా అపవాదు మూటగట్టుకుంటున్న ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఫైరవీలతోనే నంది అవార్డులు వస్తాయా అనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

శ్రీరామరాజ్యం వంటి కళాత్మక చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు బాపు. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించిన బాపుకు అవార్డు రాకపోవడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్తమ చిత్రంగా ప్రకటించినప్పటికీ బాపు దర్శకత్వ ప్రతిభకు అవార్డు ప్రకటించలేదన్న విమర్శ ఉంది.

నందమూరి తారక రామరావు వంటి గొప్ప నటులకే నంది అవార్డులు రాలేదని, రాజకీయాలు చేస్తేనే నందులు వస్తాయని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. నంది అవార్డు పొందాలంటే తెరవెనుక రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉందని.. అలాంటి నీచ సంస్కృతి తనకు లేదని, అందుకే తనకు ఇంత వరకు నంది అవార్డు రాలేదని ఇటీవల మోహన్ బాబు తేల్చి చెప్పారు. గతంలో అనేక పర్యాయాలు నంది అవార్డుల మీద మెహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. అయితే ఈ సారి మాత్రం మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కు బెస్ట్ లేడీ విలన్ అవార్డు దక్కింది.

2011లో ప్రేక్షకుల ఆధరణ పొందిన సినిమాలను నంది అవార్డుల కమిటి విస్మరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా దూకుడు, శ్రీరామరాజ్యం చిత్రాలకు నందులు వరిస్తాయని ఊహించిందే. అయితే ఈ సినిమాలకు అవార్డుల పంట పండటంపై భిన్నభిప్రాయాలు లేకున్నా, బరిలో ఉన్న ఇతర చిత్రాలకు సమ న్యాయం జరగలేదన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

ఇతర కేటగిరీల్లో కందిరీగ, ఓమైఫ్రెండ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంటి చిత్రాలకు కూడా నందులు వస్తాయని భావించారు. కానీ ఈ చిత్రాలు ఎందుకూ పనికిరానివిగా జ్యూరీ తేల్చేసింది. మరి కొన్ని చిన్న సినిమాలకు అసలు ఛాన్సే ఇవ్వలేదని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. ఏదేమైనా ప్రతిభకు అందించాల్సిన అవార్డులు.. ఫైరవీలకు దాసోహం అవుతున్నాయన్న విమర్శలకు అవార్డుల కమిటీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

అవార్డుల వివరాలను జ్యూరీ సభ్యులు ఎస్‌.గోపాల్‌రెడ్డి ప్రకటించారు. అవార్డులను జనవరిలో ప్రదానం చేస్తారు.

more news updates
                       drusyam.net 
 


ఉత్తమ నటుడు : మహేష్‌బాబు(దూకుడు).
ఉత్తమ నటి : నయనతార(శ్రీరామరాజ్యం).
ఉత్తమ దర్శకుడు శంకర్‌ (జైబోలో తెలంగాణ).
ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం.
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న.
ఉత్తమ ద్వితీయ చిత్రం : విరోధి.
ఉత్తమ బాలల చిత్రం : శిఖరం.
రెండో బాలల ఉత్తమ చిత్రం : గంటల బండి.
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: అవయవదానం.
ఉత్తమ హాస్యనటి : రత్నసాగర్‌.
ఉత్తమ స్క్రీన్‌ప్లే : శ్రీనువైట్ల.
ఉత్తమ గీత రచయిత : సురేందర్‌.
ఉత్తమ మాట రచయిత : నీలకంఠ(విరోధి).
ఉత్తమ సంగీత దర్శకుడు : ఇలయరాజ.
ఉత్తమ వినోదభరిత చిత్రం : దూకుడు.
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్సెంట్‌ లవ్‌
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : జైబోలో తెలంగాణ
ఉత్తమ సహాయనటుడు : ప్రకాశ్‌రాజు(దూకుడు).
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి(ఇంకెన్నాళ్లు).
ఉత్తమ కథా చిత్రం : శ్రీనువైట్ల(దూకుడు).
ఉత్తమ గాయకుడు : గద్దర్‌ ( నడుస్తున్న పొద్దు మీద…)
ఉత్తమ కెమెరామేన్‌ పీఆర్కే రాజు (శ్రీరామరాజ్యం)
త్తమ క్వారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అక్కినేని (శ్రీరామరాజ్యం).
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్మెస్‌ నారాయణ (దూకుడు).
ఉత్తమ విలన్‌ మంచు లక్ష్మీ ప్రసన్న (అనగనగా ఓ ధీరుడు).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : షాలిని.
ఉత్తమనేపథ్య గాయని : మాళవిక.
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : శ్రీను.
ఉత్తమ బాలనటుడు : మాస్టర్‌ నిఖిల్‌.
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : నాగార్జున(రాజన్న).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : చార్మి
ఉత్తమ ఎడిటర్‌ : ఎమ్‌.ఆర్‌.వర్మ.

more news updates
                       drusyam.net 

Wednesday, October 10, 2012

అదీ.. అతిలోకసుందరి ఘనత..!


ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల రాణులు... ఇప్పుడు మళ్లీ తమ యాక్టింగ్ టాలెంట్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. మ్యారేజ్ తర్వాత కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన మాధురి దీక్షిత్... అజనాచ్లే (Aaja Nachle) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీ అదిరిపోతుందనుకున్న మాధురికి నిరాశే కలిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో  దేద్ ఇష్కియా, గులాబ్ గ్యాంగ్ వంటి సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో ఒకప్పుడు ఉన్న క్రేజీని మళ్లీ అందుకోలేకపోతోంది. మ్యారేజ్ లైఫ్ తర్వాత సినిమాలకు బై బై చెప్పిన కరిష్మా కపూర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఏడాది ఆమె నటించిన డేంజరస్ ఇష్క్... తో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కొద్ది రోజుల క్రితం పూరీ దర్శకత్వంలో అమితాబ్ నటించిన బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో నటించింది ఒకప్పటి బ్యూటీ రవీనా టాండన్. ఆ తర్వాత శోభనాస్ సెవెన్ నైట్స్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జూహీచావ్లా మర్యాదరామన్న బాలీవుడ్ రీమేక్ సన్నాఫ్ సర్థార్ లో కీలక పాత్రలో కనిపించబోతోంది. వరుసగా సినిమాలకు రెడీ అవుతున్న జూహీచావ్లా సెకండ్ ఇన్నింగ్స్ కు పెద్దగా క్రేజీ రావడం లేదని చెప్పవచ్చు.


ఒకప్పుడు తమ అందచందాలతో ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసిన ఈ తారలు... ఈ సారి పెర్ఫామెన్స్ తోనూ మెప్పించలేకపోతున్నారు. అయితే ఇదే టైమ్ లో వచ్చిన శ్రీదేవి మాత్రం ఊహించని అద్భుతం సాధించింది. వెటరన్ బ్యూటీలంతా ఇంతే.. అని అనుకుంటున్న వారందరిని తన సినిమాతో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.  అదిరిపోయే యాక్టింగ్ తో శ్రీదేవి చేసిన ఇంగ్లీష్-వింగ్లీష్ విడుదలైన అన్నిభాషల్లోనూ కేక పుట్టిస్తోంది.

పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి ఎలా మెప్పిస్తుందో అన్న సందేహాలకు ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాతో సమాధానం చెప్పింది. తోటి వెటరన్ బ్యూటీలకు సాధ్యం కానీ పనిని సులువుగా సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ అదరిపోయింది. మరి మున్ముందు శ్రీదేవి ఎలాంటి పాత్రలతో వస్తుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

more news updates
                       drusyam.net 



Friday, July 27, 2012

షారుక్: నిను చూడక నేనుండలేను..!

సల్మాన్ ఖాన్ దగ్గర్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఫరాఖాన్, అర్జున్ రాంపాల్ వరకు అందరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకొన్న షారుక్ ఇప్పుడు మారిపోయాడు. ఇండస్ట్రీలో స్నేహితుల కన్నా శత్రువుల జాబితా పెరిగిపోతుండటంతో లాభం లేదనుకోన్నాడో ఏమో… మొత్తానికి భూమ్మీదకొచ్చి అందరితో కలిసిపోయి… కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే శత్రుత్వాలు పక్కనబెట్టేసి మీడియా ముందు అందరినీ నా ఫ్రెండ్స్ అనేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తో.. ఆమె భర్త శిరీష్ కుందర్ తో తగువు పడ్డ షారుక్ ఇప్పుడు ఆమెతో కలిసి స్టెప్పులేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్, ఫరాఖాన్ స్టేజీ మీద కలిసి చిందులేశారు.

బాలీవుడ్ బెస్ట్ బడ్డీస్ గా పాపులరైన షారుక్, ఫరా మొన్నామధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఎవరి దారి వారు చూసుకొన్నారు. సుమారు రెండేళ్ల పాటు ఇద్దరూ ముఖాలు చూసుకోకుండా మీడియా ముందు తిట్టుకొన్నారు. ఇండస్ట్రీ ఈవెంట్స్ లోనూ ఇద్దరూ ఎడ మొహం-పెడ మొహంగానే ఉన్నారు.

భారతీయుల సొత్తుగా ఆకాశ హర్మ్యం..!

బుర్జ్ ఖలీఫా… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా పేరు పొందిన ఆకాశ హర్మ్యం. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా భారతీయుల సొత్తుగా మారిపోతోంది. అంబరాన్ని చుంబిస్తున్నట్టు కనిపించే ఈ ఆకాశ హర్మ్యంలో మనవాళ్ల అడ్రస్ లే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇందులో తొమ్మిది వందల వరకూ అపార్ట్ మెంట్లు ఉండగా అందులో వందకుపైగా భారతీయులవే కావడం విశేషం.

దుబాయికే మకుటంలా నిలిచిన ఈ భవంతి పొడవు 828 మీటర్లు కాగా… మొత్తం ఫ్లోర్ ఏరియా 50 లక్షల చదరపు అడుగులు. ఇందులో మొత్తం 163 ఫోర్లు ఉన్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లిఫ్ట్ లు ఈ భవంతిలో మొత్తం 54 ఉన్నాయి. రాత్రి వేళల్లో దేదీప్యమానంగా కనిపించే బుర్జ్ ఖలీఫా రోజుకు 50 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటుందంటే అవాక్కవ్వాల్సిందే. ఈ కరెంట్ తో మన దగ్గర చిన్నపాటి పరిశ్రామిక వాడలు నిరంతరాయంగా పనిచేయొచ్చు.




Tuesday, July 10, 2012

మహిళ ప్రధానిగా కరీనా..!


మహాభారతంలోని పాత్రలకు ఇప్పటి పరిస్థితులను జోడిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్‌ఝా తెరకెక్కించిన ‘రాజ్‌నీతి’ చిత్రం 2010లో విడుదలై సంచలనం సృష్టించింది. కత్రినాకైఫ్, అజయ్‌దేవ్‌గన్, రణభీర్‌కపూర్ ప్రధాన పాత్రల్ని పోషించారు. అయితే తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాజ్‌నీతి 2’ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో వున్నాడు ప్రకాష్‌ఝా.‘రాజ్‌నీతి 2’లో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా కరీనాకపూర్ నటించబోతోంది. మహిళా ప్రధానిగా పవర్‌ఫుల్ పాత్రలో కరీనా నటించబోతోందని సమాచారం. రాజకీయ నాయకురాలి పాత్రలో నటించడం తనకు కొత్త అనుభవమని కరీనాకపూర్ తన పాత్రపట్ల స్పందించింది...

 

Monday, July 9, 2012

సన్నీలియోన్ పై మోజుపడ్డ బిన్ లాడెన్..!


అమెరికాను ఒక దశలో గడదడలాడించిన అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ పై మనసు పారేసుకున్నాడా… అవుననే అంటున్నాడు సంచలన రామ్ గోపాల్ వర్మ. అల్ ఖైదా అగ్రనేత బిన్ లాడెన్ కూడా సన్నీకి వీరాభిమాని అని… ఆమె ఒంపుసొంపులకు ఫిదా అయ్యాడని… సన్నీ లియోన్ అశ్లీల చిత్రాలకు లాడెన్ బానిసలా మారాడని…  సన్నీ వీడియోలు చూస్తున్నప్పుడే అమెరికా దళాలు కాల్చి చంపాయని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వర్మ.

సినిమాలకు సమంత గుడ్ బై..!


వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత.. అభిమానులకు షాక్ లాంటి వార్త చెప్పింది. మరో మూడేళ్లలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపింది. ట్విట్టర్లో తన ఫాలోయర్స్ అడిగిన ప్రశ్నకు మరో మూడేళ్ళ దాక కెరీర్ కొనసాగించనున్నట్టు సమాధానం ఇచ్చింది. మంచి ఫ్యూచర్ ఉన్న ఈ క్యూట్ గర్ల్ సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న విషయం ఫ్యాన్స్ జీర్జించుకోలేకపోతున్నారు.