Saturday, June 8, 2013

‘బిజినెస్ మేన్’ చేతికి మరో బిగ్ బ్రాండ్..!

ఓ వైపున భారీ బడ్జెట్ సినిమాలు.. మరో వైపున భారీ స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు మహేష్ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరో బ్రాండ్ ను తన యాడ్స్ ఖాతాలో వేసుకున్న మహేష్.. సాటి హీరోలకంటే ఎంతో ముందున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ‘బిజినెస్ మెన్’ అనిపించుకుంటున్నాడు.

వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు మహేష్. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇతర కంపెనీల పోటీని తట్టుకునేందుకు తమ సంస్థకు ప్రచార కర్తగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించుకుంది దేశీయ ద్విచక్ర వాహనాల సంస్థ టీవీఎస్ మోటార్స్. సౌతిండియా మార్కెట్లో ఆ కంపెనీ అమ్మకాలు పెంచే దిశగా మహేష్ తో ఇక్కడ విస్తృత ప్రచారం చేయించనున్నారు. మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వల్ల తమ అమ్మకాలు పెరుగుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. ఈ డీల్‌కు గాను మహేష్ బాబుకు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.

More Latest Updates... www.drusyam.net   

 

 More Latest Updates... www.drusyam.net   

Friday, June 7, 2013

శ్రియ ‘పవిత్ర’ రివ్యూ - రేటింగ్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వేశ్యపాత్రలకు మాంచి డిమాండ్ వుంది. ఈ తరహా సినిమాలు హీరోయిన్లకు, దర్శకులకు మంచి క్రేజీ తీసుకువస్తాయి. ఇక నిర్మాతలకు కాసుల కూడా కురిపిస్తాయి. దీంతో  ఇప్పుడు  ఈ తరహాచిత్రాలు చేయడానికి  హీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అదే కోవలో వచ్చిన సినిమా ‘పవిత్ర’. సినిమా అవకాశాలు పెద్దగా లేని శ్రియ తన స్పీడ్ పెంచుకోవడానికి పవిత్ర సినిమాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఈ సినిమాలో తన పాత్రకు తగ్గ న్యాయం చేయగలిగింది.. దేవస్థానంతో మంచి అభిరుచి గల దర్శకుడిగా  పేరుతెచ్చుకున్న జనార్థన్ మహర్షి  రెండో ప్రయత్నంగా  ‘పవిత్ర' ను ప్రేక్షకులకు పరిచయంచేశాడు.

స్టోరీ:   పవిత్ర టైటిల్ రోల్ పోషించిన  హీరోయిన్ శ్రియ తన కుటుంబపరిస్థితుల కారణంగా  వేశ్యవృత్తిలోకి  వస్తుంది. వేశ్యవృత్తిలో సంపాదించిన దానిని అధిక మొత్తం సమాజ సేవ కోసం వెచ్చిస్తుంది. ఓ చీటర్ వల్ల  మోసపోయి.. అతని వల్ల వేధింపులకు గురి అవుతున్న ఆడవాళ్లను కాపాడి అతన్ని  జైలుకు పంపిస్తుంది. ఈ తరుణంలో రాజకీయనాయకుడిగా నటించిన సాయికుమార్ కొడుకు  కౌశిక్ ద్వారా రాజకీయలబ్ది పోందాలనుకుంటాడు. అమాయకంగా ఉండే సాయికుమార్ కొడుకు కౌశిక్  పవిత్రతో  పరిచయం అనంతరం  పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి చివరికి పెళ్లిచేసుకుంటాడు. శ్రియను అంతం చేయాలని చూసిన సాయికుమార్ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత  రాజకీయ నాయకురాలు అవ్వాలనుకున్న శ్రియ  ఎంతవరకు సక్సెస్ అయ్యింది.. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని సవాళ్లు ఎదుర్కుంది. అని చెప్పడానికి దర్శకుడు రెండు, మూడు కథలు ఈ సినిమాలో చొప్పించాడు.

హైలెట్స్:  పవిత్ర సినిమాలో  హైలెట్ అంటే శ్రియ దే. తాను తన పాత్రకు లోబడి నటించింది. ఒకరకంగా చెప్పాలంటే  సినిమానే తను నడిపించిందని చెప్పొచ్చు. ఒకరంగా చెప్పాలంటే ఎటువంటి బేషజాలకు పోకుండా కథకు తగ్గట్లు నటించి అదరహో అనిపించింది. కాకపోతే దర్శకుడు పవిత్ర టైటిల్ పెట్టినందుకు శ్రియ పవిత్రంగా చూపించాలని ఆరాటం చాలాచోట్ల కనిపిస్తుంది. ఇక సాయికుమార్  గురించి  కొత్తగా చెప్పనవసరం లేదు. తన పాత్రకు నూటికినూరుపాళ్లు న్యాయం చేశాడు. సాయికుమార్ కొడుకుపాత్ర చేసిన కౌశిక్ బాబు  బాగా నటించాడు.


Full Review &..
More Latest Updates... www.drusyam.net    



Wednesday, June 5, 2013

ఫ్యూచర్ కెరీర్ తేల్చిచెప్పిన పండుగాడు!

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పారు. రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని తెలిపాడు. ఇక టాలీవుడ్‌ను వదిలి వెళ్లే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని ప్రిన్స్ స్పష్టం చేశాడు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ ను మహేష్ బాబు ప్రారంభించాడు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం తమ వంతు సహాయం అందిస్తానని తెలిపాడు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘1 నేనొక్కడినే’ చిత్రం టీజర్ రికార్డు బ్రేక్ చేయటం సంతోషంగా ఉందని మహేష్ చెప్పుకొచ్చాడు. తన నట జీవితంలో 1 నేనొక్కడినే’ చిత్రం మైలు రాయిగా నిలుస్తుందని, అందులో కొత్త లుక్ తో కనిపిస్తానని తెలిపాడు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలకు స్పందిస్తూ, వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను. మరో పదేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంటానని ప్రిన్స్ స్పష్టం చేశాడు. స్టోరీ దొరికితే మల్టీ స్టారర్ సినిమాలకు కూడా సిద్దంగా ఉన్నట్టు మహేష్ తెలిపాడు.


Sunday, June 2, 2013

మహేష్ మరో రికార్డ్..!!

ప్రిన్స్ మహేష్ కొత్త సినిమా పేరుపై అనేక ఊహాగానాలు ప్రచారం జరిగిన తర్వాత వచ్చిన ’1 నేనెక్కడినే’ టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. చిత్ర నిర్మాత అనీల్ సుంకర ఈ విషయం డిక్లేర్ చేస్తూ… ట్రైలర్ వదిలిన 24 గంటల్లో… 2.7 లక్షల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిందని చెప్పారు. అలాగే.. 3,35,000 హిట్స్ తో ఈ సంఖ్య క్షణ క్షణానికి పెరుగుతోందని అని అన్నారు.

ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి సనన్‌ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం మహేష్‌బాబు సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. దీనికి వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ”పేరుకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకొనేందుకు చిత్రబృందం సమష్టిగా కృషి చేస్తోంది. నా సినీ జీవితంలో ’1′ ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. నాపై చూపుతున్న అభిమానానికి, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు” అన్నారు.

More Latest Updates... www.drusyam.net   
  
More Latest Updates... www.drusyam.net   

నెక్ట్స్ బర్తరఫ్ బుల్లెట్ ఎవరిపై..?

డీఎల్ రవీంద్రారెడ్డి తో పాటు మరో ఇద్దరు మంత్రులపై కూడా సీఎం వేటు వేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేఫథ్యంలో అసమ్మతి మంత్రులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఏ నిముషంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

ముఖ్యమంత్రి వ్యతిరేకిగా, అసమ్మతి మంత్రిగా ముద్రపడ్డ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై వేటు పడిన నేపథ్యంలో మంత్రి వర్గంలో అలజడి మొదలైంది. కిరణ్ కేబినేట్ లో నుంచి మరో ఇద్దరికి కూడా ఉద్వాసన తప్పదని ఊహాగానాలు వెలువడుతుండటంతో మంత్రుల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు సీఎంని వ్యతిరేకిస్తూ వస్తున్నవాళ్లు, వివిధ కేసుల్లో ఇరుక్కున్న మంత్రులకు ఈ టెన్షన్ ఇంకాస్త ఎక్కువగా ఉంది. అయితే ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Full Story &..
More Latest Updates... www.drusyam.net   

  
 More Latest Updates... www.drusyam.net  

Saturday, June 1, 2013

‘ఇద్దరమ్మాయిలతో’ రివ్యూ – రేటింగ్

పూరి జగన్నాధ్ కి తన మీదున్న ప్రేమే ‘ఇద్దరమ్మాయిలతో’ మూవీ అని.. ఆ ప్రేమ ఎంతనేది శుక్రవారం తెలుస్తుందంటూ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో వచ్చేశాడు. భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బన్నీకి ఎటువంటి ఫలితాన్నిచ్చింది. పూరీ తన సత్తా చూపించాడా? ఇంతకీ ఇద్దరమ్మాయిలతో ఫైనల్ రిజల్ట్ ఏంటీ? ఈ సినిమా కంప్లీట్ రివ్యూ మీ కోసం.

స్టైలిష్ స్టార్ బన్ని హీరోగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో పూరీ, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన దేశముదురు మంచి విజయం సాధించడంతోపాటు బన్నీ మాస్ ఇమేజ్ ను పెంచింది. చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపొందడంతో ఆది నుంచీ అంచనాలు పెరిగాయి.

ప్రతిసారి విదేశాలకు వెళ్లి కథ రాసుకుని సినిమా తీసే పూరి.. ఇద్దరమ్మాయిలతో చిత్ర కథను మరి కొంచెం డిఫరెంట్ గా రాసుకున్నాడు.  సంజయ్ రెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్ స్పెయిన్ లో గిటారిస్ట్ గా ఉంటూ బ్యాండ్ మెయినటైన్ చేస్తుంటాడు. సంగీతం నేర్చుకోవాటానికి వచ్చిన అమలాపాల్ ప్రేమలో పడుతాడు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి సిద్దమవుతారు. పెళ్లి నాలుగురోజులు ఉందనగా అనుకొని సంఘటన వల్ల వీరిద్దరి తల్లిదండ్రులు విలన్ చేతిలో హత్యకు గురువుతారు. వారిపై పగ తీర్చుకునే క్రమంలో క్యాథరిన్ ను ట్రాప్ చేసి ప్రేమలో పడేస్తాడు. నిజం తెలిసిన క్యాథరిన్ ఏం చేసింది. అసలు క్యాథరిన్ లవ్ లో పడేయాల్సిన అవసరం ఏందుకు వచ్చిందన్నదే చిత్రకథ.

అల్లు అర్జున్ చెప్పినట్టు పూరి కి తనమీద ఉన్న ప్రేమే ఈ సినిమా అయితే… పూరికి  అల్లు అర్జున్ మీద ప్రేమలేదనే చెప్పాలి. పూరి.. అల్లు అర్జున్ ఇమేజ్ క్యాష్ చేసుకోవడానికే ఇద్దరమ్మాయిలతో సినిమా తీసినట్టు అనిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ పాత్రకు తగ్గట్టుగా నటించాడు. లవర్ బాయ్ గా, ఆకట్టుకునే ఫైట్స్ లో మాస్ హీరోగా, అదరగొట్టే డ్యాన్స్ తో సినిమాకు ప్రాణం పోశాడు. డైలాగ్ డెలివరీ, మద్యమద్యలో తూటాల్లా పేల్చిన జోకులు సినిమాలో అర్జున్ ను ఆహా అనిపించాయి.

Full Review &..
More Latest Updates... www.drusyam.net    



టాలీవుడ్ ‘నెంబర్ వన్’.. మహేష్..?!

టాలీవుడ్ లో మరోసారి హాట్ హాట్ చర్చకు తెర తీశాడు ప్రిన్స్ మహేష్ బాబు.. ఇప్పుడు నేనే నంబర్ వన్ అంటున్నాడు. మహేష్ కొత్త సినిమా పేరుపై అనేక ఊహాగానాలు ప్రచారం జరిగిన తర్వాత వచ్చిన '1 నేనెక్కడినే' టైటిల్ టాలీవుడ్ లో భారీ చర్చకు తెర లేపింది. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరో ఎవరనే నెంబర్ గేమింగ్ ఈక్వేషన్లను మొదలుపెట్టింది. మహేష్ విజయాల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాకా పేరు పెట్టారో.. లేక నిజంగా మూవీకి ఈ టైటిల్ అవసరమో కానీ.. ప్రిన్స్ కొత్త మూవీకి నెంబర్ వన్ అనే టైటిల్ పెట్టేశారు. నిజానికి పోకిరి తర్వాత నుంచి మహేష్ ను నంబర్ వన్ చేసేసిన అభిమానులు దూకుడు హిట్ తర్వాత ఈ మానియాను మరింత పెంచారు. కలెక్షన్స్, డైలాగ్స్, శాటిలైట్ హక్కుల అమ్మకం ఇలా మహేష్ సినిమాలకు ఏదో ఒక రూపంలో పదే పదే నెంబర్ వన్ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తూనే ఉన్నారు.

ఈ మధ్య టాలీవుడ్ లో హీరోల మధ్య నంబర్ వన్ రేస్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఖాళీ అయిన స్థానం ఎవరిదంటూ చర్చ సాగుతూనే వుంది. వరస హిట్లతో మంచి స్వింగ్ లో ఉన్నాడు కాబట్టి మహేష్ బాబుదే ఆ స్థానమని చాలా ఫిక్సైపోయారు కూడా. దూకుడు, బిజినెస్ మ్యాన్ తర్వాత ఈ ఈక్వేషన్స్ మరింత ఊపందుకొన్నాయ్. అయితే సినిమా చేయడం వరకే నా బాధ్యత. నెంబర్‌‌వన్‌పై ఆలోచన లేదని మహేష్‌ చాలాసార్లు చెప్పినప్పటికీ.. విశ్లేషణలు మాత్రం ఆగలేదు.

నెంబర్ గేమింగ్ పై నాకు ఆసక్తి లేదని ప్రిన్స్ చెబుతున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో అభిమానులు, సినిమాలు తీసే ప్రొడ్యూసర్ల హంగామా చూస్తే మహేష్ కూడా మొదటి స్థానంపై కన్నేశాడనిపిస్తోంది. అందుకే చాలా టైటిల్స్ పరిశీలించిన తర్వాత తాజా సినిమాకి నేనొక్కడినే నెంబర్ వన్ టైటిల్ పెట్టారని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

Full Story &..
More Latest Updates... www.drusyam.net