Sunday, February 3, 2013

ఆన్‌లైన్ షాపింగ్‌లో Naapotol మోసం..!


ప్రస్తుతం మార్కెట్‌లోకి మొబైల్స్‌, పీసీలు, డిజిటల్‌ కెమేరాలు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఆయా సంస్థల మధ్య పోటీ, వినియోగదారుల ఆసక్తి వెరసి.. సరికొత్త ఫీచర్స్‌ వున్న పరికరాల పట్ల వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా బాగానే వుంది. కానీ అద్భుతమైన తగ్గింపు అంటూ Naapotol  వంటి ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి.

98 శాతం తగ్గింపు..! 72 శాతం తగ్గింపు..! అంటూ పత్రికల్లో, చానళ్లలో, వెబ్ సైట్లలో భారీగా యాడ్స్ గుప్పిస్తున్నారు. ఆకర్షణీయమైన ధరలను చూసి అనేక మంది మోసపోతున్నారు. సందరు వస్తువును కొనాలనుకున్న వారు ఫోన్ ద్వారా ఆర్డరు ఇవ్వగానే ఇంటికి వస్తుంది. కానీ ఆ వస్తువు పని చేయడం కష్టమే. మళ్లీ ఆ ఫోన్ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే ఫలితం సున్న. పత్రికలు, మీడియా కూడా ఈ మోసాలను రాయరు. కారణం వారికి నిత్యం Naapotol  యాడ్స్ వస్తూనే వుంటాయి. ఆన్‌లైన్ షాపింగ్‌ పెరుగుతున్న ఈ కాలంలో మోసాలు కూడా భారీగానే పెరగడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇలా మీరు కూడా మోసపోయారా..? అయితే ఆ వివరాలతో మీ కామెంట్స్ పెట్టండి. వారి మోసం బయటకు లాగుదాం.

Friday, November 23, 2012

రజినీ త్రీడి మూవీ @ 12-12-12

సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘శివాజీ’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సారి ఆధునిక హంగులు అద్దుకుని త్రీడీ రూపంలో ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. ఈ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాను 12-12-12 అంటే డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి డిసెంబర్ 12న ‘కొచ్చాడయన్’ సినిమా విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ‘శివాజీ త్రీడీ’ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.



కడప స్థానం నాదే..!


వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్ఆర్ సీపీ ఆశాకిరణం షర్మిల ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. రానున్న ఎన్నికల్లో జగన్‌ పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే, ఇదే సమయంలో జగన్‌ చిన్నాన్న వైఎస్ భాస్కరరెడ్డి తనయుడు అవినాష్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. అయితే, షర్మిల పాదయాత్ర ప్రారంభించే ముందు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని కుటుంబసభ్యులకు స్పష్టం చేశారని, ఆ మేరకు వారి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో పాదయాత్ర ప్రారంభించారని సమాచారం. సొంత కుటుంబీకులే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంత కుటుంబీకులే పార్లమెంటుకు వెళ్లాలని షర్మిల వాదించడంతో వారంతా అందుకు అంగీకరించారు.
అయితే.. చాలాకాలం క్రితం వరకూ ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న అవినాష్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బద్వేలు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావించారు. ఆ మేరకు ముందు ఒక తేదీ అనుకున్నప్పటికీ, బద్వేలు ఇంచార్జి గోవిందరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈనెల 23న బద్వేలు మండలం కలసపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.







Tuesday, November 20, 2012

అత్యంత ఖరీదైన ఖైదీ.!

తాజాగా ఉరి తీసిన ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఖైదీ. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన కసబ్ భద్రతకు ఇప్పటివరకూ ఖర్చుపెట్టిన మొత్తం 60 కోట్లు పైనే అని ఓ అంచనా. కసబ్ రక్షణ కోసం నెలకు సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఇకపై తమవల్ల కాదంటూ.. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొరపెట్టుకుంది. సైన్యంలో అత్యంత కీలకమైన విభాగానికి చెందిన నిపుణులైన మెరికల్లాంటి 250 మంది ఇండో-టిబెట్ బోర్డర్  సైనికులను కసబ్ భద్రత కోసం వినియోగించడంతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో తొలిసారిగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు ఇక్కడకు వచ్చి వాంగ్మూలమిచ్చారు.

మహరాష్ర్ట 28 కోట్లు..!
కసబ్ రక్షణ కోసం ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయలను ఖర్చుచేసినట్లు అర్జీలో తెలిపింది. ఆహారం, వైద్యం, భద్రతా సిబ్బంది కోసం భారీగా ఖర్చు పెట్టామని కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ తెలిపారు.

గదికి ఐదున్నర కోట్లు..!
కసబ్‌ ఇప్పటి వరకు ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో.. ప్రత్యేక గదికి ప్రభుత్వం 5.24 కోట్ల రూపాయల్ని ఖర్చుచేసింది. నరహంతుకుడి తిండికి, వైద్య అవసరాలకు, మందులకు, భద్రతా కల్పనకు కోట్లరూపాయలను నీళ్లలా ఖర్చుపెట్టింది.



మహేష్ యాడ్స్ ఆదాయం ఎంత?

టాలీవుడ్ బిజినెస్ మెన్ మహేష్ బాబు దూకుడు కొనసాగుతూనే వుంది. వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు మహేష్. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి ‘రాయల్ స్టాగ్’ కూడా చేరినట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో రాయల్ స్టాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ని ఎంపిక చేసినట్లు సమచారం. ‘రాయల్ స్టాగ్’కి ప్రచార కర్తగా వ్యవహరించేందుకు గాను మహేష్ భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మహేష్ ఇప్పటికే.. ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్’, యూనివర్సెల్, నవరత్న హెయిర్ ఆయిల్, ధమ్స్అప్, వివెల్, ఐడియా, జోష్ అలూకాస్, ప్రోవోగ్, అమృతాంజన్, సంతూర్, మహీంద్రా వంటి పన్నెండు బిగ్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. మరి కొన్ని కంపెనీలు ప్రిన్స్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నాయి.




టాలీవుడ్‌కు ఆ సత్తా లేదా?

గోవాలో జరుగుతున్న ’43వ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియా నుంచి 18 సినిమాలు ఎంపికయ్యాయి. అందులో తెలుగు సినిమాలకు మరోసారి పరాభవం ఎదురైంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చోటు దక్కించుకోలేక పోయింది.

కొత్త ప్రయోగాలు చేయడంలో మన టాలీవుడ్ ఎప్పుడు వెనకబడి ఉంటుందని చెప్పవచ్చు. సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం కేవలం కమర్షియల్ గా మాత్రమే ఆలోచించి సినిమాలు తీస్తుండటమే అవార్డులకు దూరం చేస్తోందని అంటున్నారు. ఈ మధ్య సినిమాలకు కలెక్షన్లు రావాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు బూతు, వివాదాలనే నమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.





Monday, November 19, 2012

మహేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటి?

స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ పెట్టాలంటే అది పెద్ద ప్రయత్నమనే చెప్పాలి. అందులోనూ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ వున్న హీరోలకైతే మరీనూ! పేరులో ఫోర్స్ వుండాలి… అతని ఇమేజ్ని హైలైట్ చేసేలా వుండాలి… అప్పుడే అభిమానులకి అది నచ్చుతుంది. అందుకే, అతని సినిమాలకు టైటిల్స్ పెట్టడానికి పెద్ద కసరత్తే చేస్తుంటారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రానికి గత కొన్నాళ్ళుగా అదే ప్రయత్నం జరుగుతోంది. మొదట్లో ‘ఆచార్య’ అనుకున్నారు. ఇది మరీ సాప్ట్ గా వుందని వద్దనుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిలో ‘తుంటరి’ ఒకటి. ఈ చిత్రానికి ‘తుంటరి’ అనే టైటిల్ పెట్టే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ స్పందించారు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ సుంకర వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని….అధికారిక సమాచారం వెలువడే వరకు పుకార్లను నమ్మ వద్దని అనిల్ సుంకర మహేష్ బాబు అభిమానులకు పిలుపునిచ్చారు.