Thursday, June 20, 2013

బాలీవుడ్‌లో ఓ అద్భుతం..!

బాలీవుడ్ లో ఇప్పుడు ఓ అద్భుతం జరుగుతోంది. రికార్డు కలెక్షన్లు సృష్టించే సత్తా ఉన్న ఖాన్ త్రయానికి ఇప్పుడు గండిపడబోతోంది. ఓ యంగ్ హీరో సినిమా వందల కోట్ల రూపాయల టార్గెట్ కు రీచ్ అవుతోంది. ఖాన్ త్రయానికి చెక్ పెడుతూ కళ్ళు చెదిరే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

బాలీవుడ్ లో ఇప్పుడు ఓ సరికొత్త సీన్ కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా సత్తా కొలవడానికి ప్రస్తుతం వంద కోట్ల క్లబ్ ను ప్రమాణికంగా తీసుకుంటున్నారనేది తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వంద కోట్ల క్లబ్ లో చేరుతున్న సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. దాంతో రానురాను వంద కోట్ల మార్కు కూడా కనుమరగయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా రిజల్టును కొలవడానికి రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు హద్దుగా మారే అవకాశం కనిపిస్తోంది. 

రానున్న రోజుల్లో బాలీవుడ్ లో బాక్సాఫీస్ సత్తాకు లక్ష్యం 200 కోట్ల కలెక్షన్లు హద్దుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు వందల కోట్ల క్లబ్ దాటిన ఏకైక హీర్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మాత్రమే. ఇప్పటి వరకు రెండు వందల కోట్లు వసూలు చేసిన ఇండియన్ సినిమా ‘త్రీ ఇడియట్స్’ మాత్రమే. అమీర్ నటించిన ’త్రీ ఇడియట్స్’ చిత్రం ఒక్క ఇండియాలోనే 202 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సాధించింది.


More Latest Updates... www.drusyam.net   

More Latest Updates... www.drusyam.net   

Friday, June 14, 2013

‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ రివ్యూ – రేటింగ్

వరుస ప్లాఫ్ లతో సతమతమౌవుతున్న హీరో సిధ్దార్థ్.. బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'సమ్ థింగ్ సమ్ థింగ్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు..  తెలుగులో, తమిళంలో హన్సికతో జత కట్టి వచ్చిన సిద్దార్థ్ కు సమ్ థింగ్ ఎటువంటి ఫలితాన్నిచ్చింది. ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పించిందా? ఇంతకీ సమ్ థింగ్ సమ్ థింగ్ ఎలా ఉంది? ఆ సినిమా రివ్యూ మీ కోసం.

ఓ బిగ్ హిట్స్ కోసం ఎదురుచూస్తున్న హీరో సిద్దార్థ్.. కామెడీనే నమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. గత చిత్రం జబర్దస్త్  డిజాస్టర్ అయినా.. అందులోని కామెడీకి పాజిటివ్ టాక్ రావడంతో.. తాజాగా రిలీజైన 'సమ్ థింగ్.. సమ్ థింగ్'లో కామెడీ ట్రాక్ ను ట్రై చేసి కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. కొలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుందర్.సి తెరకెక్కించిన ఈ మూవీ  తెలుగు, తమిళ భాషల్లో పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. ఈ మూవీ స్టోరీ లైన్ రోటీనే అయినా... కామెడీ, స్ర్కీన్ ప్లే కాస్తంత కొత్తగా వుండటం వల్ల ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సిధ్దార్థ్ హిట్ సినిమాలోని పాట 'సమ్ ధింగ్ సమ్ థింగ్' లైన్ ని సినిమా టైటిల్ ఎంచుకుని వచ్చిన సినిమాతో సర్ ఫ్రైజ్ చేస్తాడనుకుంటే సాటిస్ ఫై  మాత్రమే చేయగలిగాడు.

స్టోరీ: కుమార్ పాత్ర చేసిన హీరో సిద్దార్థ్..  ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. సంజన పాత్ర చేసిన హన్సిక అదే కంపెనీలో ఎంప్లాయ్.. చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో ఎదురైన చిత్కారాల వల్ల  ప్రేమ అంటే ఇంట్రెస్ట్ చూపడు. అలాంటి  ప్రేమ ద్వేసి సిద్దార్థ్.. హన్సిక ను చూసిన తొలిచూపులొనే ప్రేమలో పడుతాడు. ప్రేమ గురించి సరైన అవగాహానలేని సిద్దార్థ్ సలహాల కోసం ప్రేమజీ పాత్ర చేసిన బ్రహ్మానందంని ఆశ్రయిస్తాడు. బ్రహ్మనందం ఇచ్చే సలహాలతో ఇంప్రూవ్ అవుతాడు మన హీరో. అంతా బాగుందని అనుకునే సమయంలో గణేష్ వెంకట్రామన్ చేసిన లవ్ ప్రపోజ్ కు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీంతో అతి కష్టం మీద వీరిద్దరి ప్రేమను చెడకొట్టిన సిద్దార్థ్.. ఆ తర్వాత అనేక కష్టాలు పడి హన్సిక ను లైన్ లో తెచ్చుకుంటాడు. తనను  ప్రేమలో పడేయడానికి మన హీరో ప్లేచే సిన చీఫ్ ట్రిక్స్ హన్సిక కు తెలుస్తుంది. తర్వాత సిద్దార్థ్.. లవ్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేదే మిగతా కథ.

Full Review &..
More Latest Updates... www.drusyam.net    




More Latest Updates... www.drusyam.net    

Wednesday, June 12, 2013

వావ్.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్..!

యంగ్ టైగర్ కూడా చొక్క విప్పేసి హల్ చల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తోటి హీరోలకు పోటీగా తనూ కూడా ఈ సిక్స్ ప్యాక్ ను చూపించే సమయం వచ్చేసిందంటూ.. ‘రామయ్య వస్తావయ్యా’ సరికొత్తగా ముస్తాబవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సిక్స్ ప్యాక్ కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిటినెస్ ట్రైనర్… జాన్ షుమెత్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. బాద్షాలో చేసిన అజీజ్ ఖాన్.. ఎన్టీఆర్ కు ఈ ట్రైనర్ ని పరిచయం చేసారు.

అజీజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ తన ఫిజిక్ ఫిటినెస్ కోసం చాలా శ్రద్దగా వర్కవుట్స్ చేస్తున్నారు. ఆయన మంచి ట్రైనర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో జాన్ పేరుని నేను ప్రపోజ్ చేసాను. ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఇది పండుగలా ఉంటుంది” అన్నారు.

More Latest Updates... www.drusyam.net 


Monday, June 10, 2013

బీజేపీ రెండుగా చీలుతుందా..?

బీజేపీలోచిచ్చు రేగింది. అద్వానీ రాజీనామాతో అగ్నిపర్వతం బద్దలైనంత పనయ్యింది. గుజరాత్ ముఖ్యమంత్రి ప్రాబల్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అద్వానీ  పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా గుజరాత్ సీఎం మోడీ పట్ల వ్యతిరేకత కనబరుస్తున్న అద్వానీ. పార్టీ పదవులకు రాజీనామాచేసి ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చారు.

బీజేపీ సమావేశాలంటే ఎప్పూడూ టంచన్ గా హాజరయ్యే అగ్రనేత అద్వానీ గోవా మీట్ కి  గైర్హాజరయ్యారంటే.. బీజేపీలో అంతర్యుద్దం తారా స్థాయికి చేరిందనే సంకేతాలు వెలువడ్డాయి. అయినా మోడీపై వ్యతిరేకతను లోలోపలే అణచుకున్న అద్వానీ ఎక్కడా బయటపడలేదు.. మరోవైపు బీజేపీలో ఎప్పటినుంచో ఈ విషయంపై కోల్డ్ వార్ నడుస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఆయనే బీజేపీ ప్రధాని అభ్యర్ధని ఊహాగానాలు జోరందుకోవడంతో.. తాను సైతం రేసులో ఉన్నానంటూ అద్వానీ సంకేతాలిచ్చారు. దీంతో  అద్వానీ సపోర్టర్స్ బయటకొచ్చారు.  అద్వానీ లేకుంటే పార్టీయే లేదంటూ ఒకరంటే.. మోడీకాన్నా ఈయనే బెటరని మరొనేత వ్యాఖ్యానించారు.. సీనియర్ నేత మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలాంటి వారైతె ఇప్పటికీ అద్వానీనే కరెక్టని బహిరంగంగా సమర్దిస్తున్నారు.

More Latest Updates... www.drusyam.net   

More Latest Updates... www.drusyam.net   




Saturday, June 8, 2013

‘బిజినెస్ మేన్’ చేతికి మరో బిగ్ బ్రాండ్..!

ఓ వైపున భారీ బడ్జెట్ సినిమాలు.. మరో వైపున భారీ స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు మహేష్ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరో బ్రాండ్ ను తన యాడ్స్ ఖాతాలో వేసుకున్న మహేష్.. సాటి హీరోలకంటే ఎంతో ముందున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ‘బిజినెస్ మెన్’ అనిపించుకుంటున్నాడు.

వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు మహేష్. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇతర కంపెనీల పోటీని తట్టుకునేందుకు తమ సంస్థకు ప్రచార కర్తగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును నియమించుకుంది దేశీయ ద్విచక్ర వాహనాల సంస్థ టీవీఎస్ మోటార్స్. సౌతిండియా మార్కెట్లో ఆ కంపెనీ అమ్మకాలు పెంచే దిశగా మహేష్ తో ఇక్కడ విస్తృత ప్రచారం చేయించనున్నారు. మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వల్ల తమ అమ్మకాలు పెరుగుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. ఈ డీల్‌కు గాను మహేష్ బాబుకు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.

More Latest Updates... www.drusyam.net   

 

 More Latest Updates... www.drusyam.net   

Friday, June 7, 2013

శ్రియ ‘పవిత్ర’ రివ్యూ - రేటింగ్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వేశ్యపాత్రలకు మాంచి డిమాండ్ వుంది. ఈ తరహా సినిమాలు హీరోయిన్లకు, దర్శకులకు మంచి క్రేజీ తీసుకువస్తాయి. ఇక నిర్మాతలకు కాసుల కూడా కురిపిస్తాయి. దీంతో  ఇప్పుడు  ఈ తరహాచిత్రాలు చేయడానికి  హీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అదే కోవలో వచ్చిన సినిమా ‘పవిత్ర’. సినిమా అవకాశాలు పెద్దగా లేని శ్రియ తన స్పీడ్ పెంచుకోవడానికి పవిత్ర సినిమాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఈ సినిమాలో తన పాత్రకు తగ్గ న్యాయం చేయగలిగింది.. దేవస్థానంతో మంచి అభిరుచి గల దర్శకుడిగా  పేరుతెచ్చుకున్న జనార్థన్ మహర్షి  రెండో ప్రయత్నంగా  ‘పవిత్ర' ను ప్రేక్షకులకు పరిచయంచేశాడు.

స్టోరీ:   పవిత్ర టైటిల్ రోల్ పోషించిన  హీరోయిన్ శ్రియ తన కుటుంబపరిస్థితుల కారణంగా  వేశ్యవృత్తిలోకి  వస్తుంది. వేశ్యవృత్తిలో సంపాదించిన దానిని అధిక మొత్తం సమాజ సేవ కోసం వెచ్చిస్తుంది. ఓ చీటర్ వల్ల  మోసపోయి.. అతని వల్ల వేధింపులకు గురి అవుతున్న ఆడవాళ్లను కాపాడి అతన్ని  జైలుకు పంపిస్తుంది. ఈ తరుణంలో రాజకీయనాయకుడిగా నటించిన సాయికుమార్ కొడుకు  కౌశిక్ ద్వారా రాజకీయలబ్ది పోందాలనుకుంటాడు. అమాయకంగా ఉండే సాయికుమార్ కొడుకు కౌశిక్  పవిత్రతో  పరిచయం అనంతరం  పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి చివరికి పెళ్లిచేసుకుంటాడు. శ్రియను అంతం చేయాలని చూసిన సాయికుమార్ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత  రాజకీయ నాయకురాలు అవ్వాలనుకున్న శ్రియ  ఎంతవరకు సక్సెస్ అయ్యింది.. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని సవాళ్లు ఎదుర్కుంది. అని చెప్పడానికి దర్శకుడు రెండు, మూడు కథలు ఈ సినిమాలో చొప్పించాడు.

హైలెట్స్:  పవిత్ర సినిమాలో  హైలెట్ అంటే శ్రియ దే. తాను తన పాత్రకు లోబడి నటించింది. ఒకరకంగా చెప్పాలంటే  సినిమానే తను నడిపించిందని చెప్పొచ్చు. ఒకరంగా చెప్పాలంటే ఎటువంటి బేషజాలకు పోకుండా కథకు తగ్గట్లు నటించి అదరహో అనిపించింది. కాకపోతే దర్శకుడు పవిత్ర టైటిల్ పెట్టినందుకు శ్రియ పవిత్రంగా చూపించాలని ఆరాటం చాలాచోట్ల కనిపిస్తుంది. ఇక సాయికుమార్  గురించి  కొత్తగా చెప్పనవసరం లేదు. తన పాత్రకు నూటికినూరుపాళ్లు న్యాయం చేశాడు. సాయికుమార్ కొడుకుపాత్ర చేసిన కౌశిక్ బాబు  బాగా నటించాడు.


Full Review &..
More Latest Updates... www.drusyam.net    



Wednesday, June 5, 2013

ఫ్యూచర్ కెరీర్ తేల్చిచెప్పిన పండుగాడు!

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పారు. రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని తెలిపాడు. ఇక టాలీవుడ్‌ను వదిలి వెళ్లే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని ప్రిన్స్ స్పష్టం చేశాడు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ ను మహేష్ బాబు ప్రారంభించాడు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం తమ వంతు సహాయం అందిస్తానని తెలిపాడు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘1 నేనొక్కడినే’ చిత్రం టీజర్ రికార్డు బ్రేక్ చేయటం సంతోషంగా ఉందని మహేష్ చెప్పుకొచ్చాడు. తన నట జీవితంలో 1 నేనొక్కడినే’ చిత్రం మైలు రాయిగా నిలుస్తుందని, అందులో కొత్త లుక్ తో కనిపిస్తానని తెలిపాడు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలకు స్పందిస్తూ, వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను. మరో పదేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంటానని ప్రిన్స్ స్పష్టం చేశాడు. స్టోరీ దొరికితే మల్టీ స్టారర్ సినిమాలకు కూడా సిద్దంగా ఉన్నట్టు మహేష్ తెలిపాడు.