Thursday, December 26, 2013

ఫేస్‌బుక్ బాధితులకు ఓ వేదిక


సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ వల్ల లాభాల మాటేమిటోగానీ, మోసాలు కూడా జరుగుతున్నాయి. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మోసగాళ్లు జోరుగా విజృంభిస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ తో అమాయకులకు వల వేస్తున్నారు. ఫేస్ బుక్ వల్ల మోసపోయిన బాధితులకు ఓ వేదిక కల్పిస్తోంది 'సీవీఆర్' న్యూస్ చానల్. 'ఉమెన్స్ విండో' లైవ్ షో ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. ఫేస్ బుక్ వల్ల మోసపోయిన వారు, ఈ విషయంపై చర్చించాలనుకున్న వారికి ఆహ్వానం. వివరాలకు 8978181371

..

Wednesday, December 11, 2013

వర్థమాన ప్రతిభావంతులతో ఫిల్మ్ ఫ్యాక్టరీ

తక్కువ బడ్జెట్ తో సినిమా తీయాలనుకుంటున్న టాలీవుడ్ మూవీ మేకర్ల కోసం వర్థమాన ప్రతిభావంతులతో 'న్యూ జనరేషన్' ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ 'న్యూ జనరేషన్' ఫిల్మ్ ఫ్యాక్టరీలో స్టోరీ రైటర్స్, లిరిక్ రైటర్స్, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, వీడియో ఎడిటర్లు, ఆర్టిస్టులు, జూ.ఆర్టిస్టులు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాకు సంబంధించిన 24 శాఖలకు చెందిన వర్థమాన ప్రతిభావంతులు ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఉన్నారు.

వంద మంది సభ్యులతో కూడిన ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీ.. సినిమా తీయాలనుకుంటున్న నిర్మాతలకు పూర్తి భరోసాగా నిలుస్తుంది. న్యూటాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనుకున్న వారికి అన్ని శాఖల నుంచి తాము పూర్తి సహాకారం అందిస్తామని 'న్యూ జనరేషన్' ఫిల్మ్ ఫ్యాక్టరీ తెలిపింది. ఈమెయిల్  telugufilmfactory@gmail.com


telugufilmfactory@gmail.com

Thursday, July 11, 2013

నయనను వెంటాడుతున్న ఆ చేదు జ్ఞాపకాలు..!

సినిమాను మించిన సినిమా. తెరపై స్టార్ హీరోయిన్.. తెర వెనుక ఫ్లాప్ లవ్ స్టోరీస్. ఇదీ నయనతార పరిస్థితి. సినిమాలకంటే ప్రేమ, పెళ్లి విషయంలోనే నయన అనేకసార్లు వార్తలకెక్కింది. అయితే ఎప్పుడూ వార్తలలో నానే ఆమె పెళ్లి వ్యవహారమే ఒక కొలిక్కి రావడంలేదు. ప్రేమికుడి పేరు మారుతుందిగానీ ఆ మూడు ముళ్లు మాత్రం పడటంలేదు.
సౌత్ స్టార్ హీరోయిన్లలో నయనతార రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ తోనే ఎక్కువ సార్లు వార్తలకెక్కుతోంది. సౌత్ సినిమాల్లో టాప్ పొజిషన్ కు చేరుకున్న ఈ కేరళ కుట్టికి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు మాత్రం కలిసిరావడంలేదు. ప్రేమికుడి పేరు మారుతుందిగానీ ఆ మూడు ముళ్లు మాత్రం పడటంలేదు. నయన ప్రేమ – పెళ్లికి సంబంధించి కొన్ని నిజాలు, కొన్ని గాసిప్స్ మళ్లీ జోరుగా ప్రచారమవుతున్నాయి.
లవ్ ఫెయిల్యూర్స్ నయనను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అప్పట్లో తమిళ నటుడు శింభుతో ఆమె ప్రేమ వ్యవహారం పెద్ద వార్త అయింది. వారిద్దరూ చాలా కాలం కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో వారిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం కూడా మూడేళ్ల పాటు కొనసాగింది. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని కూడా చెప్పింది. అయితే చివరి క్షణంలో ఏంజరిగిందో ఏమో హఠాత్తుగా పెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవాకు దూరమైంది.

నిర్ణయవేళలో నీడలా నడిపిస్తున్న ఆ ఇద్దరు


ఏపీ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో..రాష్ట్ర మంతా హస్తిన వైపే చూస్తోంది. తెలంగాణపై తెల్చేసే దిశగా చర్జలు సాగుతున్నాయన్న వార్తలతో రాష్ట్రనేతలంతా కొద్దిరోజులుగా దేశరాజధానికి క్యూకడుతున్నారు. సమైక్య, ప్రత్యేక వాదాలు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లే మన మంత్రులు, ఎమ్మెల్యేలకు కేవీపీ, జైపాల్ రెడ్డిలే కేరాఫ్ అడ్రస్. సీమాంధ్ర నేతలకు పెద్దదిక్కుగా కేవీపీ తెలంగాణ నాయకులకు మార్గదర్శిగా జైపాల్ రెడ్డి అక్కడ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.   వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అప్పట్లో డామినేటింగ్ పాలిటిక్స్ ప్లే చేసిన కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం హైకమాండ్ కి వీరవిధేయుడు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతోనే కేవీపీ ఇంపార్టెన్స్ మరింత పెరింగింది. రాజశేఖరరెడ్డితోపాటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేవీపీ కూడా వెళ్లేవారు. అలా అధిష్ఠానంతో ఏర్పడ్డ ఆ సత్సంబంధాలను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు.

రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్ రెబల్ జెండా ఎగరేసినా  కేవీపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానందగ్గర మంచి మార్కులు కొట్టేశారు.  వైఎస్ ప్రాణ స్నేహితుడిగా ఆయన కూడా తిరుగుబాటు బావుటా ఎగరేస్తారమోనన్న అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర పెంచుకుంటూ ముందుకు నడిచారు. ప్రస్తుతం సీమాంధ్ర నేతలకు ఆయనే బిగ్ బాస్.. భాగ్యనగరం నుంచి  డైరెక్టుగా అధిష్ఠానం దగ్గరకు వెళ్లలేని నేతలంతా కేవీపీ ద్వారానే రాయబారం నడుపుతుంటూరు. ముఖ్యంగా తెలంగాణ సమైక్య నినాదాలు జోరందుకున్న ప్రతీ సారీ కేవీపీ కీలకపోత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై తీవ్ర చర్చలు జరుగుతున్న ఇప్పుడు కూడా కేవీపీ సీమాంధ్ర నేతలను లీడ్ చేస్తోన్నారు.

మరోవైపు తెలంగాణ నేతలకు పెద్దన్నగా జైపాల్ రెడ్డి వ్యవహిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న  జైపాల్ రెడ్డిని సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో పదవులు వరించాయి…హైకమాండ్ కి నమ్మిన బంటుగా ఉండే జైపాల్ కి సోనియా దగ్గర మంచి చనువు.. పలుకుబడి ఉందని చెబుతుంటూరు. రాష్ట్రానికి చెందిన ఏ సమాచారమైనా  అధిష్ఠానం జైపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుంటుంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న జైపాల్ చాలా సందర్భాల్లో హైకమాండ్ కి రాష్ట్ర నేతలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూవచ్చారు.  తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంత వాసులకు జైపాల్ పెద్ద దిక్కైయ్యారు. అధిష్ఠానానికి ప్రత్యేక వాదన వినిపించాలనుకునే తెలంగాణ వాదులు ముందుగా ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డినే ఆశ్రయిస్తారని టాక్ . ఆయన సలహా సూచనలతో ఢిల్లీ పెద్దలను కలిసి తమ వాదనను వినిపిస్తారు.
More Latest Updates... www.drusyam.net    

Monday, July 8, 2013

ఎక్స్‌క్లూజివ్: బాహుబలి షూటింగ్ కవరేజ్

రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘బాహుబలి’. చిత్రీకరణ కార్యక్రమాలకు కర్నూల్ జిల్లాలోని రాక్ గార్డెన్స్ లో కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. చిత్రీకరణ చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దాంతో రాతివనాలు కిక్కిరిసిపోయాయి.

Saturday, July 6, 2013

బొత్స అడ్డంగా దొరికిపోతాడా?

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంల కంటే పీసీసీ చీఫ్ బొత్స చాలా ఫాస్ట్ గా కసరత్తుచేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఉభయ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ఎంపీల నుంచి కూడా తెలంగాణ అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తమ అభిప్రాయాల మాట అలా ఉంచి...పీసీసీ ఛీఫ్ మీ అభిప్రాయమేమిటని కొందరు నేతలు ఎదురు ప్రశ్న వేయడంతో సత్తిబాబు జవాబు చెప్పలేక పోతున్నారు.

తెలంగాణా ఉద్యమం ఉధృతమైనపుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనను సమర్ధిస్తానని బోల్డ్ గా  స్టేట్ మెంట్  ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే కారణం వల్లే  పీసీసీ ఛీఫ్ పదవికి బొత్స పేరును ప్రతిపాదించినపుడు టి.కాంగ్రెస్ నేతలు సైతం పూర్తిగా మద్దతిచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొత్స తెలంగాణపై ఆచి,తూచి స్పందించడం మొదలు పెట్టారు.

పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలపడానికి కూడా బొత్స విముఖత చూపారంటే ఆయన వైఖరిలో వచ్చిన మార్పుపై టి.కాంగ్రెస్ నేతలు సైతం విర్శించే పరిస్ధితి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వ్యక్తిగతంగా తనకు ఎన్ని అభిప్రాయాలైన ఉండొచ్చు కానీ.. ప్రస్తుతం హైకమాండ్ మైండ్ సెట్ కి అనుగుణంగానే నడుచుకుంటానని సత్తిబాబు సెలవిస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసి ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్వజయ్ సింగ్ చెప్పడంతో బొత్స ఎవరికి అనుకూలంగా నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశమయ్యింది.