జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గాడా? ఫ్యాన్స్ వ్యతిరేకత వల్లే తాజా కామెంట్లు చేశాడా? తాజా సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోందంటున్నారు. అయినా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారే తప్ప, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేస్తానని ప్రకటించలేదు…ఆయనపై విధేయత ప్రకటించలేదు. చంద్రబాబుతో ఎన్టీఆర్ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. దమ్ము సినిమాపై జరిగిన మీడియా మీట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. వంశీతో జగన్ భేటీ తన సూచన మేరకే జరిగిందనే వార్తలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
drusyam.net
drusyam.net

No comments:
Post a Comment