Tuesday, May 15, 2012

అందమైన భామలు - అదిరిపోయే రేట్లు


హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ రెమ్యూనరేషన్ విషయంలోనూ తమకు హద్దేలే లేవంటున్నారు టాలీవుడ్ హీరోయిన్లు.  రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటి పడుతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్న  హీరోయిన్స్ రెమ్యునేషన్స్ వింటే పెద్ద నిర్మాతలు సైతం ఖంగుతింటున్నారు. షాక్ గురిచేసేలా వారి పారితోషికం పెంచుతూనే వున్నారు.

drusyam.net

కళ్ళు చెదిరే అందం మాధురి దీక్షిత్ !

అది బాలీవుడ్ స్ర్కీన్... పాతికేళ్ళ పాటు  కళ్ళు చెదిరే చిందులు.. అందంతో ఆకట్టుకునే అద్భుతరూపం.. నటనతో మెప్పించింది.. నాట్యంతో  అలరించింది ఒకప్పటి నంబర్ వన్ హీరోయిన్  మాధురి దీక్షిత్‌.  ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆరాధ్యదేవత అయిన మాధురిదీక్షిత్ ఈ రోజు బర్త్ డే జరుపుకుంటోంది.


Read Full Story
drusyam.net

జూనియర్ పయనం ఎటు?

జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గాడా? ఫ్యాన్స్ వ్యతిరేకత వల్లే తాజా కామెంట్లు చేశాడా? తాజా సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోందంటున్నారు.  అయినా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారే తప్ప, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేస్తానని ప్రకటించలేదు…ఆయనపై విధేయత ప్రకటించలేదు. చంద్రబాబుతో ఎన్టీఆర్ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. దమ్ము సినిమాపై జరిగిన మీడియా మీట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. వంశీతో జగన్ భేటీ తన సూచన మేరకే జరిగిందనే వార్తలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

drusyam.net

Sunday, May 13, 2012

రవితేజ రీమేక్ సినిమాలే ‘కిక్’



మాస్ రాజా రవితేజ సినిమాలపై ఇతర భాషల మూవీ మేకర్స్ మోజు పడుతున్నారు. దాంతో రవితేజ సినిమాలు వరుసగా రీమేక్ అవుతున్నాయి. రవితేజ హిట్ మూవీ విక్రమార్కుడు చిత్రం హిందీలో రౌడీరాథోర్ టైటిల్ తో రీమేక్ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్  కుమార్ హీరోగా చేస్తున్నాడు. విడుదలకు ముందే బాలీవుడ్ ఈ మూవీ భారీ అంచనాలు తీసుకువస్తోంది.
ఇక రవితేజ నటించిన మరో సినిమా కిక్ పై కూడా ఇతర భాషల వారి కన్నుపడింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందించిన కిక్ తెలుగులో సూపర్ హిట్టయింది. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమా ఇప్పుడు కన్నడంలో రీమేక్ అవుతోంది. కన్నడ రీమేక్ లో ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటించటానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఉపేంద్ర-ఇంద్రజిత్ కాంబినేషన్లో ఐశ్వర్య అనే సినిమా వచ్చింది. ఇది తెలుగులో నాగార్జున నటించిన మన్మథుడు రీమేక్ గా రూపొందించారు. ఈ సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించింది. అలాగే గతంలో రవితేజ చేసిన కృష్ణ సినిమా రీమేక్ లో కూడా హీరోగా ఉపేంద్ర చేశాడు. అదే సినిమాను తెలుగులో రజినీ ఫ్రం రాజమండ్రి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు.
ఇక ప్రస్తుతం ఉపేంద్ర మంచి జోష్ మీదున్నాడు. ఉపేంద్ర లేటెస్ట్ మూవీ కఠారి వీర..సుర సుందరాంగి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ మొదటి త్రీడీ గా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ ఫాంటసీ గా చెప్తున్నారు. మంచి జోష్ మీదున్న ఉపేంద్ర మరోసారి రవితేజ కిక్ సినిమాతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

drusyam.net 

Wednesday, February 8, 2012

జగన్ ను చెక్కిన శిల్పులెవరు ?


2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఆయన తనయుడు జగన్ అనే విషయం రాజకీయ వర్గాల్లో చాలా మందికి తెలుసు. కాని అతడిలో దమ్మెంతుంది..

రీడ్ మోర్...

http://drusyam.net/