Thursday, May 24, 2012

‘అరెస్టయితే పార్టీని అమ్మే చూసుకుంటారు’


తాను అరెస్టు అయితే తమ పార్టీ బాధ్యతలను అమ్మే చూసుకుంటారని వైఎస్ జగన్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ విషయం ప్రకటించారు. వైఎస్ జగన్ అరెస్టయితే పులివెందుల శాసనసభ్యురాలు, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకుంటారని జగన్ ప్రకటనను బట్టి స్పష్టమైంది.
తన అరెస్టుకు ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతోందని జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల హంగామా చూస్తుంటే కుట్ర అర్థమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తన మీద వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను వాయిదా వేయించడమే వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒక్క చోట కూడా విజయం సాధించలేవని ఆయన అన్నారు.

drusyam.net

Wednesday, May 23, 2012

యాడ్ ప్రపంచంలో ఖరీదైన కరీనా..!



కపూర్‌ ఫ్యామిలీలో నాలుగో తరానికి చెందిన కరీనాకపూర్‌ బాలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్. బాలీవుడ్‌లో ఇప్పుడు కరీనాకపూర్ హవా జోరుగా వీస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన కమెర్షియల్ అవేలబ్యులిటీ కరీనాకపూర్‌లో పుష్కలంగా ఉన్నాయి. సినిమాలతోనే కాదు యాడ్‌ ప్రపంచంలోనూ తన సత్తా చూపిస్తూనే వుంది. ప్రస్తుతం కరీనా చేతిలో 15కు పైగా బ్రాండ్లు వున్నాయి. వీటిల్లో ఏడు కంపెనీల యాడ్స్ నిత్యం టెలివిజన్‌లో కనిపిస్తూనే వుంటాయి. కరీనాకు ప్రధాన పోటీదారుగా వున్న కత్రినా కైఫ్‌ చేతుల్లో ఐదు, ప్రియాంకాచోప్రా, అనుష్క శర్మ దగ్గర చెరో మూడు, దీపిక పడుకొనే వద్ద రెండు బ్రాండ్లు ఉన్నాయి. టివిలో కనిపించే సమయం, సీజన్‌ల పరంగా పోల్చినా కూడా కరీనా లేడీ బ్రాండ్లలో ఫస్ట్‌ ప్లెస్‌లో వుంది. కార్పొరేట్ల నుంచి మిగిలిన వారందరి కన్నా ఎక్కువగానే కరీనా వసూలు చేస్తోంది.

రచ్చ @ 50 రోజులు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమా నేటితో సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 127 సెంటర్లలో ఈ చిత్రం ఫిప్టీ డేస్ కంప్లీట్ చేసుకుని దూసుకుపోతోంది. రామ్ చరణ్-తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ మెగా ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

Tuesday, May 15, 2012

అందమైన భామలు - అదిరిపోయే రేట్లు


హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ రెమ్యూనరేషన్ విషయంలోనూ తమకు హద్దేలే లేవంటున్నారు టాలీవుడ్ హీరోయిన్లు.  రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటి పడుతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్న  హీరోయిన్స్ రెమ్యునేషన్స్ వింటే పెద్ద నిర్మాతలు సైతం ఖంగుతింటున్నారు. షాక్ గురిచేసేలా వారి పారితోషికం పెంచుతూనే వున్నారు.

drusyam.net

కళ్ళు చెదిరే అందం మాధురి దీక్షిత్ !

అది బాలీవుడ్ స్ర్కీన్... పాతికేళ్ళ పాటు  కళ్ళు చెదిరే చిందులు.. అందంతో ఆకట్టుకునే అద్భుతరూపం.. నటనతో మెప్పించింది.. నాట్యంతో  అలరించింది ఒకప్పటి నంబర్ వన్ హీరోయిన్  మాధురి దీక్షిత్‌.  ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆరాధ్యదేవత అయిన మాధురిదీక్షిత్ ఈ రోజు బర్త్ డే జరుపుకుంటోంది.


Read Full Story
drusyam.net