Friday, October 19, 2012

నిత్యానందకు మరో శిష్యురాలు


వివాదాస్పద స్వామి నిత్యానందపై ఎన్ని ఆరోపణలు వచ్చినా… ఆయనపై నటీమనులకు మాత్రం మోజు తగ్గడం లేదు. మొన్నటి వరకు నటి రంజిత ఒక్కతే ఉందనుకుంటే… ఇప్పడు ఆ జాబితాలో కౌసల్య కూడా చేరింపోయింది. కౌసల్య ‘కాలమెల్లాంకాదల్ వాల్గ’ అన్న తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రియముడన్, ఉన్నుడన్, వానత్తైల, మనదై తిరిడి విట్టాయే మొదలగు చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించిన కౌసల్య చివరగా సంతోష సుబ్రమణియం చిత్రంలో నటించింది. మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న కౌసల్య ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది. 32 ఏళ్ల కౌసల్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ డాక్టర్ల వద్ద చికిత్స పొందినా నయం కాలేదు.

నిత్యానంద హీలింగ్ చికిత్స

నిత్యానంద స్వామి హీలింగ్ చికిత్సలో నిపుణుడు. దీంతో కౌసల్య నిత్యానంద ఆశ్రమం వెళ్లి హీలింగ్ చికిత్స పొందింది. ప్రస్తుతం వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో కౌసల్య నిత్యానంద శిష్యురాలిగా మారింది. 





Thursday, October 18, 2012

కాంగ్రెస్‌కు దిమ్మదిరిగే స్ట్రోక్..!


అధికార కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణపై కేంద్రం వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని ఎప్పటినుంచో బెదిరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి అదే సాకుతో జగన్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలతోపాటూ తెలంగాణ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీకి మరింత ఊపు తేవాలనుకుంటున్నారు.

షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర ఇంకా ఊపందుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మాజీ నేతలతోపాటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. తాజాగా  కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదనే.. సాకుతో ఇంద్రకరణ్ రెడ్డి జగన్ పార్టీలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు.







Tuesday, October 16, 2012

నాగార్జున సిక్స్‌ప్యాక్‌..!

వయసు పెరుగుతున్నకొద్ది నవ మన్మథుడిగా మారిపోతున్నాడు అక్కినేని నాగార్జున. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డమరుకం సినిమా కోసం తన బాడీని సిక్స్ ప్యాక్ గా మార్చుకున్నాడు నాగ్.

అయితే నాగార్జున 54 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ తో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 54 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలా కనిపించడమే కాకుండా సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ టాలీవుడ్ నవ మన్మథుడు. 

నాగార్జున సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. మన్మధుడిగా తనకు తానే సాటి అని ప్రూవ్ చేసిన నాగ్...సిక్స్ ప్యాక్ బాడీతో యువ హీరోలతో పోటీ పడుతుండటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. 




Monday, October 15, 2012

దర్శకుడా.. నిర్మాతా..? ముంచింది ఎవరు?

తెరపైనే కాదు తెరవెనుకా సీన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే తెర వెనుక ఆడుతున్నది మాత్రం దర్శకులు, నిర్మాతలే. ఇప్పుడు రెండు పెద్ద సినిమాల దర్శకనిర్మాతల గొడవలు బజారుకొచ్చాయి.

డైరెక్టర్ పై నిర్మాతలు…
డైరెక్టర్ లారెన్స్ నిండా ముంచాడంటూ ‘రెబల్’ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. 22 కోట్ల బడ్జెట్ అని చెప్పాడని, 45 కోట్లు ఖర్చు పెట్టించాడని నిర్మాతల వాదన. మరోవైపు నిర్మాతలపై లారెన్స్ ఫైర్ అవుతున్నాడు. తనకు డబ్బింగ్ రీమేక్ రైట్స్ ఇస్తామని మరొకరికి అమ్ముకున్నారని లారెన్స్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై లారెన్స్.. నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు. అయితే పెద్ద హీరో అని భారీ భరోసాతో అంత బడ్జెట్ పెట్టడంలో నిర్మాతది అత్యాశ లేదా? నిజంగానే లారెన్స్ నిర్మాతలను ముంచాడా? ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తే ఇటువంటి గొడవ రచ్చకెక్కేదేనా..? ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో ఇదే జరుగుతున్న చర్చ ఇదే.

నిర్మాతపై డైరెక్టర్..
పవన్ సినిమా కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా విషయం కూడా రచ్చకెక్కింది. ఈ సినిమా నిర్మాత దానయ్య తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు కూడా చేశాడు. అయితే తాజాగా దర్శకులు సంఘం నిర్మాత దానయ్యకు డెడ్ లైన్ విధించింది. సినిమా విడుదలకు ముందే పూరి రెమ్యూనరేషన్ సెటిల్ చెయ్యాలని ఆల్టిమేటం జారీ చేస్తూ…బుధవారం వరకు గడువు విధించారు. లేకుంటే నిర్మాత దానయ్యకు దర్శకుల సంఘం సహాయ నిరాకరణ చేస్తుందని హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమాను పూరీ అలా చుట్టిపారేశాడంటూ టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ దర్శకున్ని, తప్పు పట్టాలో లేక నిర్మాతను తప్పు పట్టాలో తేలాల్సి ఉంది.


రెబల్ సినిమా విషయంలో నిర్మాతలు దర్శకునిపై ఫైర్ అయితే, కెమెరామెన్ గంగాతో రాంబాబు విషయంలో దర్శకుడే నిర్మాతలపై కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా దర్శకనిర్మాతలు గొడవ పడటం ఇప్పుడు టాలీవుడ్ చర్చనీయాంశంగా మారుతోంది. ఏమైనా గొడవలు రచ్చకెక్కకుండా పరిష్కరించుకుంటే పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా ఉంటుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

more news updates
                       drusyam.net 
 

Saturday, October 13, 2012

ఫైరవీలతోనే నంది అవార్డులు..?

    నంది అవార్డుల లొసుగు మరోసారి బయటపడింది. నంది అవార్డుల విషయంలో ఏటేటా అపవాదు మూటగట్టుకుంటున్న ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఫైరవీలతోనే నంది అవార్డులు వస్తాయా అనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

శ్రీరామరాజ్యం వంటి కళాత్మక చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు బాపు. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించిన బాపుకు అవార్డు రాకపోవడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్తమ చిత్రంగా ప్రకటించినప్పటికీ బాపు దర్శకత్వ ప్రతిభకు అవార్డు ప్రకటించలేదన్న విమర్శ ఉంది.

నందమూరి తారక రామరావు వంటి గొప్ప నటులకే నంది అవార్డులు రాలేదని, రాజకీయాలు చేస్తేనే నందులు వస్తాయని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. నంది అవార్డు పొందాలంటే తెరవెనుక రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉందని.. అలాంటి నీచ సంస్కృతి తనకు లేదని, అందుకే తనకు ఇంత వరకు నంది అవార్డు రాలేదని ఇటీవల మోహన్ బాబు తేల్చి చెప్పారు. గతంలో అనేక పర్యాయాలు నంది అవార్డుల మీద మెహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. అయితే ఈ సారి మాత్రం మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కు బెస్ట్ లేడీ విలన్ అవార్డు దక్కింది.

2011లో ప్రేక్షకుల ఆధరణ పొందిన సినిమాలను నంది అవార్డుల కమిటి విస్మరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా దూకుడు, శ్రీరామరాజ్యం చిత్రాలకు నందులు వరిస్తాయని ఊహించిందే. అయితే ఈ సినిమాలకు అవార్డుల పంట పండటంపై భిన్నభిప్రాయాలు లేకున్నా, బరిలో ఉన్న ఇతర చిత్రాలకు సమ న్యాయం జరగలేదన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

ఇతర కేటగిరీల్లో కందిరీగ, ఓమైఫ్రెండ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంటి చిత్రాలకు కూడా నందులు వస్తాయని భావించారు. కానీ ఈ చిత్రాలు ఎందుకూ పనికిరానివిగా జ్యూరీ తేల్చేసింది. మరి కొన్ని చిన్న సినిమాలకు అసలు ఛాన్సే ఇవ్వలేదని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. ఏదేమైనా ప్రతిభకు అందించాల్సిన అవార్డులు.. ఫైరవీలకు దాసోహం అవుతున్నాయన్న విమర్శలకు అవార్డుల కమిటీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

అవార్డుల వివరాలను జ్యూరీ సభ్యులు ఎస్‌.గోపాల్‌రెడ్డి ప్రకటించారు. అవార్డులను జనవరిలో ప్రదానం చేస్తారు.

more news updates
                       drusyam.net 
 


ఉత్తమ నటుడు : మహేష్‌బాబు(దూకుడు).
ఉత్తమ నటి : నయనతార(శ్రీరామరాజ్యం).
ఉత్తమ దర్శకుడు శంకర్‌ (జైబోలో తెలంగాణ).
ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం.
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న.
ఉత్తమ ద్వితీయ చిత్రం : విరోధి.
ఉత్తమ బాలల చిత్రం : శిఖరం.
రెండో బాలల ఉత్తమ చిత్రం : గంటల బండి.
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: అవయవదానం.
ఉత్తమ హాస్యనటి : రత్నసాగర్‌.
ఉత్తమ స్క్రీన్‌ప్లే : శ్రీనువైట్ల.
ఉత్తమ గీత రచయిత : సురేందర్‌.
ఉత్తమ మాట రచయిత : నీలకంఠ(విరోధి).
ఉత్తమ సంగీత దర్శకుడు : ఇలయరాజ.
ఉత్తమ వినోదభరిత చిత్రం : దూకుడు.
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్సెంట్‌ లవ్‌
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : జైబోలో తెలంగాణ
ఉత్తమ సహాయనటుడు : ప్రకాశ్‌రాజు(దూకుడు).
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి(ఇంకెన్నాళ్లు).
ఉత్తమ కథా చిత్రం : శ్రీనువైట్ల(దూకుడు).
ఉత్తమ గాయకుడు : గద్దర్‌ ( నడుస్తున్న పొద్దు మీద…)
ఉత్తమ కెమెరామేన్‌ పీఆర్కే రాజు (శ్రీరామరాజ్యం)
త్తమ క్వారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అక్కినేని (శ్రీరామరాజ్యం).
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్మెస్‌ నారాయణ (దూకుడు).
ఉత్తమ విలన్‌ మంచు లక్ష్మీ ప్రసన్న (అనగనగా ఓ ధీరుడు).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : షాలిని.
ఉత్తమనేపథ్య గాయని : మాళవిక.
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : శ్రీను.
ఉత్తమ బాలనటుడు : మాస్టర్‌ నిఖిల్‌.
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : నాగార్జున(రాజన్న).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : చార్మి
ఉత్తమ ఎడిటర్‌ : ఎమ్‌.ఆర్‌.వర్మ.

more news updates
                       drusyam.net 

Wednesday, October 10, 2012

అదీ.. అతిలోకసుందరి ఘనత..!


ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల రాణులు... ఇప్పుడు మళ్లీ తమ యాక్టింగ్ టాలెంట్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. మ్యారేజ్ తర్వాత కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన మాధురి దీక్షిత్... అజనాచ్లే (Aaja Nachle) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీ అదిరిపోతుందనుకున్న మాధురికి నిరాశే కలిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో  దేద్ ఇష్కియా, గులాబ్ గ్యాంగ్ వంటి సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో ఒకప్పుడు ఉన్న క్రేజీని మళ్లీ అందుకోలేకపోతోంది. మ్యారేజ్ లైఫ్ తర్వాత సినిమాలకు బై బై చెప్పిన కరిష్మా కపూర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఏడాది ఆమె నటించిన డేంజరస్ ఇష్క్... తో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కొద్ది రోజుల క్రితం పూరీ దర్శకత్వంలో అమితాబ్ నటించిన బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో నటించింది ఒకప్పటి బ్యూటీ రవీనా టాండన్. ఆ తర్వాత శోభనాస్ సెవెన్ నైట్స్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జూహీచావ్లా మర్యాదరామన్న బాలీవుడ్ రీమేక్ సన్నాఫ్ సర్థార్ లో కీలక పాత్రలో కనిపించబోతోంది. వరుసగా సినిమాలకు రెడీ అవుతున్న జూహీచావ్లా సెకండ్ ఇన్నింగ్స్ కు పెద్దగా క్రేజీ రావడం లేదని చెప్పవచ్చు.


ఒకప్పుడు తమ అందచందాలతో ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసిన ఈ తారలు... ఈ సారి పెర్ఫామెన్స్ తోనూ మెప్పించలేకపోతున్నారు. అయితే ఇదే టైమ్ లో వచ్చిన శ్రీదేవి మాత్రం ఊహించని అద్భుతం సాధించింది. వెటరన్ బ్యూటీలంతా ఇంతే.. అని అనుకుంటున్న వారందరిని తన సినిమాతో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.  అదిరిపోయే యాక్టింగ్ తో శ్రీదేవి చేసిన ఇంగ్లీష్-వింగ్లీష్ విడుదలైన అన్నిభాషల్లోనూ కేక పుట్టిస్తోంది.

పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి ఎలా మెప్పిస్తుందో అన్న సందేహాలకు ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాతో సమాధానం చెప్పింది. తోటి వెటరన్ బ్యూటీలకు సాధ్యం కానీ పనిని సులువుగా సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ అదరిపోయింది. మరి మున్ముందు శ్రీదేవి ఎలాంటి పాత్రలతో వస్తుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

more news updates
                       drusyam.net