Monday, October 15, 2012

దర్శకుడా.. నిర్మాతా..? ముంచింది ఎవరు?

తెరపైనే కాదు తెరవెనుకా సీన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే తెర వెనుక ఆడుతున్నది మాత్రం దర్శకులు, నిర్మాతలే. ఇప్పుడు రెండు పెద్ద సినిమాల దర్శకనిర్మాతల గొడవలు బజారుకొచ్చాయి.

డైరెక్టర్ పై నిర్మాతలు…
డైరెక్టర్ లారెన్స్ నిండా ముంచాడంటూ ‘రెబల్’ నిర్మాతలు ఫిర్యాదు చేశారు. 22 కోట్ల బడ్జెట్ అని చెప్పాడని, 45 కోట్లు ఖర్చు పెట్టించాడని నిర్మాతల వాదన. మరోవైపు నిర్మాతలపై లారెన్స్ ఫైర్ అవుతున్నాడు. తనకు డబ్బింగ్ రీమేక్ రైట్స్ ఇస్తామని మరొకరికి అమ్ముకున్నారని లారెన్స్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై లారెన్స్.. నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు. అయితే పెద్ద హీరో అని భారీ భరోసాతో అంత బడ్జెట్ పెట్టడంలో నిర్మాతది అత్యాశ లేదా? నిజంగానే లారెన్స్ నిర్మాతలను ముంచాడా? ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తే ఇటువంటి గొడవ రచ్చకెక్కేదేనా..? ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో ఇదే జరుగుతున్న చర్చ ఇదే.

నిర్మాతపై డైరెక్టర్..
పవన్ సినిమా కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా విషయం కూడా రచ్చకెక్కింది. ఈ సినిమా నిర్మాత దానయ్య తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు కూడా చేశాడు. అయితే తాజాగా దర్శకులు సంఘం నిర్మాత దానయ్యకు డెడ్ లైన్ విధించింది. సినిమా విడుదలకు ముందే పూరి రెమ్యూనరేషన్ సెటిల్ చెయ్యాలని ఆల్టిమేటం జారీ చేస్తూ…బుధవారం వరకు గడువు విధించారు. లేకుంటే నిర్మాత దానయ్యకు దర్శకుల సంఘం సహాయ నిరాకరణ చేస్తుందని హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమాను పూరీ అలా చుట్టిపారేశాడంటూ టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ దర్శకున్ని, తప్పు పట్టాలో లేక నిర్మాతను తప్పు పట్టాలో తేలాల్సి ఉంది.


రెబల్ సినిమా విషయంలో నిర్మాతలు దర్శకునిపై ఫైర్ అయితే, కెమెరామెన్ గంగాతో రాంబాబు విషయంలో దర్శకుడే నిర్మాతలపై కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా దర్శకనిర్మాతలు గొడవ పడటం ఇప్పుడు టాలీవుడ్ చర్చనీయాంశంగా మారుతోంది. ఏమైనా గొడవలు రచ్చకెక్కకుండా పరిష్కరించుకుంటే పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా ఉంటుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

more news updates
                       drusyam.net 
 

No comments:

Post a Comment