Thursday, July 11, 2013

నయనను వెంటాడుతున్న ఆ చేదు జ్ఞాపకాలు..!

సినిమాను మించిన సినిమా. తెరపై స్టార్ హీరోయిన్.. తెర వెనుక ఫ్లాప్ లవ్ స్టోరీస్. ఇదీ నయనతార పరిస్థితి. సినిమాలకంటే ప్రేమ, పెళ్లి విషయంలోనే నయన అనేకసార్లు వార్తలకెక్కింది. అయితే ఎప్పుడూ వార్తలలో నానే ఆమె పెళ్లి వ్యవహారమే ఒక కొలిక్కి రావడంలేదు. ప్రేమికుడి పేరు మారుతుందిగానీ ఆ మూడు ముళ్లు మాత్రం పడటంలేదు.
సౌత్ స్టార్ హీరోయిన్లలో నయనతార రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ తోనే ఎక్కువ సార్లు వార్తలకెక్కుతోంది. సౌత్ సినిమాల్లో టాప్ పొజిషన్ కు చేరుకున్న ఈ కేరళ కుట్టికి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు మాత్రం కలిసిరావడంలేదు. ప్రేమికుడి పేరు మారుతుందిగానీ ఆ మూడు ముళ్లు మాత్రం పడటంలేదు. నయన ప్రేమ – పెళ్లికి సంబంధించి కొన్ని నిజాలు, కొన్ని గాసిప్స్ మళ్లీ జోరుగా ప్రచారమవుతున్నాయి.
లవ్ ఫెయిల్యూర్స్ నయనను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అప్పట్లో తమిళ నటుడు శింభుతో ఆమె ప్రేమ వ్యవహారం పెద్ద వార్త అయింది. వారిద్దరూ చాలా కాలం కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో వారిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం కూడా మూడేళ్ల పాటు కొనసాగింది. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని కూడా చెప్పింది. అయితే చివరి క్షణంలో ఏంజరిగిందో ఏమో హఠాత్తుగా పెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవాకు దూరమైంది.

నిర్ణయవేళలో నీడలా నడిపిస్తున్న ఆ ఇద్దరు


ఏపీ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో..రాష్ట్ర మంతా హస్తిన వైపే చూస్తోంది. తెలంగాణపై తెల్చేసే దిశగా చర్జలు సాగుతున్నాయన్న వార్తలతో రాష్ట్రనేతలంతా కొద్దిరోజులుగా దేశరాజధానికి క్యూకడుతున్నారు. సమైక్య, ప్రత్యేక వాదాలు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లే మన మంత్రులు, ఎమ్మెల్యేలకు కేవీపీ, జైపాల్ రెడ్డిలే కేరాఫ్ అడ్రస్. సీమాంధ్ర నేతలకు పెద్దదిక్కుగా కేవీపీ తెలంగాణ నాయకులకు మార్గదర్శిగా జైపాల్ రెడ్డి అక్కడ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.   వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అప్పట్లో డామినేటింగ్ పాలిటిక్స్ ప్లే చేసిన కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం హైకమాండ్ కి వీరవిధేయుడు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతోనే కేవీపీ ఇంపార్టెన్స్ మరింత పెరింగింది. రాజశేఖరరెడ్డితోపాటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేవీపీ కూడా వెళ్లేవారు. అలా అధిష్ఠానంతో ఏర్పడ్డ ఆ సత్సంబంధాలను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు.

రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్ రెబల్ జెండా ఎగరేసినా  కేవీపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానందగ్గర మంచి మార్కులు కొట్టేశారు.  వైఎస్ ప్రాణ స్నేహితుడిగా ఆయన కూడా తిరుగుబాటు బావుటా ఎగరేస్తారమోనన్న అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర పెంచుకుంటూ ముందుకు నడిచారు. ప్రస్తుతం సీమాంధ్ర నేతలకు ఆయనే బిగ్ బాస్.. భాగ్యనగరం నుంచి  డైరెక్టుగా అధిష్ఠానం దగ్గరకు వెళ్లలేని నేతలంతా కేవీపీ ద్వారానే రాయబారం నడుపుతుంటూరు. ముఖ్యంగా తెలంగాణ సమైక్య నినాదాలు జోరందుకున్న ప్రతీ సారీ కేవీపీ కీలకపోత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై తీవ్ర చర్చలు జరుగుతున్న ఇప్పుడు కూడా కేవీపీ సీమాంధ్ర నేతలను లీడ్ చేస్తోన్నారు.

మరోవైపు తెలంగాణ నేతలకు పెద్దన్నగా జైపాల్ రెడ్డి వ్యవహిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న  జైపాల్ రెడ్డిని సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో పదవులు వరించాయి…హైకమాండ్ కి నమ్మిన బంటుగా ఉండే జైపాల్ కి సోనియా దగ్గర మంచి చనువు.. పలుకుబడి ఉందని చెబుతుంటూరు. రాష్ట్రానికి చెందిన ఏ సమాచారమైనా  అధిష్ఠానం జైపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుంటుంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న జైపాల్ చాలా సందర్భాల్లో హైకమాండ్ కి రాష్ట్ర నేతలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూవచ్చారు.  తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంత వాసులకు జైపాల్ పెద్ద దిక్కైయ్యారు. అధిష్ఠానానికి ప్రత్యేక వాదన వినిపించాలనుకునే తెలంగాణ వాదులు ముందుగా ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డినే ఆశ్రయిస్తారని టాక్ . ఆయన సలహా సూచనలతో ఢిల్లీ పెద్దలను కలిసి తమ వాదనను వినిపిస్తారు.
More Latest Updates... www.drusyam.net    

Monday, July 8, 2013

ఎక్స్‌క్లూజివ్: బాహుబలి షూటింగ్ కవరేజ్

రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘బాహుబలి’. చిత్రీకరణ కార్యక్రమాలకు కర్నూల్ జిల్లాలోని రాక్ గార్డెన్స్ లో కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. చిత్రీకరణ చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దాంతో రాతివనాలు కిక్కిరిసిపోయాయి.

Saturday, July 6, 2013

బొత్స అడ్డంగా దొరికిపోతాడా?

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంల కంటే పీసీసీ చీఫ్ బొత్స చాలా ఫాస్ట్ గా కసరత్తుచేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఉభయ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ఎంపీల నుంచి కూడా తెలంగాణ అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తమ అభిప్రాయాల మాట అలా ఉంచి...పీసీసీ ఛీఫ్ మీ అభిప్రాయమేమిటని కొందరు నేతలు ఎదురు ప్రశ్న వేయడంతో సత్తిబాబు జవాబు చెప్పలేక పోతున్నారు.

తెలంగాణా ఉద్యమం ఉధృతమైనపుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనను సమర్ధిస్తానని బోల్డ్ గా  స్టేట్ మెంట్  ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే కారణం వల్లే  పీసీసీ ఛీఫ్ పదవికి బొత్స పేరును ప్రతిపాదించినపుడు టి.కాంగ్రెస్ నేతలు సైతం పూర్తిగా మద్దతిచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొత్స తెలంగాణపై ఆచి,తూచి స్పందించడం మొదలు పెట్టారు.

పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలపడానికి కూడా బొత్స విముఖత చూపారంటే ఆయన వైఖరిలో వచ్చిన మార్పుపై టి.కాంగ్రెస్ నేతలు సైతం విర్శించే పరిస్ధితి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వ్యక్తిగతంగా తనకు ఎన్ని అభిప్రాయాలైన ఉండొచ్చు కానీ.. ప్రస్తుతం హైకమాండ్ మైండ్ సెట్ కి అనుగుణంగానే నడుచుకుంటానని సత్తిబాబు సెలవిస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసి ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్వజయ్ సింగ్ చెప్పడంతో బొత్స ఎవరికి అనుకూలంగా నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశమయ్యింది.

కమల్ రెండో ‘విశ్వరూపం’ ఇదే..!

యూనివర్సల్ స్టార్ కమల్ హసన్ చిత్రం ‘విశ్వరూపం’ వివాదాల మాట ఎలా ఉన్నా ఈ సినిమా కమల్ హాసన్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకుని వచ్చింది. విశ్వరూపం చిత్రం మంచి కలెక్షన్లు సాధించడమే కాదు, కమల్ హాసన్ కు ఉన్న పేరును నిలబెట్టింది. ఈ సినిమా కోసం సినిమా రంగం యావత్తు కమల్ పక్షాన నిలబడింది. ఈ విషయం కమల్ హాసన్ కు కొత్త ఊపిరి ఇచ్చింది.
విశ్వరూపం ఇచ్చిన రిజల్ట్ తో ఉత్సాహంగా ఉన్న కమల్ హాసన్.. ఇప్పుడు ‘విశ్వరూపం-2’ను సిద్ధం చేస్తున్నాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.  విశ్వరూపం-2 ను అతి తొందర్లనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని, మరో 15 రోజుల్లో ‘విశ్వరూపం-2’ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. షూటింగ్ కంప్లీట్ కాగానే నిర్మాణంతర కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆగస్టులో ఈ చిత్రం తెరపైకి వస్తుంది.


Friday, July 5, 2013

‘సింగం’ రివ్యూ – రేటింగ్

స్టోరీ:
సూర్య-అనుష్క జంటగా తమిళంలో తెరకెక్కిన సింగం తెలుగులో యముడు పేరుతో విడుదలై హిట్టయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన సింగం తెలుగులో విడుదలైంది. హరి దర్శకత్వంలో సూర్య-అనుష్క-హన్సిక నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సూర్య నరసింహం పాత్రలో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించాడు. జనక్షేమం కోసం ఎంతటివాళ్లనైనా ఎదిరిస్తాడు. తన ఊరంటే ఎంతో ఇష్టం. సొంతూరిలో పని చేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల కాకికాడకి వెళతాడు. అక్కడ కూడా అక్రమార్కుల భరతంపడతాడు. ఈసారి నరసింహం విదేశాలకు వెళ్లాల్సొచ్చింది. మరి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది కథ.
నటీనటుల ప్రతిభ:
పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రానికి సింగం సూర్య అని చెప్పుకోవాలి మొత్తం చిత్రాన్ని తన భుజాల మీద వేసుకొని వన్ మాన్ ఆర్మీల కనిపించారు. తన ఎనర్జీతో పాటు పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో తనదయిన శైలిలో సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు, పోలీస్ పాత్ర అంటే ఇలా ఉండాలి అనిపించేలా అయన నటన ఉంది. అయన డైలాగ్ డెలివరీ, బాడి లాంగ్వేజ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అనుష్క “యముడు” చిత్రంలో పాత్రనే ఇందులో కూడా కొనసాగించింది అందులో లానే ఇందులో కూడా నటించడానికి  ఏమి లేక పక్క పాత్రల నటనకి సహకరిస్తూ గడిపేసింది. హన్సిక చేసింది ముఖ్య పాత్రే అయిన తక్కువ సేపు తెర మీద కనిపించడంతో చిత్రం చివరికి వచ్చేసరికి హన్సిక పాత్ర గుర్తుండదు. ఇక తొలిసారి ఐటం సాంగ్ చేసిన అంజలి పాటకు తగ్గ న్యాయం చేసి ముందు బెంచ్ వాళ్ళకి కనువిందు  కలిగించింది.
తమిళ కామెడి తో వివేక్ మరియు సంతానం అక్కడక్కడ నవ్వించడానికి ప్రయత్నించారు కొన్ని చోట్ల కామెడీ బాగానే ఉన్నా కొన్ని చోట్ల మరీ తమిళ వాసన రావడం తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే విషయమే, ఇక ముఖేష్ రుషి, రెహ్మాన్ ఇతర నటీనటులు తెర మీద కనిపిస్తున్నాం కాబట్టి నటించాలి అన్నట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.