Friday, June 29, 2012

కేంద్రం ఆలోచించేది ‘రాయల తెలంగాణ’?

ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న చర్చలు రాష్ట్ర విభజనపైనేననే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్రం రాయల తెలంగాణకే అనుకూలంగా ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి.  ఇప్పటికే రాయలసీమ నేతలు కూడా రాయల తెలంగాణకు సై అంటున్నట్టే ప్రచారం జరుగుతోంది.

రాయల తెలంగాణకు నోతాజాగా కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించడంతో విభజన అంశం మళ్ళీ వేడెక్కుతోంది. అయితే రాయల తెలంగాణ అంశం తెరపైకి రావడంతో పలు పార్టీల తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. విలీనంనాటి తెలంగాణనే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.







Friday, June 15, 2012

కొడాలి నాని చరిత్ర హీనుడు అవుతారా?

కృష్ణాజిల్లా టీడీపీలో ఇంకా ముసలం కొనసాగుతోంది. అందులో భాగంగానే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడి  రేపోమాపో జైల్లో జగన్‌ కలిసేందుకు సిద్దమవుతున్నారు.  ఈ మేరకు నాని  నిర్ణయం తీసుకున్నట్లు  ఆయన అనుచరవర్గం చెబుతోంది. నాని టీడీపీ నుంచి వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

జూనియర్ తో గొడవలు
మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో నానికి మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నానిని జూనియర్ కు దూరం చేశాయని తెలుస్తోంది. కొంత కాలంగా నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య రియల్ ఎస్టేట్ వివాదం నడుస్తోందని … అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ తో నానికి పడడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా ఇటీవల నాని ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు జూనియర్ దంపతులు వస్తారని కార్డులు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేశారని…  అయినా కూడా ఎన్టీఆర్ రాలేదని కోపంగా ఉన్నట్టు సమాచారం.


Saturday, June 9, 2012

ఆసక్తిపెంచుతున్న 150 కోట్ల ‘విశ్వరూపం’


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఏది చేసినా సంచలనమే. తాజాగా కమల్‌హాసన్‌ స్వీయ నిర్మాణంలో తనే ప్రధానపాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘విశ్వరూపం’. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 23న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Latest Stories
drusyam.net

‘గబ్బర్‌ సింగ్’ టీమ్‌తో పవన్ అంత్యాక్షరి


సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సినిమా పేరెత్తగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది అంత్యాక్షరీ కామెడీ సీన్. సినిమాకే హైలెట్‌గా మారిన అంత్యాక్షరీ పార్ట్‌ను మరోసారి రిపీట్‌ చేసింది ఆ సినిమా టీమ్‌. ఆ సీన్లో నటించిన కమెడియన్స్‌తో కలిసి పవన్‌ తన నివాసంలో సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. అందరు కలిసి పండగ చేసుకున్నారు.

Latest Stories
drusyam.net

Thursday, June 7, 2012

ఎన్టీఆర్ మరో రీమేక్ సినిమాలో బాలకృష్ణ


ఓ వైపు కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నటిస్తున్న టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ…. తన తండ్రి ఎన్టీఆర్ నటించిన సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. గతేడాది శ్రీరామరాజ్యం సినిమాతో ప్రేక్షకులను రంపింజేసిన బాలయ్య మరోసారి తన తండ్రి నటించిన జానపద చిత్రాల్లో నటించేందుకు సిద్దమవుతున్నాడు.
ఎన్టీఆర్ నటించిన నర్తనశాల సినిమా రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న ఈ టాలీవుడ్ అగ్రహీరో… త్వరలోనే ఎన్టీఆర్ నటించిన ‘భట్టి విక్రమార్క’ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్‌, కాంతారావు వంటి హేమాహేమీలు నటించిన భట్టి విక్రమార్క… యాభై రెండేళ్ల క్రితం విడుదలై అద్భుత విజయం సాధించింది.
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించిన ఈ సినిమాను బాలకృష్ణతో రీమేక్ చేసేందుకు నిర్మాత యలమంచలి సాయిబాబు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో లవకుశ సినిమాను శ్రీరామరాజ్యంగా రూపొందించిన సాయిబాబు మరోసారి బాలకృష్ణతో సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.

More Stories
drusyam.net

Friday, June 1, 2012

వైఎస్‌ మృతి వెనుక జగన్‌?


ఉప ఎన్నికల  పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్‌ మరణం హాట్‌ టాపిక్‌గా మారింది.  జగన్‌ జైలు కెళ్లిన తర్వాత ఆపార్టీ ప్రచార బాధ్యతలు చూస్తున్న విజయలక్ష్మి…వైఎస్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలు వైఎస్‌ మరణానికి జగన్‌కు లింకులు వెతికేదాకా వెళ్లాయి.  ఆ లింకులకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

జగన్‌-బ్రహ్మానందరెడ్డి లింకులేంటి?  
ఇప్పటికే జగన్‌ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్‌ నేతలు…విజయలక్ష్మి విమర్శలకు అంతేస్థాయిలో బదులిస్తున్నారు.  వైఎస్‌ మరణంపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌ మరణానికి, జగన్‌కు సంబంధం ఉందని అనుమానం వ్యక్తంచేశారు.  ఈ అనుమానాలకు ఆధారాలుగా అప్పటి ఏవియేషన్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి, జగన్‌కు మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలను ప్రస్తావించారు. వైఎస్‌కు హెలికాఫ్టర్‌ను సమకూర్చింది బ్రహ్మానందరెడ్డేనని బొత్స గుర్తుచేశారు.  అదే బ్రహ్మానందరెడ్డి… జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు జైలులో ఉన్నారని…ఈ మొత్తం లింకులపై సమగ్ర విచారణ జరగాలని బొత్స అన్నారు.

నేరం రుజువైతే జగన్‌కు 14 ఏళ్ల జైలు
మరోవైపు సీఎం కూడా జగన్‌పై ఎదురుదాడి చేశారు. జగన్‌ చేసింది చిన్న నేరం కాదని,  దేశద్రోహానికి పాల్పడటంవల్లే సీబీఐ జగన్‌ను అరెస్ట్‌ చేసిందని సీఎం తెలిపారు. నేరం రుజువైతే జగన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష ఖాయమన్నారు. జగన్‌ కేసుల్లోని సెక్షన్లను…ఆ సెక్షన్ల ప్రకారం ఉన్న నేర తీవ్రతను కిరణ్‌ వివరించారు.
రెండు పక్షాల వైఖరి ఇలాగే కొనసాగితే…పోలింగ్‌ తేదీ దగ్గరపడే  నాటికి వైఎస్‌ మరణంపై  మరిన్ని అనుమానాలు…తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

drusyam.net