Friday, June 1, 2012

వైఎస్‌ మృతి వెనుక జగన్‌?


ఉప ఎన్నికల  పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్‌ మరణం హాట్‌ టాపిక్‌గా మారింది.  జగన్‌ జైలు కెళ్లిన తర్వాత ఆపార్టీ ప్రచార బాధ్యతలు చూస్తున్న విజయలక్ష్మి…వైఎస్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విమర్శలు వైఎస్‌ మరణానికి జగన్‌కు లింకులు వెతికేదాకా వెళ్లాయి.  ఆ లింకులకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

జగన్‌-బ్రహ్మానందరెడ్డి లింకులేంటి?  
ఇప్పటికే జగన్‌ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్‌ నేతలు…విజయలక్ష్మి విమర్శలకు అంతేస్థాయిలో బదులిస్తున్నారు.  వైఎస్‌ మరణంపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌ మరణానికి, జగన్‌కు సంబంధం ఉందని అనుమానం వ్యక్తంచేశారు.  ఈ అనుమానాలకు ఆధారాలుగా అప్పటి ఏవియేషన్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి, జగన్‌కు మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలను ప్రస్తావించారు. వైఎస్‌కు హెలికాఫ్టర్‌ను సమకూర్చింది బ్రహ్మానందరెడ్డేనని బొత్స గుర్తుచేశారు.  అదే బ్రహ్మానందరెడ్డి… జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు జైలులో ఉన్నారని…ఈ మొత్తం లింకులపై సమగ్ర విచారణ జరగాలని బొత్స అన్నారు.

నేరం రుజువైతే జగన్‌కు 14 ఏళ్ల జైలు
మరోవైపు సీఎం కూడా జగన్‌పై ఎదురుదాడి చేశారు. జగన్‌ చేసింది చిన్న నేరం కాదని,  దేశద్రోహానికి పాల్పడటంవల్లే సీబీఐ జగన్‌ను అరెస్ట్‌ చేసిందని సీఎం తెలిపారు. నేరం రుజువైతే జగన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష ఖాయమన్నారు. జగన్‌ కేసుల్లోని సెక్షన్లను…ఆ సెక్షన్ల ప్రకారం ఉన్న నేర తీవ్రతను కిరణ్‌ వివరించారు.
రెండు పక్షాల వైఖరి ఇలాగే కొనసాగితే…పోలింగ్‌ తేదీ దగ్గరపడే  నాటికి వైఎస్‌ మరణంపై  మరిన్ని అనుమానాలు…తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

drusyam.net 









1 comment:

  1. వై.యెస్ చని పోయినప్పుడే జగన్ పాత్ర పైన చాలా పుకార్లు షికారు చేసాయి.
    బయారం గనులు తనకు కాకుండా అనిల్ కుమార్కు ఇవ్వడంతో జగన్ కక్ష కట్టి తండ్రిని చంపించాడని ఒక వార్త .అది ఎంత వరకు నిజమో తెలియదు..
    కానీ నిజమే అయ్యి వుండవచ్చని జగన్ నైజం తెలిసిన వాళ్ళు చెబుతారు.

    ReplyDelete