Thursday, April 25, 2013

బాలయ్య సినిమాపై బోయపాటి క్లారిటీ

బోయపాటి శీను సినిమా అంటేనే పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. నందమూరి బాలయ్యకు ‘సింహా’ రూపంలో తిరుగులేని హిట్ ను అందించిన బోయపాటి ఇప్పుడు ఆయన కోసం మరో పవర్ ఫుల్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాపై బోయపాటి శీను క్లారిటీ ఇచ్చాడు. సింహా తరవాత బాలకృష్ణతో సినిమా అంటే అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. ‘సింహా’ని మించే సినిమా తీస్తా.. అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదని బోయపాటి చెప్పారు.

Full Story &..
More Latest Updates... www.drusyam.net    


 More Latest Updates... www.drusyam.net   
 

Sunday, April 21, 2013

పవన్ అత్తారింటికి దారి వెతుక్కుంటాడా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తగ్గట్టే టైటిల్స్ కూడా ఆసక్తిగా ఉంటాయి. డిఫరెంట్ టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమా విషయంలో మాత్రం తర్జనబర్జన పడుతున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాకు టైటిల్ ఫైనల్ చేసేందుకు చాలా కష్టపడుతున్నట్టే ఉంది. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్

పవర్ స్టార్ సినిమా టైటిల్స్ అన్నీ సంథింగ్ డిఫరెంట్ గానే ఉంటాయి. పవన్ సినిమా అంటే టైటిల్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అదే ఆయనకు కలిసొస్తుంది. ఈసారి కూడా అలాగే పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. సరదా, హరేరామ హరే కృష్ణ… వంటి పేర్లు వినిపించాయి. చివరకు దీనికి ‘అత్తారింటికి దారేది?’ అనే టైటిల్ ను చిత్రయూనిట్ ఫైనల్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. ఈ టైటిల్ స్టోరీకి తగ్గట్లు ఉండటమే కాకుండా, పవన్ కి, త్రివిక్రమ్ కి బాగా నచ్చడంతో దీనినే ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు.



Saturday, April 13, 2013

బంగారం భారీగా తగ్గబోతోందా..?

అడ్డు అదుపు లేకుండా దూసుకుపోయిన బంగారం ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. శుక్రవారం మార్కెట్లో 24క్యారెట్ల బంగారం గ్రాము ధర 29,200 ఉండగా, ఒక్కరోజులో సుమారు 1000 రూపాయలు తగ్గిన బంగారం ధర ఇవాళ(శనివారం) 28వేల 100 రూపాయలుకు తగ్గింది. రెండేళ్ల కిందటి స్థాయి ధరకు వచ్చేసింది. వెండి సైతం పుత్తడిబాటే పట్టింది. ఒక్కరోజులోనే 2వేల రూపాయలు పడిపోయింది. బంగారం ధరలు ఈ స్థాయికి పడిపోవడం 2011 ఏప్రిల్‌ తర్వాత ఇదే తొలిసారి.

అందుకే పతనం..
బంగారం ధరలు ఇలా పడిపోవడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంకావడం, యూరప్‌లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సైప్రస్ దేశం తనదగ్గరున్న బంగారం నిల్వల్ని విక్రయించే ఉద్దేశ్యాన్ని వెల్లడించడం పుత్తడి పతనానికి కారణాలుగా బులియన్ ట్రేడర్లు చెపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న సంకేతాలతో ఇతర ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు ధర బలపడుతూవస్తోంది. దాంతో బంగారం నుంచి డాలరు పెట్టుబడులు స్టాక్ మార్కెట్లోకి మళ్లుతున్నాయని, దాంతో పుత్తడి ధర పడిపోతున్నదని ట్రేడర్లు అంటున్నారు.

పాతిక లోపే..?!
గత వారం రోజుల్లోనే ప్రపంచ మార్కెట్లో బంగారం ధర 100 డాలర్లవరకూ పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో పుత్తడి ధర మరింత క్షీణించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

 Full Story &..
More Latest Updates... www.drusyam.net   







Wednesday, April 10, 2013

అంజలి ఆచూకీ దొరికింది..!

రెండు రోజులుగా కనిపించకుండాపోయిన సినీ నటి అంజలి మిస్టరీ వీడినట్టే తెలుస్తోంది. తాను క్షేమంగా ఉన్నట్లు అంజలి తన తల్లికి ఫోన్ చేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అంజలి ఆచూకీ కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు.

అయితే పోలీసులు మాత్రం ఈ వివరాలు ఇంతవరకు తమకు అందలేదన్నారు. ప్రస్తుతం అంజలి బెంగుళూరు పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో కలిసి అంజలి నటిస్తున్న ‘బోల్ బచ్చన్’ రీమేక్ సినిమా షూటింగ్ బెంగుళూరులో జరుగుతోంది. ఈ రోజు నుంచి అంజలి షూటింగులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

 Full Story &..
More Latest Updates... www.drusyam.net  


Tuesday, April 9, 2013

అంజలి వ్యవహారంలో కొత్త ట్విస్టు..!


సినీ నటి అంజలి వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం అంజలి వెంకటేష్ సరసన నటిస్తున్న సినిమా (బోల్ బచ్చన్ రీమేక్) షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ బెంగుళూర్ లో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. షూటింగ్ కు ఆటంకం కలుగుతుందనే ఫోన్ స్విఛాప్ పెట్టుకున్నట్టు చెబుతున్నారు. అయితే అంజలి తనేక్కడుందో స్వయంగా చెబితేనే అసలు విషయం బయటపడుతుంది.

పిన్ని భారతీదేవి స్పందన సినీనటి అంజలి ఆరోపణలపై ఆమె పిన్ని భారతీదేవి స్పందించారు. అంజలి తన అక్క కూతురు అని, 15 ఏళ్ల వయసులోనే చట్టరీత్యా దత్తత తీసుకున్నట్లు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకున్నానని.. తల్లిగా అంజలిని మందలించానే తప్పా వేరే ఉద్దేశం లేదని భారతీదేవి అన్నారు. తప్పుడు పని చేయమని కొట్టలేదు.. తిట్టలేదన్నారు. అంజలి తల్లి గల్ఫ్ లో ఉద్యోగం చేస్తోందని, తన సోదరితో ఇప్పటికీ సఖ్యత ఉందని భారతీదేవి తెలిపారు.

 Full Story &..
More Latest Updates... www.drusyam.net 

Monday, April 8, 2013

చిరు చక్రం తిప్పుతారా..?

పార్టీ పెట్టడమే తరువాయి ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం అనే ఆలోచనతో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి, పైకి మాత్రం ‘సామాజిక న్యాయం’ అంటూ అంతవరకు ఎవరూ పాడని ఒక కొత్త పాట అందుకొని, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసి చివరికి తానే వెళ్లి ఆ కాంగ్రెస్-బంగాళాఖాతంలో కలిసిపోయి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొన్న సంగతి రాష్ట్రంలో చంటి పిల్లాడికి కూడా తెలుసు.

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, తను కేవలం సామాజిక న్యాయం కోసమే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలినం చేశానని, అందువల్లే నేడు యస్.సి. యస్టీ. సబ్ ప్లాన్ బిల్లు అమలుకు నోచుకొందని ఆయన ప్రజలకు గుర్తు చేసారు. తనకి సామాజిక న్యాయం మీద తప్ప పదవుల మీద ఏనాడు వ్యామోహం లేదని అన్నారు. త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తానూ సభ్యుడినయినందుకు చాల గర్విస్తున్నాని ఆయన అన్నారు. అదేవిధంగా కరెంటు చార్జీలు పెంచగానే తనే మొట్ట మొదట స్పందించానని, తత్ఫలితంగా ముఖ్యమంత్రి కూడా వెంటనే సానుకూలంగా స్పందించి కరెంటు చార్జీలు తగ్గించారని చిరంజీవి తెలిపారు.

 Full Story &..
More Latest Updates... www.drusyam.net
 

Saturday, April 6, 2013

నందమూరి హీరోలు – క్లైమాక్స్ పడినట్టేనా..?

రాజకీయంగా యాక్టివ్ అవుతున్న బాలక్రిష్ణ ఇపుడిప్పుడే అసలు సినిమా చూపిస్తున్నారు. సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. వివాదస్పద అంశాలపై తెలివిగా వ్యవహారిస్తున్నారు. తన తండ్రి ఫోటోల్ని వాడుకొంటున్న ఇతర పార్టీలపై కోర్టుకెళతానంటూనే… ఎవరి అనుమతితో ఫ్లెక్సీల్లో తన బొమ్మలు వాడుతున్నారో జూనియర్ ఎన్టీఆరే బదులు చెప్పాలని వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు.
 
క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవుతానంటున్న బాలక్రిష్ణ ఆ దిశగా చకచకా అడుగులేసేస్తున్నారు. క్రిష్ణాజిల్లా రాజకీయాలతోపాటు కుటుంబ వ్యవహారాలపైనా ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే బాలక్రిష్ణను ఆపడం ఇక ఎవరి తరం కాదేమో అనిపిస్తోంది. ఎన్టీఆర్ తో పాటు జూనియర్ బొమ్మలు కూడా ఫ్లెక్సీలో పెట్టుకుంటూ ప్రత్యర్థులు కవ్విస్తున్న సమయంలో సింహ గర్జన చర్చనీయమవుతోంది. బాలయ్య ఓ అడుగు ముందుకేసి ఎన్టీఆర్ బొమ్మల్ని ఫ్లెక్సీలో పెట్టుకున్న వారిపై కోర్టుకి కూడా వెళతానంటున్నారు.

 Full Story &..

More Latest Updates... www.drusyam.net 

Friday, April 5, 2013

బాద్‌షా రివ్యూ – రేటింగ్


 ‘బాద్‌షా డిసైడయితే వార్ వన్‌సైడయిపోద్ది..అంటూ థియేటర్లలోకి దూకేశాడు యంగ్ టైగర్. సరికొత్త స్టైలిష్ లుక్ తో బాద్ షా గా వచ్చిన జూనియర్ సక్సెసయ్యాడా? పంచ్ డైలాగులు వెంటేసుకుని యాక్షన్ కామెడీ చేసిన బాద్ షా ప్రేక్షకులను మెప్పించిందా? ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు పెట్టుకుని వచ్చిన ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటి? బాద్ షా రివ్యూ మీ కోసం.
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో – అభిమానులకు తగ్గ రేంజ్ లో హీరోని తెరపై ఆవిష్కరించే డైరెక్టర్.. ఈ కాంబినేషన్ కలిస్తే ఎలా ఉంటుందో బాద్ షా నిరూపించింది. ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది ఈ మూవీ. ప్రతీ డిపార్టమెంట్ నుంచి ఎక్సలెంట్ వర్క్ తీసుకున్న శ్రీనువైట్ల ఈచిత్రాన్ని యాక్షన్ కామెడీగా మలుద్దామనుకునే ప్రాసెస్ లో.. యాక్షన్.. కామెడీ దేని బ్లాక్ దానికే అన్నట్లు విడిపోయాయి. అయితే దర్శకుడుకి పట్టున్న కామెడీ విభాగానికే మంచి మార్కులు పడతాయి.
 Full Story &..
More Latest Updates... www.drusyam.net