Saturday, May 24, 2014

అక్కినేని ‘మనం’ రివ్యూ & రేటింగ్

drusyam.net
అక్కినేని కుటుంబం ప్రేక్షకుల గుండెను తడిమింది. అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, నాగ్ తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన మనం సినిమా ఆసక్తిరేపుతూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ్ చిన్న కొడుకు అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాపై మరింతా క్యూరసిటీ పెంచాడు. అయితే నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టు ఆశించిన ఫలితం రాట్టిందా..? సినిమాలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి..? ఏఎన్నార్, నాగ్, చైతన్య ముగ్గురిలో ఎవరి ఫర్మామెన్స్ అదిరిపోయింది..? అక్కినేని ‘మనం’ స్పెషల్ రివ్యూ రిపోర్ట్ మీకోసం.   

Full Review Report
drusyam.net 
...............

Tuesday, May 20, 2014

కేసీఆర్ పై స్పెషల్ సంచిక..!

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పేరే తెలంగాణకు బలం.. బలహీనత. నేటి తరానికి తెలిసిన… ఒకే ఒక్కడు ఆయనే కేసీఆర్‌ ది లీడర్‌. నేటి యువతరానికి ఆదర్శనీయుడు. చరిత్రను తిరగరాసిని యుగపురుషుడుగా పేరు సంపాదించిన ఘనత కూడా కేసీఆర్‌దే. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేశారు. ఈ పోరాటానికి ఒక్కడు కదిలి యావత్‌ తెలంగాణను కదిలించిని మహోన్నతమైన శక్తివం తుడుగా అవతరించిన నేత. మొత్తం సమాజాన్ని కదిలించి ఉద్యమం వైపు మళ్లించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన యుగపురుషుడు కేసీఆర్‌.

ఈ ఉద్యమ కాలంలో అనేక అటుపో ట్లను ఎదుర్కొని వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటూనే నిలదొక్కుకుని ఆరితేరిన వ్యూహా కర్తగా నిలబడి ఆశయసాధన కోసం ముందకు సాగారు. 14 ఏళ్ల ఆలుపెరుగని పోరాటానికి దక్కిన ఫలితమిది. కేసీఆర్ సంచలన రాజకీయ పయనంపై ‘దృశ్యం’ స్పెషల్ సంచికను విడుదల చేస్తోంది. కేసీఆర్ ఇంటర్వ్యూ, గెస్ట్ కాలమ్స్, స్పెషల్ ఎడిటోరియల్ తో కూడిన ఈ సంచిక త్వరలోనే విడుదల కాబోతోంది.

ఈ ప్రత్యేక సంచికలో తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడానికి drusyam.tg@gmail.com కి మెయిల్ చేయమంటున్నారు.