Friday, November 23, 2012

రజినీ త్రీడి మూవీ @ 12-12-12

సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘శివాజీ’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సారి ఆధునిక హంగులు అద్దుకుని త్రీడీ రూపంలో ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. ఈ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాను 12-12-12 అంటే డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి డిసెంబర్ 12న ‘కొచ్చాడయన్’ సినిమా విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ‘శివాజీ త్రీడీ’ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.



కడప స్థానం నాదే..!


వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్ఆర్ సీపీ ఆశాకిరణం షర్మిల ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. రానున్న ఎన్నికల్లో జగన్‌ పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే, ఇదే సమయంలో జగన్‌ చిన్నాన్న వైఎస్ భాస్కరరెడ్డి తనయుడు అవినాష్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. అయితే, షర్మిల పాదయాత్ర ప్రారంభించే ముందు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని కుటుంబసభ్యులకు స్పష్టం చేశారని, ఆ మేరకు వారి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో పాదయాత్ర ప్రారంభించారని సమాచారం. సొంత కుటుంబీకులే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంత కుటుంబీకులే పార్లమెంటుకు వెళ్లాలని షర్మిల వాదించడంతో వారంతా అందుకు అంగీకరించారు.
అయితే.. చాలాకాలం క్రితం వరకూ ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న అవినాష్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బద్వేలు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావించారు. ఆ మేరకు ముందు ఒక తేదీ అనుకున్నప్పటికీ, బద్వేలు ఇంచార్జి గోవిందరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈనెల 23న బద్వేలు మండలం కలసపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.







Tuesday, November 20, 2012

అత్యంత ఖరీదైన ఖైదీ.!

తాజాగా ఉరి తీసిన ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఖైదీ. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన కసబ్ భద్రతకు ఇప్పటివరకూ ఖర్చుపెట్టిన మొత్తం 60 కోట్లు పైనే అని ఓ అంచనా. కసబ్ రక్షణ కోసం నెలకు సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఇకపై తమవల్ల కాదంటూ.. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొరపెట్టుకుంది. సైన్యంలో అత్యంత కీలకమైన విభాగానికి చెందిన నిపుణులైన మెరికల్లాంటి 250 మంది ఇండో-టిబెట్ బోర్డర్  సైనికులను కసబ్ భద్రత కోసం వినియోగించడంతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో తొలిసారిగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు ఇక్కడకు వచ్చి వాంగ్మూలమిచ్చారు.

మహరాష్ర్ట 28 కోట్లు..!
కసబ్ రక్షణ కోసం ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయలను ఖర్చుచేసినట్లు అర్జీలో తెలిపింది. ఆహారం, వైద్యం, భద్రతా సిబ్బంది కోసం భారీగా ఖర్చు పెట్టామని కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ తెలిపారు.

గదికి ఐదున్నర కోట్లు..!
కసబ్‌ ఇప్పటి వరకు ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో.. ప్రత్యేక గదికి ప్రభుత్వం 5.24 కోట్ల రూపాయల్ని ఖర్చుచేసింది. నరహంతుకుడి తిండికి, వైద్య అవసరాలకు, మందులకు, భద్రతా కల్పనకు కోట్లరూపాయలను నీళ్లలా ఖర్చుపెట్టింది.



మహేష్ యాడ్స్ ఆదాయం ఎంత?

టాలీవుడ్ బిజినెస్ మెన్ మహేష్ బాబు దూకుడు కొనసాగుతూనే వుంది. వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు మహేష్. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి ‘రాయల్ స్టాగ్’ కూడా చేరినట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో రాయల్ స్టాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ని ఎంపిక చేసినట్లు సమచారం. ‘రాయల్ స్టాగ్’కి ప్రచార కర్తగా వ్యవహరించేందుకు గాను మహేష్ భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మహేష్ ఇప్పటికే.. ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్’, యూనివర్సెల్, నవరత్న హెయిర్ ఆయిల్, ధమ్స్అప్, వివెల్, ఐడియా, జోష్ అలూకాస్, ప్రోవోగ్, అమృతాంజన్, సంతూర్, మహీంద్రా వంటి పన్నెండు బిగ్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. మరి కొన్ని కంపెనీలు ప్రిన్స్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నాయి.




టాలీవుడ్‌కు ఆ సత్తా లేదా?

గోవాలో జరుగుతున్న ’43వ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియా నుంచి 18 సినిమాలు ఎంపికయ్యాయి. అందులో తెలుగు సినిమాలకు మరోసారి పరాభవం ఎదురైంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చోటు దక్కించుకోలేక పోయింది.

కొత్త ప్రయోగాలు చేయడంలో మన టాలీవుడ్ ఎప్పుడు వెనకబడి ఉంటుందని చెప్పవచ్చు. సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం కేవలం కమర్షియల్ గా మాత్రమే ఆలోచించి సినిమాలు తీస్తుండటమే అవార్డులకు దూరం చేస్తోందని అంటున్నారు. ఈ మధ్య సినిమాలకు కలెక్షన్లు రావాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు బూతు, వివాదాలనే నమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.





Monday, November 19, 2012

మహేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటి?

స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ పెట్టాలంటే అది పెద్ద ప్రయత్నమనే చెప్పాలి. అందులోనూ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ వున్న హీరోలకైతే మరీనూ! పేరులో ఫోర్స్ వుండాలి… అతని ఇమేజ్ని హైలైట్ చేసేలా వుండాలి… అప్పుడే అభిమానులకి అది నచ్చుతుంది. అందుకే, అతని సినిమాలకు టైటిల్స్ పెట్టడానికి పెద్ద కసరత్తే చేస్తుంటారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రానికి గత కొన్నాళ్ళుగా అదే ప్రయత్నం జరుగుతోంది. మొదట్లో ‘ఆచార్య’ అనుకున్నారు. ఇది మరీ సాప్ట్ గా వుందని వద్దనుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిలో ‘తుంటరి’ ఒకటి. ఈ చిత్రానికి ‘తుంటరి’ అనే టైటిల్ పెట్టే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ స్పందించారు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ సుంకర వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని….అధికారిక సమాచారం వెలువడే వరకు పుకార్లను నమ్మ వద్దని అనిల్ సుంకర మహేష్ బాబు అభిమానులకు పిలుపునిచ్చారు.



Sunday, November 18, 2012

జగన్ పార్టీలోకి యాంకర్ రాణి రుద్రమ

నంది అవార్డు గ్రహీత, ప్రముఖ న్యూస్ యాంకర్, తెలంగాణ వాది రాణిరుద్రమ వైఎస్ఆర్ సీపీలో చేరారు.  తెలంగాణ ప్రాంతానికి చెందిన రాణిరుద్రమ టీవీ9, ఏబీఎన్, సాక్షి, టీన్యూస్ చానళ్లలో యాంకర్ గా పని చేశారు. యాంకర్, న్యూస్ రీడర్ గా, ఎన్నో చర్చవేదికల్లో నాయకులను సూటిగా ప్రశ్నించినటువంటి రాణిరుద్రమ వైకాపాలో చేరాడం హాట్ టాపిక్ గా మారుతోంది. వరంగల్ జిల్లా నర్సంపెటకు చెందిన రాణిరుద్రమ టీ న్యూస్ చానల్ నుంచి ఇటీవలే వెళ్లి పోయినట్లు తెలుస్తుంది.



‘ఆమ్నెస్టీ’ ప్రకటించిన దుబాయ్

యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్‌కైమా, ఉమాన్‌కుమ, ఖుజెర్‌మా, అజ్మాన ప్రాంతాల్లో ఉపాధి వీసా గడువు ముగిసిన తర్వాత ఉపాధి పొందుతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఊరట కలిగించింది. సందర్శక వీసాపై వెళ్లి దొంగచాటున (కల్లివెల్లి) అయి ఉపాధి పొందుతున్న కార్మికులకు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 4 లోగా ఎలాంటి జరిమానాలు లేకుండా స్వదేశానికి వెళ్లేలా వీలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం తీర్మానించింది.

చేతిలో వీసాలు లేక స్వగ్రామాలకు వెళ్లలేక నరకయాతన పడుతున్న కార్మికులకు ఇది మంచి వార్తే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబాయ్‌లోని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ శర్మ సూచించారు. మన రాష్ట్రం నుంచి సుమారు 20 వేల మంది కార్మికులు వీసాలు లేకుండా యూఏఈలో ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని సుమారు 15 వేల మంది కార్మికులు వీసా లేకుండా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా.




తెరవెనుక 'బాగోతం' విడుదల!

హీరోయిన్ల అందాలను సినిమా స్కోప్ లో చూపించే రాఘవేంద్రరావు షూటింగ్ గ్యాప్ లో ఏం చేస్తాడు? మెగాస్టార్ చిరంజీవి కష్టపడి పైకొచ్చాడా లేదా ఏదైనా షార్ట్ కట్ తోటి ఎదిగాడా? రాత్రి పూట షూటింగ్ అయితే హీరో హీరోయిన్స్ కలిసి ఏంచేస్తారు? వీటన్నింటి జవాబులు చెప్పారు ప్రఖ్యాత నిర్మాత కాట్రగడ్డ మురారి. గతంలో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. అదే విధంగా కొన్ని బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. చాలా కాలం తర్వాత మురారి తాజాగా  ‘నవ్విపోదురు గాక అనే పుస్తకంతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఈ పుస్తకం సినీప్రముఖుల సమక్షంలో చెన్నైలో విడుదలైంది.

ప్రముఖ గాయని సుశీల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు సినీ, సాహితీ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ బాలు మాట్లాడుతూ.. మాట కరకుగా కన్పించినా నవనీతమైన మనస్సున్న వ్యక్తి మురారి అని కితాబిచ్చారు.




Saturday, November 3, 2012

అమెరికా ఎన్నికల సర్వే ఫలితాలు

అల్లకల్లోలం చేసిన శాండీ హరికేన్‌ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధరణ స్థితికి చేరుకోవడంతో మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రత్యర్థి మిట్‌ రోమ్ని ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా విడుదలపై పోల్‌ సర్వే ఫలితాల ప్రకారం ఇరువురి మధ్య పోరు హోరా హోరీగా సాగుతుతున్నట్టు వెల్లడైంది. రోమ్నీతో పోల్చుకుంటే ఒబామా స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నట్టు ఆయా సర్వేలు చెబుతున్నాయి.

ఒబామాకు ఎంతో కీలకమైన రాష్ట్రం కొలరాడోతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముగించారు. ఇక్కడ సీఎన్‌ఎన్‌, ఓఆర్‌సీ ఇంటర్నేషనల్ పోల్‌ సర్వే ప్రకారం 50శాతం ఓటర్లు ఒబామాకు మద్దతు పలుకుతుండగా, రోమ్నీకి 48శాతం అండగా నిలుస్తున్నట్టు స్పష్టమైంది.
మరోవైపు అమెరికాకు చెందిన ఒక రాజకీయ పరిశోధన సంస్థ వారాంతంలో జరిపిన ఓ సర్వేలో రోమ్నీకే మొగ్గు కనిపించింది. రోమ్నీకి 48శాతం, ఒబామాకు 47శాతం ప్రజలు మద్దతునిస్తున్నారని వెల్లడించింది. ఇక వాషింగ్టన్‌ పోస్ట్‌-ఏబీసీ న్యూస్‌ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒబామా వెంటే నడుస్తు న్నారని స్పష్టం చేసింది. ఒబామాకు 49శాతం, రోమ్నీకి 48శాతం ఓట్లు పడనున్నాయని తెలిపింది.


వివాదాలు సినిమాకు కాసులు కురిపిస్తున్నాయా?


టాలీవుడ్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది. మన మూవీ మేకర్లంతా ఇప్పుడు జపిస్తున్న మంత్రం వివాదం. కోట్లు పెట్టిన రాని పబ్లిసిటీ ఒక్క వివాదంతోనే వస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారా? వివాదాలే సినిమాకు కాసులు కురిపిస్తాయా? ప్రస్తుతం టాలీవుడ్ జరుగుతున్న సీన్ ఏంటి?   ఇటీవల తెలుగు సినిమాలు వివాదాలతోనే బాగా పబ్లిసిటీ అవుతున్నాయి. విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సినిమాలు కొన్ని అయితే.... విడుదల తర్వాత మరికొన్ని చిత్రాలు వివాదాలకు దారి తీసి నిషేధాల వరకూ వెళుతున్నాయి. మరికొన్ని చిత్రాలు కోర్టు గడపను తొక్కుతున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా వివాదం కొద్ది రోజుల పాటు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ వాదులు ఈ సినిమాపై ఫైర్ అయ్యారు. ఉద్యమాన్ని కించపరిచేలా సీన్లు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చిత్రయూనిట్ అభ్యంతరకరమైన సీన్లు తొలిగించింది. సీన్ రివర్స్.. అయితే మొదటి రోజు కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'రాంబాబు' సినిమా.. ఈ వివాదంతో పబ్లిసిటీ ఏర్పడి మరింతా లాభపడుతుందని అందరు ఆశించారు..........