Sunday, May 26, 2013

‘శ్రియ’కు జిరాక్స్‌లా ఉన్న బ్యాంకాక్ భామ!

బ్యాంకాక్‌లోని ఇంపాక్ట్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ షోను ఏర్పాటు చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్షలాది మంది ఆటోమొబైల్ అభిమానులు ఈ షోకు విచ్చేశారు. ఈ ప్రదర్శనలో సరికొత్త కార్లు, హైబ్రిడ్ కార్లు, కాన్సెప్ట్ కార్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ 2013 బ్యాంకాక్ అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలో తళుక్కుమని మెరిసిన బ్యాంకాక్ భామల అందాల్లో ఓ భామ అచ్చం మన శ్రియ లాగే ఉంది. మీరే చూడండి.

 More Latest Updates...  
  www.drusyam.net  

Friday, May 3, 2013

గ్రీకువీరుడు రివ్యూ – రేటింగ్


టాలీవుడ్ నవ మన్మథుడు గ్రీకు వీరుడుగా వచ్చేశాడు. నాగ్-నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రీకువీరుడు ఈ రోజు విడుదలైంది. మరి భారీ అంచనాలతో వచ్చిన గ్రీకువీరుడు ప్రేక్షకులను మెప్పించాడా? నాగ్-నయనతార జంట అలరించిందా? మొత్తానికి సినిమా రిజల్ట్ ఏంటీ? రివ్యూ మీ కోసం.

నాగార్జున నటించిన సంతోషం, మన్మథుడు, నిన్నే పెళ్లాడుతా, హలో బ్రదర్‌, కింగ్‌ వంటి చిత్రాల్లో కుటుంబ బంధాలు కలగలిసి ఉంటాయి. దాదాపు అదే కోవలోనే చేసిన మరో ప్రయత్నం ఈ గ్రీకు వీరుడు. సంతోషం చిత్రం తర్వాత నాగార్జున-దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
నాగార్జున చందు పాత్రలో అమెరికాలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యక్తిగా కనిపించాడు. ప్రేమ, హ్యూమన్ రిలేషన్ షిప్‌పై నమ్మకం లేదని వ్యక్తి. డబ్బుకు ఎక్కువ విలువ ఇస్తాడు. చారిటబుల్ ట్రస్టులో డాక్టర్ గా సంధ్య పాత్రలో నయనతార నటించింది. సంధ్యకు రిలేషన్, లవ్, సెంటిమెంట్స్ మీద నమ్మకం ఎక్కువ. ఇండియాకు వచ్చిన చందుకు సంధ్యతో పరిచయం ఏర్పడుతుంది. సంధ్య వల్ల చందు ఎలా మారాడు అనేదే స్టోరీ.

Full Review & 
 More Latest Updates... www.drusyam.net