Tuesday, January 27, 2015

మిస్ ఇండియా 2015 అలీనా..!



విద్యుద్దీపాల వెలుగుల్లో మెలికలు తిరుగుతూ ఓర చూపులు.. గిలిగింతలు పెడుతూ రువ్వే అరనవ్వులు.. ‘అందాల’ భామలు ర్యాంప్‌పై నడుస్తుంటే ఆహుతులు మైమరచిపోయారు. మారియట్ హోటల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి మణప్పురం ‘మిస్ సౌత్ ఇండియా-2015’ ఫైనల్స్ నిర్వహించారు. ఇందులో 17 మంది యువతులు ర్యాంప్‌పై హోయలోలికించారు. విజేతగా అలీనా కేథరిన్ అమోన్, మొదటి రన్నర్‌గా నేహశెట్టి, రెండో రన్నర్‌గా గాయిత్రి సురేష్ నిలిచారు.

చివరి రోజు ఉత్తేజ పరిచిన ఒబామా..!

మూడు రోజుల భారతదేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్భుతమైన ముగింపు ఇచ్చారు. నమస్తే.. బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగం ప్రారంభించి, జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఒక్కో మాట చెబుతున్నప్పుడల్లా ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మిన్నంటింది. అడుగుడుగునా భారతీయతను తన ప్రసంగంలో ఆయన నింపేశారు. షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే విజయాన్ని, మిల్కాసింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ప్రస్తావించారు. తాము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన 'విశాల్' అనే బాలకార్మికుడి విజయాన్ని కూడా గుర్తుచేశారు.

స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమని ఒబామా చెప్పారు. భారతదేశంలోని మహిళా శక్తిని వేనోళ్ల పొగిడారు. మతస్వేచ్ఛను ప్రస్తావించారు. అమెరికాలో గురుద్వారాపై దాడి దురదృష్టకరమని అభివర్ణించారు. భారతదేశంలోని యువశక్తిని, వాళ్లకున్న అవకాశాలను, సాధించగలిగిన విజయాలను అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుచేశారు. భారతీయుల కష్టపడేతత్వాన్ని తాము నేర్చుకోవాలని నిజాయితీగా చెప్పారు. తాను వంటవాడి మనవడినని, మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని తమ మధ్య పోలికలను గుర్తుచేశారు.

జీఎంఆర్ ఐటిని సందర్శించిన పవన్ కళ్యాణ్


జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని రాజాం టౌన్ లో పర్యటించారు. రాజంలోని జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ హాస్పిటల్, నైరేడ్, జీఎంఆర్ ఐటి లను సందర్శించారు.  ఇక, కేర్ ఆసుపత్రిలోని రోగులనుసైతం పవన్ కళ్యాణ్ పరామర్శించారు.  ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Thursday, January 22, 2015

ఇండియాలో కాబోయే స్మార్ట్ సిటీలు..!


బీజేపి ఎన్నికల ప్రచారంలో మొత్తం భారత దేశంలో 100 నగరాలను స్మార్ట్ నగరాలుగా మరుస్తామని చెప్పింది. అందులో భాగంగా దేశంలో కొన్ని నగరాలను ఎంపిక చేసి, వాటిని స్మార్ట్ గా మార్చేందుకు సిద్దమయింది. అధికారంలోకి వచ్చాక అందుకు సంబంధిన ప్రణాళికను సైతం సిద్దం చేసింది.

Tuesday, January 20, 2015

ఒబామా బ్లాక్ బెర్రీ ఫోన్ విశేషాలు..!





అమెరికా అధ్యక్షుడి ఫోనుకు భద్రత అత్యంత ముఖ్యం. ఎంతటి నిపుణుడైన హ్యాకర్ అయినా.. ఆ ఫోనును ముట్టుకోలేని పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా గూఢచారులు ఆయన ఎప్పుడు, ఎవరితో, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు అందకుండా ఉండాలి.

ఒబామా దాదాపు దశాబ్ద కాలం నుంచి బ్లాక్ బెర్రీ ఫోనునే ఉపయోగిస్తున్నారు. కానీ, 2008లో దాన్ని వదిలిపెట్టి, ఎన్ఎస్ఏ అందించిన సెక్టెరా ఎడ్జ్ ఫోను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆయన గొంతునే పాస్ వర్డ్ గా ఉపయోగించే బ్లాక్ బెర్రీ ఫోను ఆయన చేతికి వచ్చింది.

హ్యాకర్లు ఛేదించగలరనుకునే ప్రతి ఒక్క అంశాన్నీ ఈ ఫోనులో చేర్చారు. అందులో గేమ్స్ ఉండనే ఉండవు. సెల్ఫీ కెమెరా ఉండదు, ఎస్ఎంఎస్ ఇవ్వడానికీ కుదరదు. కానీ అత్యాధునికమైన ఎన్ క్రిప్షన్ ఫీచర్లు మాత్రం ఉంటాయి.

ఈ ఫోనులోంచి కేవలం 10 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేయడానికి కుదురుతుంది. అదే తరహా ఎన్ క్రిప్షన్ ఉన్న ఫోన్లకే దీన్నుంచి కాల్స్ వెళ్తాయి. ఉపాధ్యక్షుడు జో బిడెన్, భార్య మిషెల్, కొందరు సలహాదారులు, భద్రతా చీఫ్ మాత్రమే ఆయన నుంచి కాల్స్ అందుకోగలరు.

ఐఎంఈఐ నెంబరును కూడా ఈ ఫోను దాచేస్తుంది. దాంతో దాన్ని ట్రాక్ చేయడం అసాధ్యం అవుతుంది. అందువల్ల వైట్ హౌస్ కమ్యూనికేషన్ ఏజెన్సీ వాళ్లు ఒబామా ఎక్కడికెళ్లినా ఓ సెక్యూర్ బేస్ స్టేషన్ వెంట తీసుకెళ్లాలి. అప్పుడే ఆ ఫోను పనిచేస్తుంది.

సాధారణంగా ఈ సెక్యూర్ బేస్ స్టేషన్.. ఒబామా ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉంటుంది. ఇది వాషింగ్టన్ తో ఉపగ్రహం ద్వారా అనుసంధానం అయి ఉంటుంది.

బ్యూటిఫుల్ అండ్ క్రియేటివ్ పేయింటింగ్స్..!

Sunday, January 11, 2015

డాక్యుమెంటరీ హీరోగా హరీష్ రావు



తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హీరోగా మారారు. చెరువుల పునరుద్ధరణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు చిన్నకోడూరు మండల కేంద్రంలో రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ రసమయి బాలకిషన్ సారథ్యంలోని రసమయి ఫిల్మ్స్ రూపొందిస్తున్న మిషన్ కాకతీయ డ్యాక్యుమెంటరీ చిత్రీకరణలో మంత్రి హరీశ్‌రావు సందడి చేశారు. డైరెక్టర్ రసమయి  యాక్షన్.. అనగానే మంత్రి హరీశ్‌రావు స్క్రిప్ట్ చదవుకుని డైలాగ్ చెప్పారు. డైలాగ్ పూర్తి కాగానే కట్ టేక్ ఓవర్ అని రసమయి చెప్పగానే తిలకిస్తున్న గ్రామస్తులు చప్పట్లతో హోరెత్తించారు.

Saturday, January 10, 2015

లండన్‌లో కత్రినా-రణబీర్ ఎంగేజ్‌డ్..?



బాలీవుడ్ ప్రేమజంట రణభీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల నిశ్చితార్థం జరిగిందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. లండన్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని, ఈ వ్యవహారాన్ని మీడియాకు తెలియకుండా అత్యంత గోప్యంగా వుంచారని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. నూతన ఏడాది వేడుకల నిమిత్తం రణభీర్, కత్రికాకైఫ్ కొద్ది రోజుల కిత్రం లండన్‌కు వెళ్లారని, అక్కడే నిశ్చితార్థం జరిగినట్లుగా తెలిసింది.

నిశ్చితార్థం అనంతరం రణభీర్, కత్రినాకైఫ్ న్యూయార్క్‌లో నూతన ఏడాది వేడుకల్ని జరుపుకున్నారని సమాచారం. నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోన్న రణభీర్‌కపూర్, కత్రికాకైఫ్‌ల వివాహంపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. తొలుత వీరి వివాహానికి రణభీర్‌కపూర్ తండ్రి రిషికపూర్ సుముఖత వ్యక్తం చేయలేదని, అందుకే ఈ ప్రేమజంట కొన్నాళ్లపాటు సొంతంగా ఖరీదు చేసిన అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేశారని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడితో రిషికపూర్ మనసు మార్చుకోవడంతో నిశ్చితార్థానికి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లుగా తెలిసింది.

Monday, January 5, 2015

కొన్ని హాట్ టాపిక్ వీడియోలు

భారతదేశంలో అందమైన న్యూస్ యాంకర్లు 



పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం దశలు



వరల్డ్ మోస్ట్ బ్యూటీఫుల్ ఉమెన్స్ 2014


ప్రపంచంలో అందమైన లేడీ సీఈఓలు



2014 బెస్ట్ సెల్ఫీలు..!