Thursday, December 26, 2013

ఫేస్‌బుక్ బాధితులకు ఓ వేదిక


సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ వల్ల లాభాల మాటేమిటోగానీ, మోసాలు కూడా జరుగుతున్నాయి. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మోసగాళ్లు జోరుగా విజృంభిస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ తో అమాయకులకు వల వేస్తున్నారు. ఫేస్ బుక్ వల్ల మోసపోయిన బాధితులకు ఓ వేదిక కల్పిస్తోంది 'సీవీఆర్' న్యూస్ చానల్. 'ఉమెన్స్ విండో' లైవ్ షో ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. ఫేస్ బుక్ వల్ల మోసపోయిన వారు, ఈ విషయంపై చర్చించాలనుకున్న వారికి ఆహ్వానం. వివరాలకు 8978181371

..

Wednesday, December 11, 2013

వర్థమాన ప్రతిభావంతులతో ఫిల్మ్ ఫ్యాక్టరీ

తక్కువ బడ్జెట్ తో సినిమా తీయాలనుకుంటున్న టాలీవుడ్ మూవీ మేకర్ల కోసం వర్థమాన ప్రతిభావంతులతో 'న్యూ జనరేషన్' ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ 'న్యూ జనరేషన్' ఫిల్మ్ ఫ్యాక్టరీలో స్టోరీ రైటర్స్, లిరిక్ రైటర్స్, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, వీడియో ఎడిటర్లు, ఆర్టిస్టులు, జూ.ఆర్టిస్టులు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాకు సంబంధించిన 24 శాఖలకు చెందిన వర్థమాన ప్రతిభావంతులు ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఉన్నారు.

వంద మంది సభ్యులతో కూడిన ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీ.. సినిమా తీయాలనుకుంటున్న నిర్మాతలకు పూర్తి భరోసాగా నిలుస్తుంది. న్యూటాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనుకున్న వారికి అన్ని శాఖల నుంచి తాము పూర్తి సహాకారం అందిస్తామని 'న్యూ జనరేషన్' ఫిల్మ్ ఫ్యాక్టరీ తెలిపింది. ఈమెయిల్  telugufilmfactory@gmail.com


telugufilmfactory@gmail.com

Thursday, July 11, 2013

నయనను వెంటాడుతున్న ఆ చేదు జ్ఞాపకాలు..!

సినిమాను మించిన సినిమా. తెరపై స్టార్ హీరోయిన్.. తెర వెనుక ఫ్లాప్ లవ్ స్టోరీస్. ఇదీ నయనతార పరిస్థితి. సినిమాలకంటే ప్రేమ, పెళ్లి విషయంలోనే నయన అనేకసార్లు వార్తలకెక్కింది. అయితే ఎప్పుడూ వార్తలలో నానే ఆమె పెళ్లి వ్యవహారమే ఒక కొలిక్కి రావడంలేదు. ప్రేమికుడి పేరు మారుతుందిగానీ ఆ మూడు ముళ్లు మాత్రం పడటంలేదు.
సౌత్ స్టార్ హీరోయిన్లలో నయనతార రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ తోనే ఎక్కువ సార్లు వార్తలకెక్కుతోంది. సౌత్ సినిమాల్లో టాప్ పొజిషన్ కు చేరుకున్న ఈ కేరళ కుట్టికి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు మాత్రం కలిసిరావడంలేదు. ప్రేమికుడి పేరు మారుతుందిగానీ ఆ మూడు ముళ్లు మాత్రం పడటంలేదు. నయన ప్రేమ – పెళ్లికి సంబంధించి కొన్ని నిజాలు, కొన్ని గాసిప్స్ మళ్లీ జోరుగా ప్రచారమవుతున్నాయి.
లవ్ ఫెయిల్యూర్స్ నయనను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అప్పట్లో తమిళ నటుడు శింభుతో ఆమె ప్రేమ వ్యవహారం పెద్ద వార్త అయింది. వారిద్దరూ చాలా కాలం కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో వారిద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం కూడా మూడేళ్ల పాటు కొనసాగింది. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేస్తానని కూడా చెప్పింది. అయితే చివరి క్షణంలో ఏంజరిగిందో ఏమో హఠాత్తుగా పెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవాకు దూరమైంది.

నిర్ణయవేళలో నీడలా నడిపిస్తున్న ఆ ఇద్దరు


ఏపీ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో..రాష్ట్ర మంతా హస్తిన వైపే చూస్తోంది. తెలంగాణపై తెల్చేసే దిశగా చర్జలు సాగుతున్నాయన్న వార్తలతో రాష్ట్రనేతలంతా కొద్దిరోజులుగా దేశరాజధానికి క్యూకడుతున్నారు. సమైక్య, ప్రత్యేక వాదాలు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లే మన మంత్రులు, ఎమ్మెల్యేలకు కేవీపీ, జైపాల్ రెడ్డిలే కేరాఫ్ అడ్రస్. సీమాంధ్ర నేతలకు పెద్దదిక్కుగా కేవీపీ తెలంగాణ నాయకులకు మార్గదర్శిగా జైపాల్ రెడ్డి అక్కడ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.   వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అప్పట్లో డామినేటింగ్ పాలిటిక్స్ ప్లే చేసిన కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం హైకమాండ్ కి వీరవిధేయుడు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతోనే కేవీపీ ఇంపార్టెన్స్ మరింత పెరింగింది. రాజశేఖరరెడ్డితోపాటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేవీపీ కూడా వెళ్లేవారు. అలా అధిష్ఠానంతో ఏర్పడ్డ ఆ సత్సంబంధాలను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు.

రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్ రెబల్ జెండా ఎగరేసినా  కేవీపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానందగ్గర మంచి మార్కులు కొట్టేశారు.  వైఎస్ ప్రాణ స్నేహితుడిగా ఆయన కూడా తిరుగుబాటు బావుటా ఎగరేస్తారమోనన్న అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర పెంచుకుంటూ ముందుకు నడిచారు. ప్రస్తుతం సీమాంధ్ర నేతలకు ఆయనే బిగ్ బాస్.. భాగ్యనగరం నుంచి  డైరెక్టుగా అధిష్ఠానం దగ్గరకు వెళ్లలేని నేతలంతా కేవీపీ ద్వారానే రాయబారం నడుపుతుంటూరు. ముఖ్యంగా తెలంగాణ సమైక్య నినాదాలు జోరందుకున్న ప్రతీ సారీ కేవీపీ కీలకపోత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై తీవ్ర చర్చలు జరుగుతున్న ఇప్పుడు కూడా కేవీపీ సీమాంధ్ర నేతలను లీడ్ చేస్తోన్నారు.

మరోవైపు తెలంగాణ నేతలకు పెద్దన్నగా జైపాల్ రెడ్డి వ్యవహిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న  జైపాల్ రెడ్డిని సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో పదవులు వరించాయి…హైకమాండ్ కి నమ్మిన బంటుగా ఉండే జైపాల్ కి సోనియా దగ్గర మంచి చనువు.. పలుకుబడి ఉందని చెబుతుంటూరు. రాష్ట్రానికి చెందిన ఏ సమాచారమైనా  అధిష్ఠానం జైపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుంటుంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న జైపాల్ చాలా సందర్భాల్లో హైకమాండ్ కి రాష్ట్ర నేతలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూవచ్చారు.  తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంత వాసులకు జైపాల్ పెద్ద దిక్కైయ్యారు. అధిష్ఠానానికి ప్రత్యేక వాదన వినిపించాలనుకునే తెలంగాణ వాదులు ముందుగా ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డినే ఆశ్రయిస్తారని టాక్ . ఆయన సలహా సూచనలతో ఢిల్లీ పెద్దలను కలిసి తమ వాదనను వినిపిస్తారు.
More Latest Updates... www.drusyam.net    

Monday, July 8, 2013

ఎక్స్‌క్లూజివ్: బాహుబలి షూటింగ్ కవరేజ్

రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘బాహుబలి’. చిత్రీకరణ కార్యక్రమాలకు కర్నూల్ జిల్లాలోని రాక్ గార్డెన్స్ లో కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. చిత్రీకరణ చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దాంతో రాతివనాలు కిక్కిరిసిపోయాయి.

Saturday, July 6, 2013

బొత్స అడ్డంగా దొరికిపోతాడా?

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంల కంటే పీసీసీ చీఫ్ బొత్స చాలా ఫాస్ట్ గా కసరత్తుచేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఉభయ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ఎంపీల నుంచి కూడా తెలంగాణ అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తమ అభిప్రాయాల మాట అలా ఉంచి...పీసీసీ ఛీఫ్ మీ అభిప్రాయమేమిటని కొందరు నేతలు ఎదురు ప్రశ్న వేయడంతో సత్తిబాబు జవాబు చెప్పలేక పోతున్నారు.

తెలంగాణా ఉద్యమం ఉధృతమైనపుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనను సమర్ధిస్తానని బోల్డ్ గా  స్టేట్ మెంట్  ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే కారణం వల్లే  పీసీసీ ఛీఫ్ పదవికి బొత్స పేరును ప్రతిపాదించినపుడు టి.కాంగ్రెస్ నేతలు సైతం పూర్తిగా మద్దతిచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొత్స తెలంగాణపై ఆచి,తూచి స్పందించడం మొదలు పెట్టారు.

పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలపడానికి కూడా బొత్స విముఖత చూపారంటే ఆయన వైఖరిలో వచ్చిన మార్పుపై టి.కాంగ్రెస్ నేతలు సైతం విర్శించే పరిస్ధితి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వ్యక్తిగతంగా తనకు ఎన్ని అభిప్రాయాలైన ఉండొచ్చు కానీ.. ప్రస్తుతం హైకమాండ్ మైండ్ సెట్ కి అనుగుణంగానే నడుచుకుంటానని సత్తిబాబు సెలవిస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసి ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్వజయ్ సింగ్ చెప్పడంతో బొత్స ఎవరికి అనుకూలంగా నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశమయ్యింది.

కమల్ రెండో ‘విశ్వరూపం’ ఇదే..!

యూనివర్సల్ స్టార్ కమల్ హసన్ చిత్రం ‘విశ్వరూపం’ వివాదాల మాట ఎలా ఉన్నా ఈ సినిమా కమల్ హాసన్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకుని వచ్చింది. విశ్వరూపం చిత్రం మంచి కలెక్షన్లు సాధించడమే కాదు, కమల్ హాసన్ కు ఉన్న పేరును నిలబెట్టింది. ఈ సినిమా కోసం సినిమా రంగం యావత్తు కమల్ పక్షాన నిలబడింది. ఈ విషయం కమల్ హాసన్ కు కొత్త ఊపిరి ఇచ్చింది.
విశ్వరూపం ఇచ్చిన రిజల్ట్ తో ఉత్సాహంగా ఉన్న కమల్ హాసన్.. ఇప్పుడు ‘విశ్వరూపం-2’ను సిద్ధం చేస్తున్నాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.  విశ్వరూపం-2 ను అతి తొందర్లనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని, మరో 15 రోజుల్లో ‘విశ్వరూపం-2’ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. షూటింగ్ కంప్లీట్ కాగానే నిర్మాణంతర కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆగస్టులో ఈ చిత్రం తెరపైకి వస్తుంది.


Friday, July 5, 2013

‘సింగం’ రివ్యూ – రేటింగ్

స్టోరీ:
సూర్య-అనుష్క జంటగా తమిళంలో తెరకెక్కిన సింగం తెలుగులో యముడు పేరుతో విడుదలై హిట్టయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన సింగం తెలుగులో విడుదలైంది. హరి దర్శకత్వంలో సూర్య-అనుష్క-హన్సిక నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సూర్య నరసింహం పాత్రలో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించాడు. జనక్షేమం కోసం ఎంతటివాళ్లనైనా ఎదిరిస్తాడు. తన ఊరంటే ఎంతో ఇష్టం. సొంతూరిలో పని చేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల కాకికాడకి వెళతాడు. అక్కడ కూడా అక్రమార్కుల భరతంపడతాడు. ఈసారి నరసింహం విదేశాలకు వెళ్లాల్సొచ్చింది. మరి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది కథ.
నటీనటుల ప్రతిభ:
పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రానికి సింగం సూర్య అని చెప్పుకోవాలి మొత్తం చిత్రాన్ని తన భుజాల మీద వేసుకొని వన్ మాన్ ఆర్మీల కనిపించారు. తన ఎనర్జీతో పాటు పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో తనదయిన శైలిలో సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు, పోలీస్ పాత్ర అంటే ఇలా ఉండాలి అనిపించేలా అయన నటన ఉంది. అయన డైలాగ్ డెలివరీ, బాడి లాంగ్వేజ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అనుష్క “యముడు” చిత్రంలో పాత్రనే ఇందులో కూడా కొనసాగించింది అందులో లానే ఇందులో కూడా నటించడానికి  ఏమి లేక పక్క పాత్రల నటనకి సహకరిస్తూ గడిపేసింది. హన్సిక చేసింది ముఖ్య పాత్రే అయిన తక్కువ సేపు తెర మీద కనిపించడంతో చిత్రం చివరికి వచ్చేసరికి హన్సిక పాత్ర గుర్తుండదు. ఇక తొలిసారి ఐటం సాంగ్ చేసిన అంజలి పాటకు తగ్గ న్యాయం చేసి ముందు బెంచ్ వాళ్ళకి కనువిందు  కలిగించింది.
తమిళ కామెడి తో వివేక్ మరియు సంతానం అక్కడక్కడ నవ్వించడానికి ప్రయత్నించారు కొన్ని చోట్ల కామెడీ బాగానే ఉన్నా కొన్ని చోట్ల మరీ తమిళ వాసన రావడం తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే విషయమే, ఇక ముఖేష్ రుషి, రెహ్మాన్ ఇతర నటీనటులు తెర మీద కనిపిస్తున్నాం కాబట్టి నటించాలి అన్నట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.

Friday, June 28, 2013

రవితేజ ‘బలుపు’ రివ్యూ - రేటింగ్

వరుస ప్లాపులతో సతమతమైన మాస్ మహరాజా రవితేజ, తన భవిష్యత్ గురించి ఇక తాడో పేడో తేల్చుకోవడానికా అన్నట్లు బాగా ‘బలుపు’తో కసిగా ఈ రోజు బాక్సాఫీసు బరిలో దూకాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, ప్రచార చిత్రాల్లో రవితేజ పెర్ఫార్మెన్స్ మాంచి మాస్ మసాలా దట్టించి ఉండటం, మరో హీరోయిన్ శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ గ్లామరస్ రోల్ అని ప్రచారం జరుగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
స్టోరీ:
బెంగుళూరులో బ్యాంక్ రికవరి ఏంజెంట్ గా పనిచేసే రవితేజ.. అతని తండ్రి ప్రకాష్ రాజ్ తో కలిసి ఉంటాడు. రవితేజకి ఎలాగైనా పెళ్లి చేయాలని కృతనిశ్చయింతో తండ్రి తిరుగుతూంటాడు. మరోప్రక్క శృతి హాసన్ తన అంకుల్ బ్రహ్మానందంతో క్రేజీ పనులు చేస్తూ అందరినీ ఇబ్బందిపెడుతూ.. ఎంజాయి చేస్తూంటుంది. ఆమెకు బుద్ది చెప్పాలని బయిలుదేరిన రవితేజతో ఆమె ప్రేమలో పడుతుంది. అయితే అప్పటికే శృతికి అడవి శేషుతో వివాహం నిశ్చయమవుతుంది. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగి కథ సుఖాంతం అవుతుంది.
రవితేజ మాస్ డైలాగులతో వచ్చిన ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సమపాళ్లలో కుదిరాయనే చెప్పాలి. ఫస్టాఫ్ స్పీడుగా నడిచిపోయినా.. సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ బాగా స్లో అయ్యి.. లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫస్టాప్ ఒక కథ, సెకండాఫ్ మరో కథ చూసినట్లు అనిపించింది. అయితే పూర్తిగా కామెడీ మీద.. ముఖ్యంగా బ్రహ్మానందం మీదే ఆధారపడిపడి దర్శకుడు తెలివిగా లోపాలు కనపడనీయకుండా సర్దేసాడు. బ్రహ్మానందం, రవితేజ, శృతి హాసన్.. ఫస్టాఫ్ అంతా వీరి చుట్టూనే నడుస్తుంది. రవితేజ బ్రహ్మానందం టార్చర్ పెట్టడం, బ్రహ్మానందం కొత్త ఎత్తులు వేయడం, వాటన్నింటినీ రవి చిత్తుచేయడం.. ఈ ఫార్మెట్ లో కథ సాగుతుంది.
సాధారణంగా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే.. ఓ ఫైట్ వేసి కథముగించేస్తూంటారు. కానీ ఇక్కడే దర్శకుడు ఆ రొటీన్ నెస్ ని బ్రేక్ చేసి..ఫన్ చేసి..క్లైమాక్స్ ని డిజైన్ చేసాడు. అదే ప్లస్ అయ్యింది. ఈ మధ్య ఐపీఎల్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జంపింగ్‌ జంపాంగ్‌ డాన్స్‌, గంగ్‌నమ్‌ స్టైల్ డాన్స్ ని తెలివిగావాడి నవ్వించారు. ఇవివి ..’పిల్ల నచ్చింది’ ని గుర్తు చేసే.. కథగా పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేకపోయినా.. ట్రీట్ మెంట్ బాగా చేయటంతో వర్కవుట్ అయ్యింది. దానికి తగ్గట్లు డైలాగులు కూడా చాలా చోట్ల పేలాయి.
నటీనటుల ప్రతిభ:
మాస్ రాజారవి తేజ ఈ మధ్య కాలం లో మాస్ ఆకట్టుకోవటంలో విఫలం అవుతున్నాడన్న విమర్శ ఈ చిత్రంతో తొలగిపోయినట్టే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయన నటించిన తీరు ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్, మాస్ డైలాగ్ డెలివరీ ఒక్కసారి రవితేజ లోని మాస్ యాంగిల్ ని బయటకి రప్పించాయి.  ఇక శృతిహాసన్ గత చిత్రాలలో లాగా కాకుండా సెక్సీ లుక్ తో ఉషారుగా కనిపించింది. అంజలి సోసో గా ఉంది. ప్రకాష్ రాజ్,రవితేజ ఇద్దరూ పోటీ పడి.. తమకిచ్చిన రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించారు.



Monday, June 24, 2013

మెగా పవర్ స్టార్ ‘డబుల్’ మజా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకేసమయంలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో నటించడానికి ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ మేకర్లకు అందుబాటులో ఉండేందుకు ముంబైలోనే ఓ ప్లాట్ ని కూడా కొనుకున్నాడట రామ్ చరణ్. తన అప్ కమింగ్ మూవీ జంజీర్ విడుద‌ల త‌ర‌వాత  త‌న‌కు అక్కడ మ‌రిన్ని అవ‌కాశాలొస్తాయని చ‌ర‌ణ్ న‌మ్మకంగా చెబుతున్నాడు.

జంజీర్ రామ్‌చ‌ర‌ణ్ కు బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ.‌ అయితే.. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే.. బాలీవుడ్‌లో చెర్రీకి మ‌రో ఆఫర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.  జంజీర్ టీజర్ లో చ‌ర‌ణ్‌.. లుక్‌, స్టైల్ చూసిన బాలీవుడ్ మూవీ మేకర్లు చెర్రీతో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారట.  త్వరలోనే చెర్రీ ఫ‌ర్హాన్ అక్తర్ ద‌ర్శకత్వంలో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని బాలీవుడ్ టాక్‌.

ఇక రామ్ చ‌ర‌ణ్ నటించిన రెండు సినిమాలు వ‌రుస‌గా రిలీజ్‌కు సిద్దంగా ఉండ‌టంతో మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు. అభిమానుల ఖుషీ వెనుక రామ్ చ‌ర‌ణ్ హార్డ్ వ‌ర్కింగ్ ఎంతో ఉంది. జంజీర్ షూటింగ్ చేస్తూనే, ఎవ‌డు మూవీలోనూ పార్టిసిపేట్ చేశాడు. జంజీర్ షూటింగ్ కంప్లీట్ అవ‌డంతో, త‌రువాత ఎవ‌డు మూవీతో పాటు మ‌రో ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు. ఈ విధంగా ఏక కాలంలో రెండు మూవీల‌ను ట్రాక్‌లో పెట్టుకుంటున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌..
More Latest Updates.. www.drusyam.net 

Saturday, June 22, 2013

ధనుష్ ’రాన్‌జానా’ రివ్యూ-రేటింగ్

కొలవెరీ డీ అంటూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన తమిళ హీరో ధనుష్.. తన అదృష్టం పరీక్షించుకునేందుకు బాలీవుడ్ వెళ్లాడు. తాజాగా ధనుష్ నటించిన ’రాన్‌జానా’  మూవీ విడుదలైంది. మరి ధనుష్ తొలి ప్రయత్నంగా నటించిన ఈ హిందీ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? ఉత్తరాది ప్రేక్షకుల కన్నా దక్షిణాదివాళ్లే ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ‘రాన్ ఝనా’ మూవీ రిజల్ట్ ఏంటీ? ఆ సినిమా స్పెషల్ రివ్యూ మీ కోసం.

తమిళ యంగ్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్.. సౌత్ ప్రేక్షకులకు కొద్ది కాలంలోనే దగ్గరయ్యాడు. ఇంకా లేట్ చేయకుండా తన లక్ ను పరీక్షించుకునేందుకు ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అక్కడ ‘తను వెడ్స్ మను’ డైరెక్టర్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘రాన్ ఝనా’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోనామ్ కపూర్ తో కలిసి ధనుష్ నటించిన ఈ మూవీ పైకి లవ్ స్టోరీలా కనిపిస్తున్నా.. లోపల్లోపల అనేక సామాజిక, రాజకీయ, వర్తమాన అంశాలను నేపథ్యంగా తీసుకున్నారు.

స్టోరీ:
ఈ సినిమాలో ధనుష్.. కుందన్ పాత్రలో.. సోనమ్ జోయా పాత్రలో నటించింది. బనారస్ పట్టణంలోని జోయా అనే ముస్లిమ్ అమ్మాయిని కుందన్ చిన్నతనంలోనే ప్రేమిస్తాడు. వయసుతో పాటే ఆ ప్రేమ గాఢత పెరుగుతూ వస్తుంది. అయితే జోయాతో ప్రేమ ఫలిస్తుందా? జోయా, కుందన్ లవ్ స్టోరీలో రాజకీయ అంశాలు, సామాజిక సమస్యలు ఎందుకు వస్తాయి. ప్రేమపై ఆ అంశాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెరపై చూపించారు.

యాక్టింగ్ టాలెంట్:
పర్సనాలిటీ, గ్లామర్ హంగులకీ ప్రాధాన్యమిచ్చే బాలీవుడ్‌లో ధనుష్ తొలి అడుగుతోనే తన సత్తా చూపించాడు. కుందన్‌గా యాక్టింగ్ అదిరిపోయింది. అసలు అతని పెర్ఫార్మెన్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఖచ్చితంగా చెప్పేయోచ్చు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న ధనుష్ కు బాలీవుడ్‌లోనూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. జోయాగా సోనమ్ కపూర్ కూడా యాక్టింగ్ అదిరిపోయింది. మొత్తానికి ఈ జంట సినిమాకు సరిగ్గా సూటయింది.
Full Review &..
More Latest Updates... www.drusyam.net    
More Latest Updates... www.drusyam.net 

Friday, June 21, 2013

యాక్షన్ త్రీడీ -రివ్యూ, రేటింగ్

టాలీవుడ్ అల్లరోడు ఈ సారి త్రీడీ ముసుగువేసుకుని వచ్చాడు. అనిల్ సుంకర దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన యాక్షన్ త్రీడీ మూవీ ఆసక్తిరేపుతూ అంచనాలు పెంచుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తొలి త్రీడీ కామెడీ మూవీకిగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? అల్లరోడు మరోసారి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. యాక్షన్ త్రీడీ స్పెషల్ రివ్యూ మీ కోసం.

యంగ్ హీరో అల్లరి నరేష్ కి ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా… హాస్యాన్ని ఇష్టపడే అందరిలో అభిమానులు ఉన్నారు. దాంతో ఆయన చిత్రం రిలీజ్ అవుతోందంటే ఆ క్రేజే వేరు. తాజాగా అల్లరి నరేష్ హీరోగా విడుదలైన చిత్రం ‘యాక్షన్’ 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ సినిమా ఆసక్తిరేపుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్టోరీ:
అల్లరి నరేష్, కిక్ శ్యాం, పురుష్, శివ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. అంతా కలిసి హైదరాబాద్‌ నుంచి గోవాకి రోడ్డుమార్గంలో బయల్దేరతారు. అల్లరి నరేష్ నీలం ఉపాధ్యాయ్ ని చూసి ప్రమలోపడతాడు. కానీ ఆమె అతడిని రిజెక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని లైట్ తీసుకొని గోవా చేరిన వీరు జన్మలో మర్చిపోలేని విధంగా ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు. ఫుల్ గా మందు తాగుతారు అందులో వీరికి తెలియకుండానే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ రాత్రి వీరికి తెలియకుండా చేసిన కొన్ని పనుల వల్ల చిక్కుల్లో పడతారు. పొద్దున్న లేచే సరికి నలుగురిలో ఒకడైన అజయ్ కనిపించడు. అజయ్ ఏమయ్యాడు? ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి వీళ్ళు చేసిన తప్పులేంటి దాని వల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరికి వాటన్నిటి నుంచి భయటపడ్డారా? లేదా? అనేది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ:
కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఎప్పటిలానే తన నటనతో నవ్వించాడు కానీ ఈ మూవీలో కొత్తగా ఏమన్నా ట్రై చేసాడా అంటే మాత్రం నో అనే చెప్పాలి. ఈ సినిమాకి అల్లరి నరేష్ కంటే రాజు సుందరంని మెయిన్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లరి నరేష్ కంటే ఎక్కువ అతనే నవ్విస్తాడు. సగం తెలిసి సగం తెలియని వాడు మధ్యలో దూరి గెలికేసి సందర్భాన్ని పిచ్చెక్కిస్తాడో అలానే దూరి గెలికేసి ప్రేక్షకుల్ని నవ్వించే పాత్రని రాజు సుందరం చేసాడు. ఆపాత్రకి రాజు సుందరం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. వైభవ్ కాస్త ఎమోషనల్, కాస్త భయస్తుడిగా ఉండే పాత్ర చేసాడు, ఆ పాత్రకి న్యాయం చేసాడు. కిక్ శ్యాం పాత్ర సినిమాలో పెద్దగా లేకపోయినా ఉన్నంతవరకూ ఓకే అనిపించాడు. నీలం ఉపాధ్యాయ్ చేసిన నటన గురించి మాట్లాడకపోవడమే బెటర్ ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి, కానీ పాటల్లో తను విచ్చలవిడిగా చేసిన అందాల ఆరబోతకి మాత్రం బి, సి సెంటర్స్ ఆడియన్స్ ఫిదా అవుతారు.
Full Review &..
More Latest Updates... www.drusyam.net    
More Latest Updates... www.drusyam.net