Friday, July 5, 2013

‘సింగం’ రివ్యూ – రేటింగ్

స్టోరీ:
సూర్య-అనుష్క జంటగా తమిళంలో తెరకెక్కిన సింగం తెలుగులో యముడు పేరుతో విడుదలై హిట్టయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన సింగం తెలుగులో విడుదలైంది. హరి దర్శకత్వంలో సూర్య-అనుష్క-హన్సిక నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సూర్య నరసింహం పాత్రలో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించాడు. జనక్షేమం కోసం ఎంతటివాళ్లనైనా ఎదిరిస్తాడు. తన ఊరంటే ఎంతో ఇష్టం. సొంతూరిలో పని చేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల కాకికాడకి వెళతాడు. అక్కడ కూడా అక్రమార్కుల భరతంపడతాడు. ఈసారి నరసింహం విదేశాలకు వెళ్లాల్సొచ్చింది. మరి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది కథ.
నటీనటుల ప్రతిభ:
పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రానికి సింగం సూర్య అని చెప్పుకోవాలి మొత్తం చిత్రాన్ని తన భుజాల మీద వేసుకొని వన్ మాన్ ఆర్మీల కనిపించారు. తన ఎనర్జీతో పాటు పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో తనదయిన శైలిలో సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు, పోలీస్ పాత్ర అంటే ఇలా ఉండాలి అనిపించేలా అయన నటన ఉంది. అయన డైలాగ్ డెలివరీ, బాడి లాంగ్వేజ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అనుష్క “యముడు” చిత్రంలో పాత్రనే ఇందులో కూడా కొనసాగించింది అందులో లానే ఇందులో కూడా నటించడానికి  ఏమి లేక పక్క పాత్రల నటనకి సహకరిస్తూ గడిపేసింది. హన్సిక చేసింది ముఖ్య పాత్రే అయిన తక్కువ సేపు తెర మీద కనిపించడంతో చిత్రం చివరికి వచ్చేసరికి హన్సిక పాత్ర గుర్తుండదు. ఇక తొలిసారి ఐటం సాంగ్ చేసిన అంజలి పాటకు తగ్గ న్యాయం చేసి ముందు బెంచ్ వాళ్ళకి కనువిందు  కలిగించింది.
తమిళ కామెడి తో వివేక్ మరియు సంతానం అక్కడక్కడ నవ్వించడానికి ప్రయత్నించారు కొన్ని చోట్ల కామెడీ బాగానే ఉన్నా కొన్ని చోట్ల మరీ తమిళ వాసన రావడం తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే విషయమే, ఇక ముఖేష్ రుషి, రెహ్మాన్ ఇతర నటీనటులు తెర మీద కనిపిస్తున్నాం కాబట్టి నటించాలి అన్నట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.

No comments:

Post a Comment