Friday, June 28, 2013

రవితేజ ‘బలుపు’ రివ్యూ - రేటింగ్

వరుస ప్లాపులతో సతమతమైన మాస్ మహరాజా రవితేజ, తన భవిష్యత్ గురించి ఇక తాడో పేడో తేల్చుకోవడానికా అన్నట్లు బాగా ‘బలుపు’తో కసిగా ఈ రోజు బాక్సాఫీసు బరిలో దూకాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, ప్రచార చిత్రాల్లో రవితేజ పెర్ఫార్మెన్స్ మాంచి మాస్ మసాలా దట్టించి ఉండటం, మరో హీరోయిన్ శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ గ్లామరస్ రోల్ అని ప్రచారం జరుగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
స్టోరీ:
బెంగుళూరులో బ్యాంక్ రికవరి ఏంజెంట్ గా పనిచేసే రవితేజ.. అతని తండ్రి ప్రకాష్ రాజ్ తో కలిసి ఉంటాడు. రవితేజకి ఎలాగైనా పెళ్లి చేయాలని కృతనిశ్చయింతో తండ్రి తిరుగుతూంటాడు. మరోప్రక్క శృతి హాసన్ తన అంకుల్ బ్రహ్మానందంతో క్రేజీ పనులు చేస్తూ అందరినీ ఇబ్బందిపెడుతూ.. ఎంజాయి చేస్తూంటుంది. ఆమెకు బుద్ది చెప్పాలని బయిలుదేరిన రవితేజతో ఆమె ప్రేమలో పడుతుంది. అయితే అప్పటికే శృతికి అడవి శేషుతో వివాహం నిశ్చయమవుతుంది. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగి కథ సుఖాంతం అవుతుంది.
రవితేజ మాస్ డైలాగులతో వచ్చిన ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సమపాళ్లలో కుదిరాయనే చెప్పాలి. ఫస్టాఫ్ స్పీడుగా నడిచిపోయినా.. సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ బాగా స్లో అయ్యి.. లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫస్టాప్ ఒక కథ, సెకండాఫ్ మరో కథ చూసినట్లు అనిపించింది. అయితే పూర్తిగా కామెడీ మీద.. ముఖ్యంగా బ్రహ్మానందం మీదే ఆధారపడిపడి దర్శకుడు తెలివిగా లోపాలు కనపడనీయకుండా సర్దేసాడు. బ్రహ్మానందం, రవితేజ, శృతి హాసన్.. ఫస్టాఫ్ అంతా వీరి చుట్టూనే నడుస్తుంది. రవితేజ బ్రహ్మానందం టార్చర్ పెట్టడం, బ్రహ్మానందం కొత్త ఎత్తులు వేయడం, వాటన్నింటినీ రవి చిత్తుచేయడం.. ఈ ఫార్మెట్ లో కథ సాగుతుంది.
సాధారణంగా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే.. ఓ ఫైట్ వేసి కథముగించేస్తూంటారు. కానీ ఇక్కడే దర్శకుడు ఆ రొటీన్ నెస్ ని బ్రేక్ చేసి..ఫన్ చేసి..క్లైమాక్స్ ని డిజైన్ చేసాడు. అదే ప్లస్ అయ్యింది. ఈ మధ్య ఐపీఎల్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జంపింగ్‌ జంపాంగ్‌ డాన్స్‌, గంగ్‌నమ్‌ స్టైల్ డాన్స్ ని తెలివిగావాడి నవ్వించారు. ఇవివి ..’పిల్ల నచ్చింది’ ని గుర్తు చేసే.. కథగా పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేకపోయినా.. ట్రీట్ మెంట్ బాగా చేయటంతో వర్కవుట్ అయ్యింది. దానికి తగ్గట్లు డైలాగులు కూడా చాలా చోట్ల పేలాయి.
నటీనటుల ప్రతిభ:
మాస్ రాజారవి తేజ ఈ మధ్య కాలం లో మాస్ ఆకట్టుకోవటంలో విఫలం అవుతున్నాడన్న విమర్శ ఈ చిత్రంతో తొలగిపోయినట్టే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయన నటించిన తీరు ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్, మాస్ డైలాగ్ డెలివరీ ఒక్కసారి రవితేజ లోని మాస్ యాంగిల్ ని బయటకి రప్పించాయి.  ఇక శృతిహాసన్ గత చిత్రాలలో లాగా కాకుండా సెక్సీ లుక్ తో ఉషారుగా కనిపించింది. అంజలి సోసో గా ఉంది. ప్రకాష్ రాజ్,రవితేజ ఇద్దరూ పోటీ పడి.. తమకిచ్చిన రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించారు.



1 comment:

  1. ఏమి మూస సినిమా కథలో....... తెలుగువాడికి ఎన్నెన్ని వెతలో...........!

    ReplyDelete