Friday, June 14, 2013

‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ రివ్యూ – రేటింగ్

వరుస ప్లాఫ్ లతో సతమతమౌవుతున్న హీరో సిధ్దార్థ్.. బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'సమ్ థింగ్ సమ్ థింగ్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు..  తెలుగులో, తమిళంలో హన్సికతో జత కట్టి వచ్చిన సిద్దార్థ్ కు సమ్ థింగ్ ఎటువంటి ఫలితాన్నిచ్చింది. ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పించిందా? ఇంతకీ సమ్ థింగ్ సమ్ థింగ్ ఎలా ఉంది? ఆ సినిమా రివ్యూ మీ కోసం.

ఓ బిగ్ హిట్స్ కోసం ఎదురుచూస్తున్న హీరో సిద్దార్థ్.. కామెడీనే నమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. గత చిత్రం జబర్దస్త్  డిజాస్టర్ అయినా.. అందులోని కామెడీకి పాజిటివ్ టాక్ రావడంతో.. తాజాగా రిలీజైన 'సమ్ థింగ్.. సమ్ థింగ్'లో కామెడీ ట్రాక్ ను ట్రై చేసి కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. కొలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుందర్.సి తెరకెక్కించిన ఈ మూవీ  తెలుగు, తమిళ భాషల్లో పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. ఈ మూవీ స్టోరీ లైన్ రోటీనే అయినా... కామెడీ, స్ర్కీన్ ప్లే కాస్తంత కొత్తగా వుండటం వల్ల ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సిధ్దార్థ్ హిట్ సినిమాలోని పాట 'సమ్ ధింగ్ సమ్ థింగ్' లైన్ ని సినిమా టైటిల్ ఎంచుకుని వచ్చిన సినిమాతో సర్ ఫ్రైజ్ చేస్తాడనుకుంటే సాటిస్ ఫై  మాత్రమే చేయగలిగాడు.

స్టోరీ: కుమార్ పాత్ర చేసిన హీరో సిద్దార్థ్..  ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. సంజన పాత్ర చేసిన హన్సిక అదే కంపెనీలో ఎంప్లాయ్.. చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో ఎదురైన చిత్కారాల వల్ల  ప్రేమ అంటే ఇంట్రెస్ట్ చూపడు. అలాంటి  ప్రేమ ద్వేసి సిద్దార్థ్.. హన్సిక ను చూసిన తొలిచూపులొనే ప్రేమలో పడుతాడు. ప్రేమ గురించి సరైన అవగాహానలేని సిద్దార్థ్ సలహాల కోసం ప్రేమజీ పాత్ర చేసిన బ్రహ్మానందంని ఆశ్రయిస్తాడు. బ్రహ్మనందం ఇచ్చే సలహాలతో ఇంప్రూవ్ అవుతాడు మన హీరో. అంతా బాగుందని అనుకునే సమయంలో గణేష్ వెంకట్రామన్ చేసిన లవ్ ప్రపోజ్ కు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీంతో అతి కష్టం మీద వీరిద్దరి ప్రేమను చెడకొట్టిన సిద్దార్థ్.. ఆ తర్వాత అనేక కష్టాలు పడి హన్సిక ను లైన్ లో తెచ్చుకుంటాడు. తనను  ప్రేమలో పడేయడానికి మన హీరో ప్లేచే సిన చీఫ్ ట్రిక్స్ హన్సిక కు తెలుస్తుంది. తర్వాత సిద్దార్థ్.. లవ్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేదే మిగతా కథ.

Full Review &..
More Latest Updates... www.drusyam.net    




More Latest Updates... www.drusyam.net    

No comments:

Post a Comment