Monday, June 10, 2013

బీజేపీ రెండుగా చీలుతుందా..?

బీజేపీలోచిచ్చు రేగింది. అద్వానీ రాజీనామాతో అగ్నిపర్వతం బద్దలైనంత పనయ్యింది. గుజరాత్ ముఖ్యమంత్రి ప్రాబల్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అద్వానీ  పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా గుజరాత్ సీఎం మోడీ పట్ల వ్యతిరేకత కనబరుస్తున్న అద్వానీ. పార్టీ పదవులకు రాజీనామాచేసి ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చారు.

బీజేపీ సమావేశాలంటే ఎప్పూడూ టంచన్ గా హాజరయ్యే అగ్రనేత అద్వానీ గోవా మీట్ కి  గైర్హాజరయ్యారంటే.. బీజేపీలో అంతర్యుద్దం తారా స్థాయికి చేరిందనే సంకేతాలు వెలువడ్డాయి. అయినా మోడీపై వ్యతిరేకతను లోలోపలే అణచుకున్న అద్వానీ ఎక్కడా బయటపడలేదు.. మరోవైపు బీజేపీలో ఎప్పటినుంచో ఈ విషయంపై కోల్డ్ వార్ నడుస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఆయనే బీజేపీ ప్రధాని అభ్యర్ధని ఊహాగానాలు జోరందుకోవడంతో.. తాను సైతం రేసులో ఉన్నానంటూ అద్వానీ సంకేతాలిచ్చారు. దీంతో  అద్వానీ సపోర్టర్స్ బయటకొచ్చారు.  అద్వానీ లేకుంటే పార్టీయే లేదంటూ ఒకరంటే.. మోడీకాన్నా ఈయనే బెటరని మరొనేత వ్యాఖ్యానించారు.. సీనియర్ నేత మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలాంటి వారైతె ఇప్పటికీ అద్వానీనే కరెక్టని బహిరంగంగా సమర్దిస్తున్నారు.

More Latest Updates... www.drusyam.net   

More Latest Updates... www.drusyam.net   




No comments:

Post a Comment