Sunday, January 30, 2011

తారల క్రికెట్.. ఎస్‌సీఎల్‌ మ్యాచ్‌లు



తారల క్రికెట్‌కు రంగం సిద్ధమవుతోంది
. టాలీవుడ్‌ టీమ్‌కు విక్టరీ వెంకటేష్‌ కెప్టెన్‌గా, మంచు విష్ణు ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. అందాల తారలు తాప్సీ, సమంత బ్రాండ్‌ అంబాసిడర్లుగా చేయబోతున్నారు.

ఐపీఎల్‌ తరహాలో మన సినీతారలంతా కలిసి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు ఆడబోతున్నారు. ఈ ఎస్‌సీఎల్‌ మ్యాచ్‌లకు ఏర్పాట్లు మొదలయ్యాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన నాలుగు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉంటాయి. ఇందుకు సంబంధించి జట్ల ఎంపిక కసరత్తు మొదలైంది. టాలీవుడ్‌ జట్టు కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్‌ వ్యవహరించబోతున్నాడు. అలాగే 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తరపున జట్టుని కొనుగోలు చేసిన మంచు విష్ణు మన జట్టుకి ఓనర్‌గా వ్యవహరించబోతున్నారు.

ఇక కోలీవుడ్‌ జట్టుకు సూర్య , కన్నడ జట్టుకు పునీత్‌ రాజ్‌కుమార్‌.. కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ జట్టుకు సల్మాన్‌ఖాన్‌ నాయకత్వం వహించడంతో పాటు, ఆ జట్టుకి ఓనర్‌ కూడా అతడే.

ఈ సీసీఎల్‌లో ఆడేందుకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 14లోపు జట్టు ఎంపిక పూర్తి చేస్తారు. అప్పుడే టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిపి మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తారు.

తారల క్రికెట్.. ఎస్‌సీఎల్ ఎస్‌సీఎల్‌ మ్యాచ్‌లు


తారల క్రికెట్‌కు రంగం సిద్ధమవుతోంది
. టాలీవుడ్‌ టీమ్‌కు విక్టరీ వెంకటేష్‌ కెప్టెన్‌గా, మంచు విష్ణు ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. అందాల తారలు తాప్సీ, సమంత బ్రాండ్‌ అంబాసిడర్లుగా చేయబోతున్నారు.

ఐపీఎల్‌ తరహాలో మన సినీతారలంతా కలిసి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు ఆడబోతున్నారు. ఈ ఎస్‌సీఎల్‌ మ్యాచ్‌లకు ఏర్పాట్లు మొదలయ్యాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన నాలుగు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉంటాయి. ఇందుకు సంబంధించి జట్ల ఎంపిక కసరత్తు మొదలైంది. టాలీవుడ్‌ జట్టు కెప్టెన్‌గా విక్టరీ వెంకటేష్‌ వ్యవహరించబోతున్నాడు. అలాగే 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తరపున జట్టుని కొనుగోలు చేసిన మంచు విష్ణు మన జట్టుకి ఓనర్‌గా వ్యవహరించబోతున్నారు.

ఇక కోలీవుడ్‌ జట్టుకు సూర్య , కన్నడ జట్టుకు పునీత్‌ రాజ్‌కుమార్‌.. కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ జట్టుకు సల్మాన్‌ఖాన్‌ నాయకత్వం వహించడంతో పాటు, ఆ జట్టుకి ఓనర్‌ కూడా అతడే.

ఈ సీసీఎల్‌లో ఆడేందుకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 14లోపు జట్టు ఎంపిక పూర్తి చేస్తారు. అప్పుడే టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిపి మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తారు.



రజినీకాంత్ కొత్త మూవీ 'రాణా'



రోబో సంచలన విజయం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ మరో క్రేజీ మూవీకి రెడీ అయ్యాడు
. రజినీ-కేఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం రాణా. రజినీ త్రిబుల్‌ రోల్స్‌ చేయబోతున్న ఈ మూవీ మూడుభాషల్లో రాబోతోంది. రోబోలో ఐశ్వర్యరాయ్‌తో జత కట్టిన రజినీ ఈ కొత్తమూవీలో బాలీవుడ్‌బ్యూటీ దీపికాపదుకొనేతో రోమాన్స్‌ చేయబోతున్నాడు. సౌతిండియా సూపర్‌స్టార్‌ కొత్తమూవీ డీటైల్స్‌ మీకోసం..

రజినీకాంత్‌..

ఈ పేరే పవర్‌ఫుల్‌..

తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆడియన్స్‌ కేరింతలు ఆకాశన్నంటుతాయి. ఇండియన్ ఫిల్మ్‌ స్టామినాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి విదేశాల్లోనూ తన సినిమా పట్ల క్రేజ్‌ క్రియేట్‌ చేసుకున్న నటుడు రజనీ.

గత ఏడాది రిలీజైన రోబో.. రజనీకాంత్‌ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపింది. రజనీ అద్భుతమైన యాక్టింగ్‌కు ప్రేక్షకులు జైజైలు కొట్టారు. హాలీవుడ్‌కు మన సినిమా రేంజ్‌ ఏంటో చూపించాడు రజినీ.
రజినీ-శంకర్‌ కాంబినేషన్‌ వచ్చిన ఈ మూవీ సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఆరు పదుల వయస్సులో కూడా చలాకీగా ఉంటూ... డాన్స్‌లు, 
ఎమోషన్స్ బాగా పండించాడు రజినీ
. రోబో కమర్షియల్‌గానూ రికార్డు సాధించింది. ఆఫిసియల్‌ లెక్కల ప్రకారం 132 కోట్ల బడ్జెట్‌ అయిన ఈ మూవీకి,
15
కోట్లు మీడియా శాటిలైట్‌ రైట్స్‌ కలుపుకుని మొత్తం 179 కోట్ల కలెక్షన్లు సాధించుకుంది. రోబో సెన్సేషనల్‌
హిట్‌తో ఉత్సాహంగా ఉన్న

రజనీకాంత్
..
తదుపరి
చిత్రం ఏంటనే ఉత్కంఠకు
తెరపడింది
.
రజినీ
కొత్తమూవీకి రాణా టైటిల్‌
ఖరారు చేసినట్టు చెబుతున్నారు
.

అయితే ఈ సూపర్‌స్టార్‌ ఈ కొత్తసినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. రజినీ-కేఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్లో గతంలో ముత్తు.. నరసింహా.. వంటి సూపర్‌హిట్స్‌ వచ్చాయి. ఈ కొత్తమూవీలో రజినీ స్టైల్‌ను మరింత అదరగొట్టేలా తెరకెక్కించబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది.

రోబోలో ద్విపాత్రాభినయం చేసిన రజినీ రాణాలో త్రిపాత్రాభినయం చేస్తారని తమిళ సినీ వర్గాల సమాచారం. గతంలో రజనీ త్రిపాత్రాభినయం చేసిన ‘మూండ్రముగం’చిత్రం తమిళంలో భారీ హిట్ కొట్టింది. అలాగే ఈ కొత్తమూవీలో రజినీ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనేను ఓకే చేశారట. ప్రస్తుతం దీపికా హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, కాల్షీట్స్ సర్ధుబాటు చేసుకుని నటించటానికి రెడీ అయిందట ఈ భామ.

రోబోలాగే ఈ రజినీ కొత్తమూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోతున్నారు. రోబోకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించిన మ్యూజిక్‌ లేజండ్‌ ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు. రోబో ఛాయాగ్రహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.

ఇక మూవీ కమెడీని బేస్ చేసుకుని ఎంటర్టయిన్మెంట్‌గా తెరకెక్కించబోతున్నారని సమాచారం.

రజినీ త్రిపాత్రాభినయం.. కేఎస్‌.రవికుమార్‌ డైరెక్షన్‌.. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌.. దీపికపదుకొనే హీరోయిన్‌.. మూడు భాషల్లో చిత్రం.. ఇన్ని ఇంట్రస్టింగ్‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి.

Tuesday, January 25, 2011

మేరా భారత్‌ మహాన్‌

ఘన పథకాలతో..!
Republic-day5మన రాజ్యాంగ్ లక్ష్యాలైన సమానత్వం, సమన్యాయం స్వాతంత్య్రం సాధించిన ఇన్ని దశాబ్దాలైనప్పటికీ ఎండమావులుగానే రుజువు చేసుకుంటున్నాయి. ఆరు దశాబ్దాల స్వతంత్ర దేశంలో ఇంకా రెండు పూటలా తిండికి నోచుకోని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉండడమే ఇందుకు ఉదాహరణ. అయితే ప్రతి ప్రభుత్వమూ సామాన్య పౌరుడికోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. ఇన్ని పథకాలు అమలు చేసినా లబ్దిదారులకు మాత్రం చేరవలసిన ఫలాలు చేరకపోవడం ఒక విషా దం. ఏమైనప్పటికీ ఆమ్‌ ఆద్మీ కోసం ప్రభుత్వాలు పని చేస్తూనే ఉన్నాయి. అనేక పథకాలను, చట్టాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. యుపిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలలో కొంతమేర అవినీతి జరిగినా కొంతమేరకు పేదలకు లబ్ది చేకూరుస్తున్నాయి.


సమాచార హక్కు చట్టం...
Republic-day7ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని తెలుసుకునే హ క్కును ప్రజలకు కల్పించడమే ఈ రైట్‌ టు ఇన్ఫర్మే షన్‌(ఆర్‌టిఐ) యాక్ట్‌ ఉద్దేశ్యం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకప్పుడు రహస్యంగా ఉన్న సమాచారం ఇప్పుడు ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలు సులభంగా తెలుసుకోవ చ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని నిరోధించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో 2005లో రూపొందించారు. ఈ చట్టం ఓ విప్లవా త్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. కుంభ కోణాలు, అవి నీతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో సమాచార హక్కు ద్వారా కొంతమేరకైనా కళ్లెం పడుతుందని ఆశించవచ్చు. ‘ఈ చట్టం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుబంధాన్ని మ రింత పెంచేందుకు తోడ్పడుతుంది. కానీ బ్యూరోక్రసీ మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నదంతా రహస్యంగా ఉంచాలని చూస్తోంది’ అని సామాజికవేత్తలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రజాస్వామ్య ప్రభు త్వాలు కొనసాగుతున్న దేశంలో సమాచార హక్కు విప్ల వాత్మకమైనది. ఆర్‌టిఐ యాక్ట్‌లోని సెక్షన్‌ 4 ప్రకారం దేశ పౌరులు ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లోని సమా చారాన్ని పొందవచ్చు’ అని సమాచార కమీషనర్‌ శైలేష్‌ గాంధీ అన్నారు.

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం...
RP-Bhavan దేశంలో రూపొందించి అమలు చేస్తున్న అసా ధారణ పథకం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌). గ్రామీణ ప్రాంతాలవాసులకు ఇది ఓ వరంగా పేర్కొనవచ్చు. ఈ పథకాన్ని 2006లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల వాసులు ఎందరో ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు 2008-09 సంవత్సర కాలంలో 4.47 కోట్లు, 2007- 08 కాలంలో 3.39 కోట్ల మంది ఉపాధి పొందడం విశే షం. ఇది ఉద్యోగ, ఉపాధి అవకాశాల హామీ పథకంగా పేరొందింది. గతంలో బీహార్‌ వంటి రాష్ట్రాల్లో భూములు లేని కార్మికులు పని కోసం పంజాబ్‌ వంటి రాష్ట్రాలకు వలసవెళ్లేవారు. కానీ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలవాసులు స్థానికంగానే ఉపాధి అవకా శాలు పొంది అక్కడే ఉండిపోగలిగారు. ఈ పథకం ద్వా రా రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాగా రెండవది స్థానికులకు ఉపాధి అవకా శాలు కల్పించడం. ఈ పథకం ద్వారా గ్రామీణ వాసుల కు నీటి సంరక్షణ, అటవీకరణ పథకాల్లో ఉపాధిని కల్పి స్తున్నారు. దీంతో పాటు వరద నీటి ముంపు ప్రాంతాల్లో పనులు, చెరువు అభివృద్ది పనులను అందజేస్తున్నారు.

జాతీయ ఆహార బిల్లు...
Republic-day3దేశంలోని లక్షలాది పేద ప్రజలు రెండు పూటలా తిండిలేక అలమటిస్తున్నారు. ఇటువంటివారికి కడుపులు నిం పేందుకు ఉద్దేశించిన చట్టం నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌. ఈ చట్టం ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెలా 25 కిలోల బియ్యం లేదా గోధుమలను అందజేస్తారు. ఒక్కో కిలో మూడు రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా కాం్ర గెస్‌ పార్టీ ఈ చట్టాన్ని రూపొందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ చట్టం త్వరలో రూపుదిద్దుకుంటుందని ఇటీ వల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వెల్లడించారు.

అత్యుత్తమ సైనిక పురస్కారాలు...
మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో స్వాతంత్య్ర సమర యో ధులు తమ జీవితాలను త్యాగం చేశారు. అహింసే ఆయు ధంగా కొందరు శాంతియుతంగా పోరాడితే మరికొందరు హింసా మార్గంలో నేరుగా బ్రిటీష్‌వారిని ఢీకొని ప్రాణాలర్పించారు. ఇక దేశ స్వాతంత్య్రానంతరం ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ్దా ల్లో దేశాన్ని రక్షించేందుకు పలువురు అమర జవాన్లు పోరా డి తమ ప్రాణాలనొడ్డారు. వీరి ధైర్యసాహసాలను గుర్తించి మన దేశ అత్యు త్తమ సైనిక శౌర్య పురస్కారాలను అందజేసి కేంద్ర ప్రభుత్వం వారి ని గౌరవించింది.

Republic-dayదేశం కోసం యుద్ధాలలో ప్రాణాల ర్పించిన అమర జవాన్లు ఎందరో ఉన్నా రు. వీరికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పుర స్కారాలను అందజేసింది. యుద్ధాలలో అమితమైన ధైర్యసాహసాలను ప్రదర్శిం చి శత్రువులపై దాడి చేసిన సైనికులకు ఈ అవార్డులను అంద జేస్తారు. ఈ పుర స్కారాలలో అత్యుత్త మైనవి పరమ వీర చక్ర(పివిసి), మహా వీర చక్ర (ఎంవిసి), వీర్‌ చక్ర (విఆర్‌సి).

పరమ వీర చ్రః
తిరుగులేని ధైర్య,సాహసాలను ప్రదర్శించి శత్రువులకు వెన్ను చూపకుండా పోరాడిన సైనిక యోధులకు ఈ అత్యుత్తమ పురస్కా రాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారాన్ని బ్రిటీష్‌ విక్టోరియా క్రాస్‌, యుఎస్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌, ఫ్రెంచ్‌ లీజి యన్‌ ఆప్‌ హానర్‌, రష్యన్‌ క్రాస్‌ ఆఫ్‌ సెయింట్‌ జార్జ్‌తో పోలుస్తారు. ఇండియన్‌ మిలిట రీలోని సైనికులకు దీన్ని అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం ఇదే. పరమ వీర చక్ర మెడల్‌ గుండ్రటి కాంస్య పతకం. దీన్ని 1.375 అంగుళాల వ్యాసంతో దీన్ని రూపొం దిస్తారు.


పరమ వీర చక్రను అందుకున్న యోధులు...
KaramSingh1. మేజర్‌ సోమ్‌నాథ్‌ శర్మ (1947, మరణానంతరం)
2. లాన్స్‌ నాయక్‌ కరమ్‌ సింగ్‌ (1948)
3. సెకండ్‌ లెఫ్టినెంట్‌ రామ రగోబ రాణె (1948)
4. నాయక్‌ జాదునాథ్‌ సింగ్‌ (1948, మరణానంతరం)
5. కంపెనీ హవల్దార్‌ మేజర్‌ పీరూ సింగ్‌ షెకావత్‌ (1948, మరణానంతరం)
6. కెప్టెన్‌ గురుబచన్‌ సింగ్‌ సలారియా(1961, మరణానంతరం)
7. మేజర్‌ ధన్‌సింగ్‌ థాపా (1962)
8. సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌ (1962, మరణానంతరం)
9. మేజర్‌ శైతాన్‌ సింగ్‌ (1962, మరణానంతరం)
10. కంపెనీ క్వార్టర్‌ మాస్టర్‌ హవీల్దార్‌ అబ్దుల్‌ హమీద్‌ (1965, మరణానంతరం)
11. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆర్దెశిర్‌ బుర్జోర్జి తారపూర్‌ (1965, మరణానంతరం)
MajorSomnathSharma
12. లాన్స్‌నాయక్‌ ఆల్బర్ట్‌ ఎక్కా (1971, మరణానంతరం)
13. ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ నిర్మల్‌జిత్‌సింగ్‌ సెకాన్‌ (1971, మరణానంతరం)
14. సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ కెతార్పల్‌ (1971, మరణానంతరం)
15. మేజర్‌ హోషియార్‌ సింగ్‌ (1971)
16. నాయబ్‌ సుబేదార్‌ బనా సింగ్‌ (1987)
17. మేజర్‌ రామస్వామి పరమేశ్వరన్‌ (1987, మరణానంతరం)
18. కెప్టెన్‌ మనోజ్‌ కుమార్‌ పాండే (1999, మరణానంతరం)
19. గ్రేనేడియర్‌ యోగిందర్‌ సింగ్‌ యాదవ్‌ (1999)
20. రైఫిల్‌మన్‌ సంజయ్‌ కుమార్‌ (1999, మరణానంతరం)

మహా వీర చక్రను అందుకున్న యోధులు...
రెండవ అత్యుత్తమ సైనిక పురస్కారం మహా వీర చక్రను పలు వురు వీర సైనికులు అందుకున్నారు. ఈ పురస్కారం మెడల్‌ను వెండితో గుండ్రటి ఆకృతిలో తయారుచేస్తారు. ఈ పురస్కారాన్ని 155మంది సైనికులు అందుకున్నారు. 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ఎక్కువగా ఈ అవా ర్డులు దక్కాయి. ఈ యుద్ధంలో పాల్గొన్న 11మంది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సైనికులకు ఈ అవార్డులను అందజేశారు.

రెండవ సారి మహా వీర చక్ర...
acharya ధైర్య,సాహసాలు ప్రదర్శించిన సైనికులకు రెండవ సారి కూడా మహా వీర చక్రను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇటువంటి వీర సైనికులు ఆరుగురు ఉన్నారు.
1. వింగ్‌ కమాండర్‌ జగ్‌మోహన్‌ నాథ్‌ (1962,1965)
2. మేజర్‌ జనరల్‌ రాజీందర్‌ సింగ్‌ (1948, 1965)
3. జనరల్‌ అరుణ్‌ శ్రీధర్‌ వైద్య (1965, 1971)
4. వింగ్‌ కమాండర్‌ పద్మనాథ్‌ గౌతమ్‌
(1965, 1871)
5. కల్నల్‌ చెవాంగ్‌ రించెన్‌ (1948, 1971)
6. బ్రిగేడియర్‌ సంత్‌ సింగ్‌ (1965, 1972)

మూడవ అత్యుత్తమ పురస్కారం వీర చక్ర...
దేశ సైనికులకు అందజేసే మూడవ అత్యుత్తమ పురస్కారం వీర చక్ర. ఈ మెడల్‌ను వెండితో తయారు చేస్తారు. ఇక వీరచక్ర అవార్డును రెండుసార్లు అందు కున్న సైనిక యోధులు కొందరు ఉన్నారు. ఈ వీర

సైనికులు ఎవరంటే...
Republic-day21. సుబేదార్‌ హర్‌సింగ్‌ (1947, 1948)
2. రిసాల్దార్‌ కర్తార్‌ సింగ్‌ గిల్‌ (1948)
3. సుబేదార్‌ మేజర్‌ భీమ్‌ చంద్‌ (1948)
4. మేజర్‌ జనరల్‌ వెంకటపతి రంగస్వామి (1948, 1951)
5. ఎయిర్‌ కమాండర్‌ ఆంథోని ఇగ్నేషియస్‌ కెన్నెథ్‌ స్యూర్స్‌ (1950, 1961)
6. గ్రూప్‌ కెప్టెన్‌ పురుషోత్తమ్‌ లాల్‌ ధావన్‌ (1950, 1962)
7. లెఫ్టినెంట్‌ కల్నల్‌ సతీష్‌ చంద్ర జోషి (1948, 1965)
8. ఎయిర్‌ మార్షల్‌ వినోద్‌ కుమార్‌ భాటియా (1965, 1971)
9. వింగ్‌ కమాండర్‌ వినోద్‌ కుమార్‌ నేబ్‌ (1965, 1971)
10. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ భూపేంద్ర కుమార్‌ బిష్నాయ్‌ (1965, 1971)
11. నాబ్‌ సుబేదార్‌ గుర్‌దేవ్‌ సింగ్‌ హన్స్‌ (1971)
12. కెప్టెన్‌ వి.ఎస్‌.శర్మ (1971)

మహావీర చక్ర ‘మేజర్‌ పద్మపాణి’
Republic-day6దశాబ్ద కాలం క్రితం జరిగిన కార్గిల్‌ యుద్దంలో ఎందరో వీర సైనికులు తమ ప్రాణాలొడ్డి పోరాడారు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన ఈ యుద్దంలో పలువురు అమరవీరులు తమ జీవితాలను త్యాగం చేసి భరతమాతను రక్షించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హర్కత్‌ ఉల్‌ అన్సార్‌తో పాటు పల ఇతర సంస్థల ఉగ్రవాదులు మన దేశ సరిహద్దులను దాటి ప్రవేశించారు. వారితో పాటు పాకిస్తాన్‌ సైనికులు కార్గిల్‌ ప్రాంతంలో కొంత మేర ఆక్రమించారు. దీంతో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం చెలరేగింది. మన దేశ సైనిక దళాలు ఎంతో ధైర్యంగా పోరాడి పాకిస్తాన్‌ను చిత్తుచేశాయి. చివరికి అప్పటి పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఇండియా సైనిక దళాల జోరుకు బెదిరి ఎక్కడ ఆ దళాలు తమ దేశాన్ని ఆక్రమిస్తాయో అని భయపడ్డాడు. అతను వెంటనే అమెరికా సహాయాన్ని కోరాడు. చివరికి అమెరికా చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్‌ సైనిక దళాలను సరిహద్దు నుంచి నవాజ్‌ షరీఫ్‌ వెంటనే వెనక్కి తెప్పించాడు.

రాష్ట్రానికే గర్వకారణంగా...
Yogendra-Singh-Yadavకార్గిల్‌ యుద్దంలో ఎందరో సైనికులు ధైర్యంగా పోరాడి తమ జీవితాలను అర్పించారు. వీరిలో ఒకరు మేజర్‌ పద్మఫణి ఆచార్య. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఆయన కార్గిల్‌ యుద్దంలో వెన్నుచూపకుండా పోరాడి వీరమరణం పొందారు. రెండవ రాజ్‌పుతానా రైఫిల్స్‌కు కంపెనీ కమాండర్‌గా మేజర్‌ పద్మఫణి ఆచార్య 1999 జూన్‌ 28న పాకిస్తాన్‌ సైనికులతో వీరోచితంగా పోరాడారు. చివరికి సైనిక ఉన్నతాధికారులు తనకు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తిచేసిన ఆయన తీవ్ర గాయాలతో ప్రాణాలర్పించారు. ఈ వీర సైనికుడికి మరణానంతరం మహావీర చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసి దేశం గౌరవించింది. ఈ యుద్దంలో పాల్గొన్న సమయంలో ఆయన తన తండ్రికి ఓ లేఖ రాశారు. ‘దేశం కోసం పోరాడే యుద్దంలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తావు...’అని శీకృష్ణుడి అర్జునుడికి బోధించిన గీతోపదేశానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

పంచవర్ష ప్రణాళికలు - ప్రాధాన్యతలు
list1. తొలి ప్రణాళిక - 1951-56 వ్యవసాయానికి అత్యున్నత ప్రాధాన్యత, నీటి పారుదల, విద్యుత్‌
2. రెండవ ప్రణాళిక - 1956- 61 భారీ పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత
3. మూడవ ప్రణాళిక - 1961- 66 స్వయం పోషకత్వం
4. ప్రణాళికా విరామం 1967- 69 మూడు వార్షిక ప్రణాళికలు
5. నాలుగవ ప్రణాళిక - 1969- 74 సమానత్వం, సామాజిక న్యాయం
6. ఐదవ ప్రణాళిక - 1974-79 స్వయం సమృద్ధి
7. ఆరవ ప్రణాళిక - 1980-85 దారిద్య్ర నిర్మూలన
8. ఏడవ ప్రణాళిక - 1985-90 ఉపాధి అవకాశాల పెంపు
9. వార్షిక ప్రణాళికలు -1991-92 ----
10. ఎనిమిదవ ప్రణాళిక - 1992-97 వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
11. తొమ్మిదవ ప్రణాళిక - 1996-2002 నిలకడైన ధరలతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
12. పదవ ప్రణాళిక - 2002-07 మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన వృద్ధి
13. పదకొండవ ప్రణాళిక - 2007-12 వేగవంతమైన, కలుపుకుపోయే వృద్ధి
మన రాజ్‌భవన్‌ చరిత్ర..

హైదరాబాదు రాజ్‌భవన్‌.. గవర్నర్‌ నివాసం. 21.50 ఎకరాలలో విస్తరించిన ఈ భవనం చరిత్ర ఇప్పటి కాదు.. స్వాతంత్రం రాక మునుపే ఎన్నో ఏళ్ళక్రితమే ఈ భవనానికి పునాదులు పడ్డాయి. అప్పటి నిజాం ప్రభువుల పాలనలోనే ఎన్నో మార్పులూ.. చేర్పులకూ గురవుతూ ప్రస్తుతం రాజ్‌భవన్‌గా.. గవర్నర్‌ నివాసంగా వెలుగుతోంది.

list11930లో నిజాం పరిపాలనా సమయంలో నవాబ్‌ ప్రధానమంత్రి అధికార భవనం ఇక్కడ వుండేది. నవాబ్‌ షహజర్‌ జంగ్‌, సయ్యద్‌ అఖిల్‌ బిల్‌గ్రామి పరిపాలనా కాలంలోని(1914)లో హైదరాబాదు సంస్థానం మ్యాప్‌ గనుక చూసినట్లైతే ప్రస్తుతం ఇప్పుడున్న దర్బారు హాలు కు దగ్గరలో రెండు భవనాలు వుండేవి. వీటిని నవాబ్‌ షహజోర్‌ జంగ్‌ కట్టించాడు. అనంతరం కాలక్రమేణా వీటి స్థానంలో ఆధునిక భవనాలను నిర్మించారు. ముఖ భాగాన్ని ఎన్నో మార్పులు చేయించారు.

ఇప్పుడున్న దర్బారు హాల్‌ను 1936లో ఎరిక్‌ మారె ట్‌, జైన్‌ యార్‌ జంగ్‌ అనేవారు జూబ్లీ హాల్‌, ఇతర మామూలు భవనాలు వంటివన్నీ తిరిగి పునర్‌నిర్మిం చేందుకు కావలసిన ప్లానును చేశారు. ఇప్పుడున్న జూబ్లీ హాల్‌, బాల్‌ భవన్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, లేడా హైదరి క్లబ్‌, బషీర్‌బాగ్‌లోని ప్రాంతాల నిర్మాణాలన్నీ వీరే డిజైన్‌ చేశారు.

1936లో నిజాం ప్రధానమంత్రి దర్బార్‌ హాల్‌ను ఆక్రమించి అక్కడే నివాసం వున్నారు. కానీ ఎక్కువ కాలం వుండలేకపోయారు. 1941లో ఇప్పటి దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌కు సమీపంలోని ఒక భవనానికి తన మకాం ను మార్చుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నవాబ్‌ చత్తరి (1941-1946 తరువాత మే-నవంబర్‌, 1947), సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ (ఆగష్టు 1946- 1947 మే), సర్‌ మెహదీ యార్‌ జంగ్‌ (నవంబర్‌- డిసెంబర్‌, 1947) మీర్‌ లేఖ్‌ అలి, కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ (1947-48) వీటిలో నివాసం వున్నారు.
ఇప్పుడున్న నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన భాగాలకు వస్తే.. వీటిని అప్పుడే ఎంతో ప్రత్యేకంగా నిర్మాణం చేశారు (అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికంగా దీన్ని రూపొందించారు). ఇది ఓ చేప ఆకారాన్ని పోలినట్లుగా నిర్మించారు. ఇది 1930లోనే నిర్మించా రు. అప్పటి నుండి తిరిగి జనవరి 2002లో పునర్‌ నిర్మాణం చేశారు.

దీని చారిత్రక విశేషాన్ని దృష్టిలో వుంచుకుని ఆ కాలంలో వేటితో అయితే నిర్మాణం చేసేవారో వాటినే వుపయోగించి పునరుద్ధరించారు.

ఇక 1914లో నిర్మించిన నిర్మాణా విషయాలకు వస్తే.. షాహ్‌ మంజిల్‌, ఉమ్మీద్‌ మంజిల్‌ హయాంలోనే వీటన్నిటి నిర్మాణం జరిగింది.. ఉమ్మీద్‌ మంజిల్‌ నిర్మా ణాలు 19వ శతాబ్దం చివరి వరకు కూడా చాలా చేశా రు. శతాబ్దం చివరి వరకు యూరోపియన్‌, ఇస్లామిక్‌ స్టైల్‌లో వారు భవనాలను నిర్మించారు. ఇతర దేశాల నుండి కూడా కళాకారులను వీరు రప్పించి మరీ నిర్మాణం చేశారు.

ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భవనం నిర్మాణం మొదటి భాగంలో ఉమ్మీద్‌ మంజిల్‌ యూరోపియన్‌ స్టైల్‌ని అనుసరించారు. మిగిలిన విభాగాలలోనూ ఎన్నో ప్రత్యేకతలను తీసుకున్నారు. షాహ్‌ మంజిల్‌ నిర్మించిన భవనం (ఏఎస్‌డిసి ప్రస్తుత భవనం) ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. మొఘల్‌ ఆర్చ్‌ నిర్మాణం వర్ణించడానికి కూడా అంతుచిక్కనిది. ఇక వీరు వుపయోగించిన కిటికీలు, లాంతర్లు మిగిలినవి రాజస్థానీ స్టైల్‌లో నిర్మించారు.

ఇప్పటికీ ఓ అద్భుతం..
Republic-day45
ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌ భవన్‌ ప్రస్తుత భవనం పూర్వ సంస్కృతిని నిదర్శనంగా మిగిలిన వాటిలో చాలా ముఖ్యమైనది. అప్పటి సంస్కృతీ, వారి కళాత్మకత, నైపుణ్యం వంటివన్నీ ఇందులో ప్రతిబిం బిస్తున్నాయి. రాష్టప్రతి, చీఫ్‌ కమాండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్మీ ఫోర్సెస్‌ పదాతి దళాల నుండి వందన గౌరవం స్వీకరిస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మరో దేశ ముఖ్య నేతను ఆహ్వానిస్తారు. ఈ పెరేడ్‌లో సైనిక కవాతుతో పాటు మన మన ఆయుధ సంపత్తిని కూడా ప్రదర్శిస్తారు. అనేక సాంస్కృతి కళాత్మక కార్యక్రమాలునిర్వహిస్తారు. చివరిగా ఈ కార్యక్రమం ముగింపులో వైమానిక దళాలు జెట్‌ విమానాలతో కలిసి చేసే ‘మువ్వన్వెల జెండా’ రెపరెపల అనంతరం ముగుస్తుంది. వీటికి సమానంగా రాష్ట్రాలలోనూ పెరేడ్‌ నిర్వహిస్తారు. ఇక్కడ గవర్నర్లు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అక్కడిలాగే ఇక్కడా పెరేడ్‌ నిర్వహిస్తారు.

అవినీతిని తరిమేద్దాం: రాష్ర్టపతి ప్రతిభా పాటిల్‌

pra

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో పార్లమెంట్‌ సజావుగా పని చేసేలా ప్రభుత్వం, ప్రతిపక్షాలు సమస్యలను పరిష్కరించుకో వాలని రాష్ర్టపతి ప్రతిభా పాటిల్‌ మంగళవారం ఉద్బోధిం చారు. రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ర్టపతి అవినీతి సమస్యను కూడా ప్రధానంగా ప్రస్తావించారు.‘అవినీతి అభివృద్ధికి, సత్పరిపాలనకు శత్రువు’ అని ప్రతిభా పాటిల్‌ అభివర్ణిస్తూ, ఈ సమస్య పరిష్కా రానికి వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని కోరారు.

పార్లమెంట్‌ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడం ప్రభుత్వం, ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన పక్షాల మధ్య చర్చలు ప్రజాస్వామిక పద్ధతిలో పని చేయడానికి కీలకం అని ప్రతిభా పాటిల్‌ పేర్కొన్నారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై దర్యాప్తునకు జెపిసిని నియమించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన పర్యవసానంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయి నెల రోజులకు పైగా గడచిన అనంతరం పార్లమెంట్‌ కార్యకలాపాలపై రాష్ర్టపతి ఈ అభిప్రాయం వెలిబుచ్చడం గమనార్హం. ‘సర్వకాల సర్వావస్థల లో పార్లమెంట్‌ గౌరవ మర్యాదలను కాపాడడం ముఖ్యం.

నిర్మాణాత్మ, సహకార వైఖరితో సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో పార్లమెంట్‌లో చర్చలు, కార్యక్రమాలు సాగుతా యనే అభిప్రాయం ప్రజల మస్తిష్కాలలో పాతుకుపోవాలి. అదే జరగకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సడలవచ్చు. ఫలితంగా వారిలో నిస్పృహ నెలకొంటుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యా నికి అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థల నడకను కుంటుపరుస్తుంది. అందువల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థలలో ప్రధాన పక్షాల మధ్య చర్చ ప్రజాస్వామ్యం పని చేయడానికి కీలకం’ అని ప్రతిభా పాటిల్‌ ఉద్బోధించారు.

‘సత్పరిపాలన, ప్రజా హితమే లక్ష్యంగా పాలనా యంత్రాం గాన్ని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ‘ప్రజా సేవ రంగంలో అలసత్వం, నిర్లక్ష్య వైఖరి అంగీకారయోగ్యం కాదు’ అని అన్నా రు. ‘అవినీతి అభివృద్ధికి, సత్పరిపా లనకు శత్రువు. అవినీతిని సమర్థంగా అరికట్టడానికి వ్యవస్థాగత మార్పులు తీసుకురావ డం గురించి తీవ్రంగా ఆలోచించడం అవసరం’ అని పేర్కొ న్నారు. ‘ఆర్థిక సంస్థలు, కార్పొ రేట్‌ ప్రపంచం, పౌర సమాజం తమ విధుల నిర్వహణలో ఉన్నత స్థాయిలో నిజాయితీతో వ్యవహరించాలి. ప్రభుత్వం, ప్రజల మధ్య సిసలైన భాగ స్వామ్యమే సకారాత్మక మార్పు తీసుకువచ్చి న్యాయమైన సమాజం సృష్టికి దోహదం చేయగలదు’ అని ఆమె అన్నారు.

పద్మ అవార్డు గ్రహీతలకు అభినందన మందారమాల


తెలుగు తేజం మరోసారి ఇనబింబమై మెరిసింది. అక్కినేని నాగేశ్వర్రావుకు పద్మవిభూషణ్.. గాన గంధర్వుడు ఎస్.బి. బాలసుబ్రమణ్యంకు పద్మభూషణ్.. ఏరువాక సాగారో ఫేం వహీదా రహమాన్‌కు పద్మభూషణ్.. నిన్నటి టాలీవుడ్ హీరోయిన్ టబుకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది భారత ప్రభుత్వం.

అక్కినేని నాగేశ్వరరావు


తెలుగు సినీపరిశ్రమలో నిలువెత్తు శిఖరంగా ఎదిగిన బాలరాజు అయన.. సుదీర్ఘకాలం వెండితెరను ఏలిన దసరాబుల్లోడు.. ప్రేమికుడంటే ఎలా ఉండాలో.. నటనానిర్వచనం ఇచ్చిన దేవదాసు ఆయన.. పద్మశ్రీ.. పద్మభూషణ్.. ఇప్పుడు పద్మ అవార్డుల్లో అత్యున్నత పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినీ వెలుగు ఆయన..
1940లో విడుదలయిన "ధర్మపత్ని" అక్కినేని నాగేశ్వరరావు నటించిన మొదటి చిత్రం. నలబయ్యవ దశకం ఏఎన్నార్‌ కెరీర్‌కి బీజం పడింది. "శ్రీ సీతారామ జననం, మాయలోకం, బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్ను వంటి సినిమాలతో ఎన్నార్‌ కెరీర్‌ ఊపందుకుంది.
ఇక యాభైయవ దశకం అక్కినేని దశను తిరగరాసింది. పౌరణిక సినిమాలతో పాటు సాంఘీక చిత్రాలు చేసిన ఏఎన్నార్‌ ఖాతాలో ఎన్నో సూపర్‌హిట్స్‌ చేరాయి. పరమానంద శిష్యుల కథ, మాయల మరాఠి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, అల్లావుద్దీన్‌ అద్భుత దీపం, సతీసావిత్రి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఆరవయ్యో దశకంలోనూ మరెన్నో హిట్స్‌ అక్కినేని ఖాతాలో చేరాయి. పెళ్లికానుక, నమ్మినబంటు, ఇద్దరు మిత్రులు, మంచి మనుషులు, గుండమ్మ కథ, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి , ప్రేమించి చూడు, అంతస్తులు, ఆత్మగౌరవం, ఆత్మబలం వంటి సినిమాలు ఏఎన్నార్‌ కెరీర్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాయి.
డెభ్బయ్యవ దశకం కూడా అక్కినేని హవా వీచింది. డెబ్బయ్యవ దశకం ప్రారంభంలోనే వచ్చిన సినిమా దసరాబుల్లోడు. నాగేశ్వరరావు ఉల్లాసంగా ఉత్సాహంగా వేసిన స్టెప్పలకు ప్రేక్షకులు అదే రీతిలో స్టెప్పులేశారు. ఆనాటి ఏఎన్నార్‌ డాన్స్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.
దసరాబుల్లోడు తర్వాత అక్కినేని నటించిన మరో భారీ హిట్‌ ప్రేమనగర్‌. తాజ్‌మహల్ కి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర రంగంలో "ప్రేమనగర్"కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నలభై ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలోని అక్కినేని నటనకు ప్రేక్షకులు జై కొట్టారు.
అక్కినేని నటనాజీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలు ఎన్నో ఎన్నెన్నో. డెభ్బయ్యవ దశకంలోనే వచ్చిన మరెన్నో సినిమాలు సూపర్‌ హిట్‌ అయి అక్కినేనిని ఎవర్‌గ్రీన్‌ హీరోగా నిలబెట్టాయి. భక్తతుకారాం, అందాల రాముడు, ప్రేమలు పెళ్ళిళ్లు వంటి సినిమాల్లో అక్కినేని నటనకు మంచి పేరు వచ్చింది.
భగ్న ప్రేమికుడిగా ఏఎన్నార్‌ నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్సే. ప్రేమాభిషేకం, ప్రేమమందిరం, లైలా మజ్ను, దేవదాసు అనార్కలి.. వంటి సినిమాలు అక్కినేని కెరీర్‌ను ఆకాశానికెత్తేశాయి.
ఎన్టీఆర్‌, గుమ్మడి, ఎస్వీరంగరావు వంటి ఆనాటి అగ్రనటులుతో ఏఎన్నార్‌ కలిసి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ మాయాబజార్. అభిమన్యుడిగా అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. కలర్‌లోనూ వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది.
ఏఎన్నార్ తన తనయుడు నాగార్జునతో పోటీపడి 'రామదాసు' చిత్రంలో నటించారు. తనలో ఇంకా ఉత్సాహం తగ్గలేదని నిరూపించారు. కబీర్‌దాసు పాత్రలో నటించి అలరించారు. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరాముడుగా నటిస్తున్న శ్రీరామరాజ్యం సినిమాలో వాల్మీకిగా చెయ్యబోతున్నారు అక్కినేని.

//////////////////////////////////////////////////////////////////////////////
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది . తన గాన మాధుర్యంతో భారతీయ భాషలన్నింటిలోనూ శ్రోతలను అలరిస్తున్న రాగాల రారాజు బాలు. ఆ గళంలో పలకని రాగంలేదు. భావం లేదు. గొంతులు మార్చి మార్చిపాడి చలాకీగా చకచకాసాగిపోయే పాటలతోసంగీత అభిమానులనురసగంగలో ముంచెత్తుతూనేఉన్నారాయన .

సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మనందరినీ అలరిస్తున్న రాగాల రారాజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

మద్రాసులో జరిగిన ఒక సంగీత పోటీలో ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి దృష్టిలో పడ్డారు. దీంతో కోదండపాణి సంగీత దర్శకత్వంలో పద్మనాభం నటించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో సినీగాయకునిగా అడుగుపెట్టారు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని పేరు పెట్టుకున్నారు బాలు.

తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్ఛారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది.
శంకరాభరణం చిత్రంలోని శాస్త్రీయ సంగీత బాణీలతో కూర్చబడిన పాటలను అజరామరమైన రీతిలో ఆలపించి దక్షిణ భారత సినీ గాయకులలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు బాలు.
40 ఏళ్ళ సినీప్రస్థానంలో 11 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి, 40 కి పైగా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి అరుదైన రికార్డు సృష్టించిన ఘనత ఆయనది. ఒకరికా.. ఇద్దరికా.. ఏంతో మంది నటులకు ఆయన గాత్ర దానం చేశారు. ఆయన నందమూరి తారక రామరావుకి పాడితే అచ్చంగా ఆయన పాడినట్లే ఉంటుంది. అదే అక్కినేని నాగేశ్వరరావుకి పాడితే నిజంగా ఆయనే పాడినట్లుంటుంది. అలాగే కృష్ణ, శోభన్ బాబు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సుత్తివేలు.. వంటి నటులకూ బాలు వారి గాత్రాన్ని ఇమిటేట్‍ చేస్తూ అలాగే పాడేవారు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో ఆణిముత్యాలు. ఒకే రోజున తమిళంలో 19 పాటలు, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కన్నడంలో 17 పాటలు పాడి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదుచేసుకున్నారు బాలు. ఇక ఆయన్ని వరించిన అవార్డులు, రివార్డులకు అంతే లేదు. శంకరాభరణం, సాగర సంగమం, రుద్రవీణతో పాటు మిగత భాషల చిత్రాల్లో పాడినందకు గాను ఆయనకు ఆరు జాతీయ అవార్డులు లభించాయి. నటుడిగానూ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఎస్పీ బాలు. గాయకుడుగానే కాకుండా సంగీత దర్శకుడుగా, నటుడుగా, చిత్ర నిర్మాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, కోదండపాణి థియేటర్‌ అధినేతగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. కళారంగంలో ఆయన అందిస్తున్న సేవలకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది.

/////////
టబు

హైదరాబాద్‌ అమ్మాయి టబుకు భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఎటో వెళ్లిపోయింది మనసు... అంటూ ఓ పుష్కరం క్రితం యూత్‌ కు గుబులెక్కించిన టబు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొన్నేళ్ళ పాటూ రాజ్యమేలింది.
మన హైదరాబాద్‌ అమ్మాయి టబు. టబుస్సుమ హష్మి. షబనాఆజ్మి మేనకోడలు. హమ్‌నౌజవాన్‌ సినిమాతో ఆరంగేట్రం చేసింది ఈ నైజాం పోరి. ఎనిమిదేళ్లకు పైగా అష్టకష్టాలు పడి చివరికి నాగార్జునతో నటించిన నిన్నేపెళ్లాడతా సినిమాతో తారాపథంలో నిలిచింది. తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో తల్లికి చెబుతూ పాడే పాటలో అచ్చమైన తెలుగింటి మోడ్రన్‌ అమ్మాయిగా అందరి మనసులు గెలుచుకుంది.
నిన్నే పెళ్ళాడుతా తర్వాత టబు బాలీవుడ్‌లో ఆల్ టైమ్ క్లాసిక్స్ లాంటి మాచిస్.. విరాసత్.. బోర్డర్ లాంటి సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకుంది. పాత్ర ఎలాంటి దైనా తనదైన ముద్ర వేసుకునే టబుకు కళ్ళతో ఎలాంటి భావాన్నయినా పలికించగలదనే పేరు ఉంది.
తెలుగులో నాగార్జునతో మళ్ళీ ఆవిడే మా ఆవిడలో నటించింది. హమ్ సాథ్ సాథ్ హై.. హై తూతూ.. బీవి నంబర్ వన్.. తక్షక్.. లాంటి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిపోయింది. చాందినీ బార్ లో డాన్సింగ్ గర్ల్ గా ఆమె అభినయానికి నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.
అందరివాడు.. షాక్.. ఇదీ సంగతి.. పాండురంగడు.. లాంటి తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడూ కనపించినా టబు అంటే బరువైన పాత్రల్లో ఈజ్ ప్రదర్శించే నటిగా మనకు గుర్తుండిపోతుంది. చీనికమ్ లో అమితాబ్ తో పోటి పడి అద్భుతమైన నటన ప్రదర్శించింది.