Tuesday, January 25, 2011

అవినీతిని తరిమేద్దాం: రాష్ర్టపతి ప్రతిభా పాటిల్‌

pra

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో పార్లమెంట్‌ సజావుగా పని చేసేలా ప్రభుత్వం, ప్రతిపక్షాలు సమస్యలను పరిష్కరించుకో వాలని రాష్ర్టపతి ప్రతిభా పాటిల్‌ మంగళవారం ఉద్బోధిం చారు. రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ర్టపతి అవినీతి సమస్యను కూడా ప్రధానంగా ప్రస్తావించారు.‘అవినీతి అభివృద్ధికి, సత్పరిపాలనకు శత్రువు’ అని ప్రతిభా పాటిల్‌ అభివర్ణిస్తూ, ఈ సమస్య పరిష్కా రానికి వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని కోరారు.

పార్లమెంట్‌ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడం ప్రభుత్వం, ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన పక్షాల మధ్య చర్చలు ప్రజాస్వామిక పద్ధతిలో పని చేయడానికి కీలకం అని ప్రతిభా పాటిల్‌ పేర్కొన్నారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై దర్యాప్తునకు జెపిసిని నియమించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన పర్యవసానంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయి నెల రోజులకు పైగా గడచిన అనంతరం పార్లమెంట్‌ కార్యకలాపాలపై రాష్ర్టపతి ఈ అభిప్రాయం వెలిబుచ్చడం గమనార్హం. ‘సర్వకాల సర్వావస్థల లో పార్లమెంట్‌ గౌరవ మర్యాదలను కాపాడడం ముఖ్యం.

నిర్మాణాత్మ, సహకార వైఖరితో సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో పార్లమెంట్‌లో చర్చలు, కార్యక్రమాలు సాగుతా యనే అభిప్రాయం ప్రజల మస్తిష్కాలలో పాతుకుపోవాలి. అదే జరగకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సడలవచ్చు. ఫలితంగా వారిలో నిస్పృహ నెలకొంటుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యా నికి అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థల నడకను కుంటుపరుస్తుంది. అందువల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థలలో ప్రధాన పక్షాల మధ్య చర్చ ప్రజాస్వామ్యం పని చేయడానికి కీలకం’ అని ప్రతిభా పాటిల్‌ ఉద్బోధించారు.

‘సత్పరిపాలన, ప్రజా హితమే లక్ష్యంగా పాలనా యంత్రాం గాన్ని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ‘ప్రజా సేవ రంగంలో అలసత్వం, నిర్లక్ష్య వైఖరి అంగీకారయోగ్యం కాదు’ అని అన్నా రు. ‘అవినీతి అభివృద్ధికి, సత్పరిపా లనకు శత్రువు. అవినీతిని సమర్థంగా అరికట్టడానికి వ్యవస్థాగత మార్పులు తీసుకురావ డం గురించి తీవ్రంగా ఆలోచించడం అవసరం’ అని పేర్కొ న్నారు. ‘ఆర్థిక సంస్థలు, కార్పొ రేట్‌ ప్రపంచం, పౌర సమాజం తమ విధుల నిర్వహణలో ఉన్నత స్థాయిలో నిజాయితీతో వ్యవహరించాలి. ప్రభుత్వం, ప్రజల మధ్య సిసలైన భాగ స్వామ్యమే సకారాత్మక మార్పు తీసుకువచ్చి న్యాయమైన సమాజం సృష్టికి దోహదం చేయగలదు’ అని ఆమె అన్నారు.

No comments:

Post a Comment