Thursday, July 11, 2013

నిర్ణయవేళలో నీడలా నడిపిస్తున్న ఆ ఇద్దరు


ఏపీ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో..రాష్ట్ర మంతా హస్తిన వైపే చూస్తోంది. తెలంగాణపై తెల్చేసే దిశగా చర్జలు సాగుతున్నాయన్న వార్తలతో రాష్ట్రనేతలంతా కొద్దిరోజులుగా దేశరాజధానికి క్యూకడుతున్నారు. సమైక్య, ప్రత్యేక వాదాలు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లే మన మంత్రులు, ఎమ్మెల్యేలకు కేవీపీ, జైపాల్ రెడ్డిలే కేరాఫ్ అడ్రస్. సీమాంధ్ర నేతలకు పెద్దదిక్కుగా కేవీపీ తెలంగాణ నాయకులకు మార్గదర్శిగా జైపాల్ రెడ్డి అక్కడ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.   వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అప్పట్లో డామినేటింగ్ పాలిటిక్స్ ప్లే చేసిన కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం హైకమాండ్ కి వీరవిధేయుడు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతోనే కేవీపీ ఇంపార్టెన్స్ మరింత పెరింగింది. రాజశేఖరరెడ్డితోపాటు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేవీపీ కూడా వెళ్లేవారు. అలా అధిష్ఠానంతో ఏర్పడ్డ ఆ సత్సంబంధాలను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు.

రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్ రెబల్ జెండా ఎగరేసినా  కేవీపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానందగ్గర మంచి మార్కులు కొట్టేశారు.  వైఎస్ ప్రాణ స్నేహితుడిగా ఆయన కూడా తిరుగుబాటు బావుటా ఎగరేస్తారమోనన్న అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర పెంచుకుంటూ ముందుకు నడిచారు. ప్రస్తుతం సీమాంధ్ర నేతలకు ఆయనే బిగ్ బాస్.. భాగ్యనగరం నుంచి  డైరెక్టుగా అధిష్ఠానం దగ్గరకు వెళ్లలేని నేతలంతా కేవీపీ ద్వారానే రాయబారం నడుపుతుంటూరు. ముఖ్యంగా తెలంగాణ సమైక్య నినాదాలు జోరందుకున్న ప్రతీ సారీ కేవీపీ కీలకపోత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై తీవ్ర చర్చలు జరుగుతున్న ఇప్పుడు కూడా కేవీపీ సీమాంధ్ర నేతలను లీడ్ చేస్తోన్నారు.

మరోవైపు తెలంగాణ నేతలకు పెద్దన్నగా జైపాల్ రెడ్డి వ్యవహిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న  జైపాల్ రెడ్డిని సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో పదవులు వరించాయి…హైకమాండ్ కి నమ్మిన బంటుగా ఉండే జైపాల్ కి సోనియా దగ్గర మంచి చనువు.. పలుకుబడి ఉందని చెబుతుంటూరు. రాష్ట్రానికి చెందిన ఏ సమాచారమైనా  అధిష్ఠానం జైపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుంటుంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న జైపాల్ చాలా సందర్భాల్లో హైకమాండ్ కి రాష్ట్ర నేతలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూవచ్చారు.  తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంత వాసులకు జైపాల్ పెద్ద దిక్కైయ్యారు. అధిష్ఠానానికి ప్రత్యేక వాదన వినిపించాలనుకునే తెలంగాణ వాదులు ముందుగా ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డినే ఆశ్రయిస్తారని టాక్ . ఆయన సలహా సూచనలతో ఢిల్లీ పెద్దలను కలిసి తమ వాదనను వినిపిస్తారు.
More Latest Updates... www.drusyam.net    

No comments:

Post a Comment