Saturday, July 6, 2013

బొత్స అడ్డంగా దొరికిపోతాడా?

రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంల కంటే పీసీసీ చీఫ్ బొత్స చాలా ఫాస్ట్ గా కసరత్తుచేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఉభయ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ఎంపీల నుంచి కూడా తెలంగాణ అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తమ అభిప్రాయాల మాట అలా ఉంచి...పీసీసీ ఛీఫ్ మీ అభిప్రాయమేమిటని కొందరు నేతలు ఎదురు ప్రశ్న వేయడంతో సత్తిబాబు జవాబు చెప్పలేక పోతున్నారు.

తెలంగాణా ఉద్యమం ఉధృతమైనపుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనను సమర్ధిస్తానని బోల్డ్ గా  స్టేట్ మెంట్  ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే కారణం వల్లే  పీసీసీ ఛీఫ్ పదవికి బొత్స పేరును ప్రతిపాదించినపుడు టి.కాంగ్రెస్ నేతలు సైతం పూర్తిగా మద్దతిచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొత్స తెలంగాణపై ఆచి,తూచి స్పందించడం మొదలు పెట్టారు.

పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో తెలంగాణ అమరవీరులకు సంతాపం తెలపడానికి కూడా బొత్స విముఖత చూపారంటే ఆయన వైఖరిలో వచ్చిన మార్పుపై టి.కాంగ్రెస్ నేతలు సైతం విర్శించే పరిస్ధితి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వ్యక్తిగతంగా తనకు ఎన్ని అభిప్రాయాలైన ఉండొచ్చు కానీ.. ప్రస్తుతం హైకమాండ్ మైండ్ సెట్ కి అనుగుణంగానే నడుచుకుంటానని సత్తిబాబు సెలవిస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారుచేసి ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్వజయ్ సింగ్ చెప్పడంతో బొత్స ఎవరికి అనుకూలంగా నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశమయ్యింది.

No comments:

Post a Comment