Friday, November 23, 2012

కడప స్థానం నాదే..!


వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్ఆర్ సీపీ ఆశాకిరణం షర్మిల ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. రానున్న ఎన్నికల్లో జగన్‌ పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే, ఇదే సమయంలో జగన్‌ చిన్నాన్న వైఎస్ భాస్కరరెడ్డి తనయుడు అవినాష్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. అయితే, షర్మిల పాదయాత్ర ప్రారంభించే ముందు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని కుటుంబసభ్యులకు స్పష్టం చేశారని, ఆ మేరకు వారి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో పాదయాత్ర ప్రారంభించారని సమాచారం. సొంత కుటుంబీకులే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంత కుటుంబీకులే పార్లమెంటుకు వెళ్లాలని షర్మిల వాదించడంతో వారంతా అందుకు అంగీకరించారు.
అయితే.. చాలాకాలం క్రితం వరకూ ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న అవినాష్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బద్వేలు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావించారు. ఆ మేరకు ముందు ఒక తేదీ అనుకున్నప్పటికీ, బద్వేలు ఇంచార్జి గోవిందరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈనెల 23న బద్వేలు మండలం కలసపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.







No comments:

Post a Comment