Sunday, November 18, 2012

‘ఆమ్నెస్టీ’ ప్రకటించిన దుబాయ్

యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రసల్‌కైమా, ఉమాన్‌కుమ, ఖుజెర్‌మా, అజ్మాన ప్రాంతాల్లో ఉపాధి వీసా గడువు ముగిసిన తర్వాత ఉపాధి పొందుతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఊరట కలిగించింది. సందర్శక వీసాపై వెళ్లి దొంగచాటున (కల్లివెల్లి) అయి ఉపాధి పొందుతున్న కార్మికులకు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 4 లోగా ఎలాంటి జరిమానాలు లేకుండా స్వదేశానికి వెళ్లేలా వీలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం తీర్మానించింది.

చేతిలో వీసాలు లేక స్వగ్రామాలకు వెళ్లలేక నరకయాతన పడుతున్న కార్మికులకు ఇది మంచి వార్తే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబాయ్‌లోని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ శర్మ సూచించారు. మన రాష్ట్రం నుంచి సుమారు 20 వేల మంది కార్మికులు వీసాలు లేకుండా యూఏఈలో ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని సుమారు 15 వేల మంది కార్మికులు వీసా లేకుండా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా.




No comments:

Post a Comment