Tuesday, November 20, 2012

అత్యంత ఖరీదైన ఖైదీ.!

తాజాగా ఉరి తీసిన ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఖైదీ. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన కసబ్ భద్రతకు ఇప్పటివరకూ ఖర్చుపెట్టిన మొత్తం 60 కోట్లు పైనే అని ఓ అంచనా. కసబ్ రక్షణ కోసం నెలకు సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఇకపై తమవల్ల కాదంటూ.. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొరపెట్టుకుంది. సైన్యంలో అత్యంత కీలకమైన విభాగానికి చెందిన నిపుణులైన మెరికల్లాంటి 250 మంది ఇండో-టిబెట్ బోర్డర్  సైనికులను కసబ్ భద్రత కోసం వినియోగించడంతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో తొలిసారిగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు ఇక్కడకు వచ్చి వాంగ్మూలమిచ్చారు.

మహరాష్ర్ట 28 కోట్లు..!
కసబ్ రక్షణ కోసం ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయలను ఖర్చుచేసినట్లు అర్జీలో తెలిపింది. ఆహారం, వైద్యం, భద్రతా సిబ్బంది కోసం భారీగా ఖర్చు పెట్టామని కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ తెలిపారు.

గదికి ఐదున్నర కోట్లు..!
కసబ్‌ ఇప్పటి వరకు ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో.. ప్రత్యేక గదికి ప్రభుత్వం 5.24 కోట్ల రూపాయల్ని ఖర్చుచేసింది. నరహంతుకుడి తిండికి, వైద్య అవసరాలకు, మందులకు, భద్రతా కల్పనకు కోట్లరూపాయలను నీళ్లలా ఖర్చుపెట్టింది.



No comments:

Post a Comment