Saturday, October 13, 2012

ఫైరవీలతోనే నంది అవార్డులు..?

    నంది అవార్డుల లొసుగు మరోసారి బయటపడింది. నంది అవార్డుల విషయంలో ఏటేటా అపవాదు మూటగట్టుకుంటున్న ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఫైరవీలతోనే నంది అవార్డులు వస్తాయా అనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

శ్రీరామరాజ్యం వంటి కళాత్మక చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు బాపు. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించిన బాపుకు అవార్డు రాకపోవడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్తమ చిత్రంగా ప్రకటించినప్పటికీ బాపు దర్శకత్వ ప్రతిభకు అవార్డు ప్రకటించలేదన్న విమర్శ ఉంది.

నందమూరి తారక రామరావు వంటి గొప్ప నటులకే నంది అవార్డులు రాలేదని, రాజకీయాలు చేస్తేనే నందులు వస్తాయని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. నంది అవార్డు పొందాలంటే తెరవెనుక రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉందని.. అలాంటి నీచ సంస్కృతి తనకు లేదని, అందుకే తనకు ఇంత వరకు నంది అవార్డు రాలేదని ఇటీవల మోహన్ బాబు తేల్చి చెప్పారు. గతంలో అనేక పర్యాయాలు నంది అవార్డుల మీద మెహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. అయితే ఈ సారి మాత్రం మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కు బెస్ట్ లేడీ విలన్ అవార్డు దక్కింది.

2011లో ప్రేక్షకుల ఆధరణ పొందిన సినిమాలను నంది అవార్డుల కమిటి విస్మరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా దూకుడు, శ్రీరామరాజ్యం చిత్రాలకు నందులు వరిస్తాయని ఊహించిందే. అయితే ఈ సినిమాలకు అవార్డుల పంట పండటంపై భిన్నభిప్రాయాలు లేకున్నా, బరిలో ఉన్న ఇతర చిత్రాలకు సమ న్యాయం జరగలేదన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి.

ఇతర కేటగిరీల్లో కందిరీగ, ఓమైఫ్రెండ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంటి చిత్రాలకు కూడా నందులు వస్తాయని భావించారు. కానీ ఈ చిత్రాలు ఎందుకూ పనికిరానివిగా జ్యూరీ తేల్చేసింది. మరి కొన్ని చిన్న సినిమాలకు అసలు ఛాన్సే ఇవ్వలేదని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. ఏదేమైనా ప్రతిభకు అందించాల్సిన అవార్డులు.. ఫైరవీలకు దాసోహం అవుతున్నాయన్న విమర్శలకు అవార్డుల కమిటీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

అవార్డుల వివరాలను జ్యూరీ సభ్యులు ఎస్‌.గోపాల్‌రెడ్డి ప్రకటించారు. అవార్డులను జనవరిలో ప్రదానం చేస్తారు.

more news updates
                       drusyam.net 
 


ఉత్తమ నటుడు : మహేష్‌బాబు(దూకుడు).
ఉత్తమ నటి : నయనతార(శ్రీరామరాజ్యం).
ఉత్తమ దర్శకుడు శంకర్‌ (జైబోలో తెలంగాణ).
ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం.
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న.
ఉత్తమ ద్వితీయ చిత్రం : విరోధి.
ఉత్తమ బాలల చిత్రం : శిఖరం.
రెండో బాలల ఉత్తమ చిత్రం : గంటల బండి.
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: అవయవదానం.
ఉత్తమ హాస్యనటి : రత్నసాగర్‌.
ఉత్తమ స్క్రీన్‌ప్లే : శ్రీనువైట్ల.
ఉత్తమ గీత రచయిత : సురేందర్‌.
ఉత్తమ మాట రచయిత : నీలకంఠ(విరోధి).
ఉత్తమ సంగీత దర్శకుడు : ఇలయరాజ.
ఉత్తమ వినోదభరిత చిత్రం : దూకుడు.
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్సెంట్‌ లవ్‌
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : జైబోలో తెలంగాణ
ఉత్తమ సహాయనటుడు : ప్రకాశ్‌రాజు(దూకుడు).
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి(ఇంకెన్నాళ్లు).
ఉత్తమ కథా చిత్రం : శ్రీనువైట్ల(దూకుడు).
ఉత్తమ గాయకుడు : గద్దర్‌ ( నడుస్తున్న పొద్దు మీద…)
ఉత్తమ కెమెరామేన్‌ పీఆర్కే రాజు (శ్రీరామరాజ్యం)
త్తమ క్వారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అక్కినేని (శ్రీరామరాజ్యం).
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్మెస్‌ నారాయణ (దూకుడు).
ఉత్తమ విలన్‌ మంచు లక్ష్మీ ప్రసన్న (అనగనగా ఓ ధీరుడు).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : షాలిని.
ఉత్తమనేపథ్య గాయని : మాళవిక.
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : శ్రీను.
ఉత్తమ బాలనటుడు : మాస్టర్‌ నిఖిల్‌.
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : నాగార్జున(రాజన్న).
స్పెషల్‌ జ్యూరీ అవార్డు : చార్మి
ఉత్తమ ఎడిటర్‌ : ఎమ్‌.ఆర్‌.వర్మ.

more news updates
                       drusyam.net 

No comments:

Post a Comment