Wednesday, February 2, 2011

కనువిందు చేయనున్న క్రికెట్‌ పండుగ

క్రికెట్ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పదో ప్రపంచకప్వన్డే క్రికెట్సమరం మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. 14 జట్లు పాల్గొంటున్న మెగా క్రికెట్పండగ ఫిబ్రవరి 19 ప్రారంభం కానుంది. భారత్‌-బంగ్లాదేశ్జట్ల మధ్య మీర్పూర్లో జరిగే డే-నైట్వన్డేతో క్రికెట్సమరానికి తెరలేవనుంది. ఉపఖండంలో జరిగే ప్రపంచకప్కు భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్కూడా ఆతిథ్యదేశంగా ఉన్నా భద్రత కారణాల వల్ల అక్కడే జరిగే మ్యాచ్లను ఇతర వేదికలకు మార్చారు. పాక్లో జరగాల్సిన మ్యాచ్లను భారత్‌-శ్రీలంక దేశాలు నిర్వహించనున్నాయి. టోర్నీలో మొత్తం 14 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. జట్లను , బి గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఏడేసి జట్లు ఉంటాయి. లీగ్దశలో ప్రతి జట్టు తన గ్రూపులోని జట్టుతో తలపడుతుంది. అంటే ప్రతి జట్టు లీగ్దశలో ఆరేసి మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు క్వార్టర్ఫైనల్కు చేరకుంటాయి. లీగ్దశలో మొత్తం 42 మ్యాచ్లు జరుగుతాయి. దీనిలో అత్యధిక మ్యాచ్లకు భారత్ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్లో మొత్తం 29 మ్యాచ్లు జరుగనున్నాయి. ఫైనల్ఏప్రిల్రెండు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుగు జరుగుతుంది. రెండు సెమీఫైనల్మ్యాచుల్లో ఒకటి శ్రీలంకలో, మరోకటి భారత్లో జరుగుతాయి. తొలి సెమీస్పోరు మార్చి 29 కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో, రెండో సెమీస్మార్చి 30 మొహాలి స్టేడియంలో జరుగనున్నాయి. కాగా, క్వార్టర్ఫైనల్మ్యాచుల్లో రెండు బంగ్లాదేశ్లో జరుగుతాయి. మిగిలిన మ్యాచులకు భారత్‌, శ్రీలంక ఆతిథ్యం ఇస్తాయి. లీగ్మ్యాచ్లు మార్చి 20 ముగుస్తాయి. నాకౌట్మ్యాచ్‌(క్వార్టర్ఫైనల్స్లు మార్చిన 23 నుంచి ప్రారంభమవుతాయి.

గ్రూప్‌-బిలో భారత్‌..

భారత జట్టుకు గ్రూపు-బిలో చోటు దక్కింది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్తాన్‌లతోపాటు న్యూజిలాండ్‌, జింబాబ్వే, కెనడా, కెన్యా జట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌ తన అన్ని లీగ్‌ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. భారత్‌లో ఆడేందుకు పాక్‌ ఆసక్తి కనబరచక పోవడంతో ఆ మ్యాచ్‌లను లంకకు కేటాయించారు. కాగా, ప్రపంచకప్‌లో శ్రీలంక మొత్తం 12 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిలో ఒక సెమీస్‌, ఒక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌ ఆరు మ్యాచ్‌లకు వేదికగా నిలువనుంది. దీనిలో రెండు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. భారత్‌కు అత్యధిక సంఖ్యంలో 29 మ్యాచ్‌లు దక్కాయి. ఢిల్లిd, బెంగళూర్‌, మొహాలి, అహ్మదాబాద్‌, నాగ్‌పూర్‌, ముంబై, కోల్‌కతా, బెంగళూర్‌, చెన్నై నగరాలు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 27న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూర్‌కు మార్చారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయక పోవడంతో ఐసిసి ఈడెన్‌ నుంచి వేదికను బెంగళూర్‌కు మార్చింది. అయితే ఈడెన్‌లో జరగాల్సిన మిగతా మూడు మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం అక్కడే జరుగుతాయి.

మూడోసారి...

ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు ఇది మూడోసారి. గతంలో 1987లో పాకిస్తాన్‌తో కలిసి భారత్‌ ప్రపంచకప్‌ను నిర్వహించింది. ఇంగ్లండ్‌ తర్వాత వరల్డ్‌కప్‌ నిర్వహించే అవకాశం భారత్‌, పాక్‌లకు దక్కింది. ఈ ప్రపంచకప్‌కు రిలయన్స్‌ సంస్థ స్పాన్సర్‌గా నిలిచింది. దీంతో కప్‌ను రిలయన్స్‌ ట్రోఫీ పేరిట నిర్వహించారు. ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌లోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగింది. దీనిలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. మరోవైపు 1995-96లో కూడా భారత్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి భారత్‌, పాక్‌లతోపాటు శ్రీలంక కూడా ఆతిథ్యం పాలుపంచుకొంది. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. తాజాగా ఈ ఏడాది మరోసారి ఉపఖండంకు ప్రపంచకప్‌ నిర్వహించే అవకాశం దక్కింది. భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండడంతో అక్కడ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. దీంతో ఐసిసి పాక్‌ను టోర్నీ నిర్వాహణ బాధ్యత నుంచి తప్పించింది. అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించాయి.

అభిమానుల్లో ఉత్సాహం..

ఉప ఖండంలో ప్రపంచకప్‌ జరుగనుండడంతో ఆతిథ్య దేశాల్లో క్రికెట్‌ సందడి ప్రారంభమైంది. ముఖ్యం గా భారత్‌, బంగ్లాదేశ్‌లలో సందడి ఎక్కువగా కనిపిస్తోంది. టోర్నీ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాన నగరాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసిన క్రికెట్‌కు సంబంధించిన చర్చలే. ఫలానా జట్టు గెలుస్తోందని అప్పుడే అభిమానులు జోస్యం చెప్పడం ప్రారంభించారు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. వారి ఆశలను మోస్తూ క్రికెటర్లు కూడా మెరుగైన ఆటను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌ ఆడనున్న మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌పై అందరి దృష్టి నిలిచింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో సచిన్‌కు ప్రపంచకప్‌ ట్రోఫీ అందని ద్రాక్షగానే ఉంది. కనీసం చివరి టోర్నమెంట్‌లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలనే లక్ష్యంతో మాస్టర్‌ ఉన్నాడు.

No comments:

Post a Comment