Friday, July 27, 2012

భారతీయుల సొత్తుగా ఆకాశ హర్మ్యం..!

బుర్జ్ ఖలీఫా… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా పేరు పొందిన ఆకాశ హర్మ్యం. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా భారతీయుల సొత్తుగా మారిపోతోంది. అంబరాన్ని చుంబిస్తున్నట్టు కనిపించే ఈ ఆకాశ హర్మ్యంలో మనవాళ్ల అడ్రస్ లే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇందులో తొమ్మిది వందల వరకూ అపార్ట్ మెంట్లు ఉండగా అందులో వందకుపైగా భారతీయులవే కావడం విశేషం.

దుబాయికే మకుటంలా నిలిచిన ఈ భవంతి పొడవు 828 మీటర్లు కాగా… మొత్తం ఫ్లోర్ ఏరియా 50 లక్షల చదరపు అడుగులు. ఇందులో మొత్తం 163 ఫోర్లు ఉన్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లిఫ్ట్ లు ఈ భవంతిలో మొత్తం 54 ఉన్నాయి. రాత్రి వేళల్లో దేదీప్యమానంగా కనిపించే బుర్జ్ ఖలీఫా రోజుకు 50 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటుందంటే అవాక్కవ్వాల్సిందే. ఈ కరెంట్ తో మన దగ్గర చిన్నపాటి పరిశ్రామిక వాడలు నిరంతరాయంగా పనిచేయొచ్చు.




1 comment:

  1. that is less than 10%
    How is it going to be Indianized ?

    ReplyDelete