Sunday, March 6, 2011

విజయానికి సోపానం... ఆత్మ విశ్వాసం



విజయం సాధించాలంటే ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి. అనుకున్నంత సులభంగా దీన్ని సంపాదించలేము. ఎందుకంటే దీని కోసం పలు అంశాలను జయిం చాల్సి ఉంది. ఇది లేకపోవడాన్నే ఇన్‌ఫిరియార్టీ కాంప్లెక్స అని కూడా అంటారు. అసలేంటీ ఈ ఇన్‌ఫిరి యార్టీ కాంప్లెక్స ఎందుకు వస్తుంది కారణాలేమిటి అధిగమించడానికి మార్గాలున్నాయా అంటే ఉన్నాయి. వాటిని ఈ వారం చూద్దాం.
నేనేది సాధించలేను, నేను అందంగా లేను, నాకు ఏమీ తెలీదని ఇతరులను చూస్తే కలిగే భావనే ఇన్‌ఫిరియార్టీ కాంప్లెక్స. అంటే ఆత్మవిశ్వాసం లోపించడం, ఏపనిలో దిగినా ఈ ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని వెంటా డుతూ ఉం టుంది. దీనికి కారణం గతంలో ఏదో ఒక పనిలో మీరు విఫలం కావడమే. ఈ వైఫల్యమే మీ భవిష్యత్తులో కూడా జరుగుతుందని మీ మనస్సులో ఏర్పడే భిమే దీనికి కారణం. ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించండి అంటే మీరే ఏ పనైనా చేయగలరు. ఎవ రికీ తీసిపోరని మనసుకు గట్టిగా చెప్పు కోండి. మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధం గా ప్రవర్తిస్తే వారిని వెంటనే మన్నించండి. అలా చేయడంతో వారి తప్పు వారికే తెలి సొస్తుంది. అలాగే మీ పక్క వారిలో మంచి గుణాలు మీకు లేవని మీరు అనుకుంటే వాటిని సాధించడం కోసం ఏమి చేయాలో ఆలోచించండి. అంతేకానీ వారిపై ఈర్ష్యా ధ్వేషాలు పెంచుకోవద్దు. విజయం సాధిం చడానికి తొలి మెట్టుగా టేకిట్‌ ఈజీ విధా నాన్ని అలవర్చుకోవాలి. అంటే మీకు కావ లిసిన విషయాలను మెదడులోకి ఎక్కిం చండి. అక్కరలేని విషయాలను అక్కడే వదిలేయండి.. లేదంటే వాటి గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అనవసర విషయాలను మనసులోకి ఎక్కించుకో కుండా ప్రశాంతంగా ఉండగలిగితే అదే మీరు సాధించే తొలి విజ యం అవుతుంది.

మీలో ఆత్మన్యూనతా భావం కలుగకుండా ఉండాలంటే మీరు ఎవరిపైనా ఆధారపడకూడదు. ఎందుకంటే అంతవరకు మీ వెంట ఉన్నవారు ఒక్కసారిగా వెళ్ళిపోతే మీరు ఒత్తిడికి గురై తేరురకోలేని ప్రమాదం వుంది. మీకు మీరు స్వతంత్రంగా వ్యవహరించ డానికి అలవాటు పడండి. ఏ పని చేసినా మీరు మీపై విశ్వాసాన్ని సాధించండి. మీకు తెలియని విషయాల కోసం ఇతరుల సాయం కోరవచ్చు. కానీ అదే అలవాటుగా చేసుకోకండి. అందుకోసం ముందుగా మీరు ఆ పనిలోకి దిగండి. మీకు నష్టాలు వస్తే మీ వెనుకుండే వారిని సలహాలు అడగండి. తప్పక విజ యం మీదే అవు తుంది. పైకి రావడానికి తప్ప కుండా మీ చేయూత కావాల్సిందే. అయితే అదే మనకు శాపంగా మార కూడదని గుర్తుంచుకోండి. అంతే కాకుండా చాలా మంది తల్లి చాటు, తండ్రి చాటు బిడ్డల్లాగా పెరుగుతుంటారు. వారి తల్లిదండ్రులు మాత్రం వారి వెంట ఎంత వరకు ఉంటారనేది ఆలోచించుకోవాలి. తమంతట తాము చేసే ప్రయత్నం తప్పకుండా విజయాలను సాధించిపెడు తుంది. అయితే తల్లి చాటు బిడ్డ లక్షణా లను చాలా మంది గొప్పగా చెప్పుకుంటుం టారు. దీనిని గొప్పగా కంటే అసమర్ధత అనవచ్చు. ఎవరు ఉన్నా లేకపోయినా మనంతట మనం పనులు సాధించుకోగలిగే సత్తా ఉండాలి. అప్పుడే జీవితంలో విజయాలను సాధించగలం.

అందుకని సాధ్యమైనంత వరకు ఆధారపడటం మానేసి స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. విజయాన్ని సాధించేందుకు వ్యక్తిగత సంసిద్ధత చాలా ముఖ్యమని మనస్తత్వ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్థంగా ఉండాలని వారు అంటున్నారు. ఏదైనా సంభ్రమాన్ని కలిగించే విజయం సాధించే వ్యక్తులతో మాట్లాడటం, వారు సాధించిన స్థానాన్ని ఎలా పొందారో తెలుసుకోవడం, వారు ఎన్నెన్ని కష్టాలు అనుభవించారో వాటిని తెలుసుకోవడం వంటివి చేయాలి. వారు చేసిన పొరపాట్లు, అనుభవించిన పరాభవాలు విజయ సాధనకు దోహదపడుతాయి. దీనితో పాటు విజయం సాధించేందుకు సాహసం అవసరమని మనోతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సవాళ్ళను ఎదుర్కోవడం అధునాతన విధానాలను పాటించడం ద్వారా పాత పద్ధతులకు స్వస్తి చెప్పడం వంటివి చేస్తే కచ్ఛితంగా విజయానికి దగ్గరవుతారు. సాహసంతో కృషి కూడా తప్పకుండా ఉంటే విజయం మీకు చేరువైనట్లే!

-ఎన్‌. మానస

No comments:

Post a Comment